Jump to content

బన్ని

వికీపీడియా నుండి
బన్ని
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
తారాగణం అల్లు అర్జున్
గౌరీ ముంజల్[1]
ఫిష్ వెంకట్
భాష తెలుగు

బన్నీ వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2005లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లు అర్జున్, గౌరి ముంజల్ ప్రధాన పాత్రలు పోషించారు.

విశాఖపట్టణం లో సోమరాజు (ప్రకాష్ రాజ్) ఒక పెద్ద వ్యాపారవేత్త. హైదరాబాదు లో సోమరాజు కార్యకలాపాలను తన అనుయాయుడు మైసమ్మ (ముఖేష్ ఋషి) చూసుకొంటుంటాడు. సోమరాజు ముద్దుల కూతురు మహాలక్ష్మి (గౌరీ ముంజల్) చదివే కళాశాలలోనే బన్ని (అల్లు అర్జున్) చేరి తనని ప్రేమలో పడేస్తాడు. మొదట సందేహించినా, తర్వాత సోమరాజు వారి వివాహానికి ఒప్పుకొంటాడు. కానీ మహాలక్ష్మిని వివాహం చేసుకోవాలంటే సోమరాజు తన యావదాస్తిని తన పేర రాయాలని బన్ని అంటాడు. బన్నికి నిజంగానే సోమరాజు ఆస్తిపైన కన్ను ఉందా, లేక వేరే ఏదయినా కారణమా, అన్నదే చిత్రం ముగింపు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • మారో మారో, రచన: చంద్రబోస్ గానం.టిప్పు
  • జాబిలమ్మ వో, రచన: చంద్రబోస్,గానం. సాగర్, మాలతీ లక్ష్మణ్
  • వా వా వారెవ్వా, రచన: విశ్వా, గానం.కార్తీక్, సుమంగళి
  • మాయిలు , మాయిలు, రచన: సుద్దాల అశోక్ తేజ గానం. దేవీశ్రీ ప్రసాద్
  • కనపడలేదా , రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • బన్నీ బన్నీ , రచన: చంద్రబోస్ గానం.శ్రీలేఖ, పార్ధసారధి, మురళి.

విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=బన్ని&oldid=4371019" నుండి వెలికితీశారు