నటాషా దోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నటాషా దోషి
జననం (1993-08-02) 1993 ఆగస్టు 2 (వయసు 30)
జాతీయతఇండియన్
వృత్తినటి, మోడల్, డెంటిస్ట్[1]
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం

నటాషా దోషి (జననం 1993 ఆగస్టు 2) ఒక భారతీయ నటి, మోడల్. మలయాళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది. 2012లో అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన మాంత్రికన్‌తో ఆమె చిత్రసీమలో రంగప్రవేశం చేసింది.

జీవితం తొలి దశలో[మార్చు]

ముంబాయిలో జన్మించిన నటాషా దోషి బాల్యంలోనే నటించడం ప్రారంభించింది.[2] శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి కూడా. మిస్ కేరళ 2010లో ఆమె మిస్ టాలెంటెడ్ అవార్డును అందుకుంది.[3]

కెరీర్[మార్చు]

నటాషా దోషి మొదటి సినిమా 2012లో వచ్చిన మాంత్రికన్ అనే డాక్యుమెంటరీ హారర్-కామెడీ మలయాళ చిత్రం. అదే సంవత్సరంలో ఆమె దక్షిణ కొరియా రొమాంటిక్ డ్రామా చిత్రం 3-ఐరన్( 3-Iron) ఆధారంగా మలయాళ చిత్రం హైడ్ ఎన్ సీక్‌(Hide n' Seek)లో గౌరీగా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఆమె ఫ్రాన్సిస్ తన్నికల్ దర్శకత్వం వహించిన కాల్ మీ @(Call me @),[4] నౌషాద్ దర్శకత్వం వహించిన కాపుచినో అనే మలయాళ రొమాంటిక్ కామెడీలో జానకి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.[5] 2018లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం జై సింహా[6]తో తెలుగులో నటాషా దోషి అరంగేంట్రం చేయడమేకాక నటిగా మరింత గుర్తింపు పొందింది, ఇందులో ఆమె నయనతార, నందమూరి బాలకృష్ణలతో కలిసి నటించింది.[7][8]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

2012 మాంత్రికన్ దియా మలయాళం మొదటి మలయాళ చిత్రం
2012 హైడ్ ఎన్ సీక్‌ గౌరీ మలయాళం
2014 కాల్ మీ @ ప్రియంవద మలయాళం
2017 కాపుచినో జానకి మలయాళం
2018 జై సింహా ధన్య తెలుగు మొదటి తెలుగు చిత్రం
2018 కోతల రాయుడు ధనలక్ష్మి తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Coming back stronger". deccanchronicle.com. 6 August 2017. Retrieved 16 October 2017.
  2. "N Balakrishna's next venture to include bhojpuri actress Natasha Doshi - India Live Today Movies". indialivetoday.com. 5 September 2017. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.
  3. Staff Reporter (6 August 2010). "Thampy sweeps awards at Miss Kerala contest". Retrieved 16 October 2017 – via www.thehindu.com.
  4. "Natasha's on a signing spree - Times of India". indiatimes.com. Retrieved 16 October 2017.
  5. "Balakrishna's heroine in 'Jai Simha' is killing it on Instagram". Timesofindia.com. 11 January 2019. Retrieved 11 January 2019.
  6. "Natasha Doshi in Balakrishna's next". deccanchronicle.com. 5 September 2017. Retrieved 16 October 2017.
  7. IANS (29 August 2017). "Thrilled to be part of Balakrishna's project: Natasha Doshi". Retrieved 16 October 2017 – via Business Standard.
  8. CinemaThagaval (19 September 2017). "SURPRISING!!! Natasha Doshi is Nayanthara's Daughter - Cinema Thagaval". cinemathagaval.com. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.