Jump to content

కళ్యాణి (సినిమా)

వికీపీడియా నుండి
(కల్యాణి (1979) నుండి దారిమార్పు చెందింది)

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 1979లో కల్యాణి చిత్రాన్ని వెంకట్ అక్కినేని నిర్మించారు. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధ, సత్యనారాయణ,నటించిన ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం.సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు. యద్దనపూడి సులోచనా రాణి నవల" రాగమయీ " ఆధారం ఈ చిత్రానికి .

కల్యాణి (1979)
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
మోహన్‌బాబు,
జయసుధ,
సత్యనారాయణ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

మాగంటి మురళి మోహన్

మంచు మోహన్ బాబు

జయసుధ

కైకాల సత్యనారాయణ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు

నిర్మాత: వెంకట్ అక్కినేని

నిర్మాణ సంస్థ: అన్నపూర్ణా స్టూడియోస్

కధ: యద్దనపూడి సులోచనారాణి

సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాసం గోపాలకృష్ణ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శిష్ట్లా జానకి

విడుదల:17:08:1979.

పాటలు

[మార్చు]
  1. ఆకాశంలో హాయిగా రాగం తీసె కోయిలా జీవన - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  2. ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  3. గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా గుండెలనే - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
  4. నవరాగానికే నడకలు వచ్చెను మధు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
  5. నీ పలుకే త్యాగరాయ కీర్తన నీ నడకే క్షేత్రయ్య - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  6. లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - పి.సుశీల - రచన: డా. సినారె
  7. లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
  8. లేత లేత యెన్నెల్లో నీలి నీలి చీర కట్టి నూకాలమ్మ జాతర - ఎస్.జానకి - రచన: దాసం గోపాలకృష్ణ

మూలాలు

[మార్చు]