చంద్రలేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రలేఖ
దర్శకత్వంకృష్ణవంశీ
నిర్మాతఅక్కినేని నాగార్జున, వి. రాంప్రసాద్
తారాగణంఅక్కినేని నాగార్జున,
బ్రహ్మాజీ
రమ్యకృష్ణ
బలిరెడ్డి పృధ్వీరాజ్
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుశంకర్
సంగీతంసందీప్ చౌతా
నిర్మాణ
సంస్థ
గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
జూలై 30, 1998 (1998-07-30)
భాషతెలుగు

చంద్రలేఖ 1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సీత ఒక నిరుద్యోగి. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు వస్తాడు. అక్కడ తన అక్క, బావ ఉంటారు. తండ్రిని అన్యాయంగా ఒక బ్యాంకు కేసులో ఇరికిస్తే పూచీకత్తు కోసం పూర్వీకుల ఆస్తి అమ్మవలసి వస్తుంది. అందుకు అక్క సంతకంకోసం వాళ్ళ దగ్గరికి వెళితో బావ అతన్ని దగ్గరకు రానీడు. వేరే దారి లేక తన చిన్ననాటి స్నేహితుడైన తిరుపతి దగ్గరికి వెళతాడు. ఇద్దరూ కలిసి పండ్ల రసాల దుకాణం పెట్టాలని అనుకుంటారు కానీ లోను కోసం వెళితే బ్యాంకు మేనేజరు అంగీకరించడు.

ఒకసారి సీతా దారిలో వెళుతుండగా చంద్రిక వర్మ అనే అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆమె వీల్ చెయిర్ కే పరిమితమవుతుంది. చంద్రిక వర్మ అనే వ్యాపారవేత్త కూతురు. ఆసుపత్రిలో వాళ్ళంతా సీతారామారావును చంద్రిక భర్త రాజ్ కపూర్ అని పొరబడతారు. ఎందుకంటే ఆమె భర్తను ఇంతకు మునుపూ ఎవరూ చూసి ఉండరు. ఇంట్లో వాళ్ళు కూడా సీతా నే ఆమె భర్త అనుకుంటారు. బ్యాంకు మేనేజరుకు చంద్రిక తెలిసి ఉండటంతో ముందుగా బ్యాంకు లోను విషయంలో ఇబ్బంది పెట్టినందుకు సీతాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

చిత్రం లోని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన.

  • తకథిమి తాళాలపై తళుకుల తరంగమై (గానం: రాజేష్)
  • సాహసమే చెయ్ రా ఢింబకా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • దివ్వి దివ్వి దివితమ్ (గానం.సౌమ్యరావు , సుజాత)
  • ఒక్కసారి ఒక్కసారి ,(శ్రీనివాస చక్రవర్తి)
  • తాజహల్ నీ,(రాజేష్ కృష్ణన్, సౌమ్య రావు)
  • మొగలి పొదలు (రాజేష్ కృష్ణన్, సుజాత)
  • ఊరుములు నీ మువ్వలై,(రాజేశ్ కృష్ణన్, సుజాత .

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రలేఖ&oldid=4212925" నుండి వెలికితీశారు