భారతంలో ఒకమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతంలో ఒక అమ్మాయి
(1975 తెలుగు సినిమా)
Bharathamlo Oka Ammayi.jpg
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం తుమ్మా మర్రెడ్డి,
ముత్యాల నాగేశ్వరరావు
తారాగణం రోజారమణి ,
రాజబాబు ,
మురళీమోహన్
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ వెళాంగని పిక్చర్స్
భాష తెలుగు

భారతంలో ఒక అమ్మాయి దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1975, అక్టోబర్ 2వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  • పాటలు: ఆరుద్ర, కొసరాజు, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, వాణీజయరాం, ఎల్.ఆర్.ఈశ్వరి
  • కళ: వి.వి.రాజేంద్రకుమార్
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
  • కూర్పు: కె.బాలు
  • నృత్యం: రాజు & శేషు
  • నిర్మాతలు: తుమ్మా మర్రెడ్డి, ముత్యాల నాగేశ్వరరావు

సంక్షిప్త కథ[మార్చు]

మదన్, రాము క్లాస్ మేట్సు, రూం మేట్సు. ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ వారి ప్రవర్తనలు మాత్రం వేరువేరు. మదన్ జీవితాన్ని కులాసాగా, హాయిగా, విలాసంగా గడుపుతూ ఉంటాడు. రాము భయస్తుడు. తల్లి చెప్పుచేతల్లో నడుస్తూ ఉంటాడు. సరోజ అనే అమ్మాయి మదన్, రాములతో పాటు చదువుకుంటూ ఉంటుంది. ఆమెకు మదన్ పద్ధతులు, చేష్టలు నచ్చవు. రాముని ప్రేమిస్తూ ఉంటుంది. అది తెలుసుకున్న మదన్ వాళ్ళిద్దరికీ భగవంతుని సమక్షంలో వివాహం జరిపిస్తాడు. పెద్ద కట్నంతో కొడుకు పెళ్ళి జరిపించాలనుకున్న రాము తల్లి సులోచనాదేవి ఈ పెళ్ళిని అంగీకరించదు. ఆమె ధనదాహం గురించి తెలుసుకున్న మదన్ ఒక చిన్న నాటకమాడి సులోచనాదేవి సరోజను తన కోడలిగా అంగీకరించేటట్టు చేస్తాడు. మదన్‌ని, సరోజని వేశ్యాగృహంలో కలుసుకునేటట్టు చేసి సులోచనాదేవి వారిద్దరినీ పోలీసులకు పట్టి యిస్తుంది. దాంతో రాము తన స్నేహితుడు మదన్‌మీద, భార్య సరోజ మీద అపోహపడతాడు. సరోజ మదన్ ఉంపుడుగత్తె అని నిందమోపి ఇంటి నుండి తరిమేస్తాడు. ఆమె ఆత్మహత్య చేసుకోబోగా మదన్ వచ్చి కాపాడి ఆమెను దేవుడిచ్చిన చెల్లెలుగా భావించి ఇంటికి తీసుకుపోతాడు. సరోజ అప్పటికి నిండు చూలాలు. ఆమె ఒక యాక్సిడెంటులో చిక్కుకున్నప్పుడు మంచి హృదయంగల ధనవంతుడు ఒకడు ఆమెను కాపాడి తన ఇంటికి తీసుకువెళ్ళి ఆమె దీనగాధను వింటాడు. తర్వాత మదన్ సహాయంతో ఆ ధనవంతుడు మంచి నాటకమాడి రక్తి కట్టిస్తాడు. ఆ నాటకం వల్ల రాము, తల్లి సులోచనాదేవి, తండ్రి సన్యాసిరావు ధనవంతుడి మోసంలో పడిపోతారు. చివరకు యథార్థం తెలుసుకుని సరోజను కోడలిగా స్వీకరిస్తారు. కథ సుఖాంతమౌతుంది. [1]

పాటలు[మార్చు]

క్ర.సం పాట రచయిత పాడినవారు
1 నిన్ను ఏనాడు ప్రేమించలేను నిన్ను విడనాడి జీవించలేను ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 మావా ప్రేమా రంగమ్మ రత్నమ్మ రావమ్మా రాజమ్మా కొసరాజు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, బృందం
3 చీకటి చీకటైతే సరదా మసక చీకటైతే మరీ సరదా సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
4 భారతంలో మన భారతంలో ఈ భారతంలో ఒక అమ్మాయి శ్రీశ్రీ వాణీ జయరామ్
5 గాలిలో గాలినై ఉన్నాను నేనున్నాను ఆరుద్ర వాణీ జయరామ్

మూలాలు[మార్చు]

  1. దాసరి నారాయణరావు (1975). భారతంలో ఒక అమ్మాయి పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 13 June 2021.

బయటిలింకులు[మార్చు]