జేబు దొంగ (1975 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేబు దొంగ
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి. మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు,
మంజుల (నటి)
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ సమత అర్ట్స్
భాష తెలుగు

జేబు దొంగ 1975 ఆగస్టు 14న విడుదలైన తెలుగు సినిమా. సమతా ఆర్ట్స్ పతాకం కింద వి.ఆర్.యాచేంద్ర, కె.చటర్జీలు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, మంజుల లు నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్తకథ

[మార్చు]

రాజా పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారాడు. ఘరానా దొంగలను మట్టుపెట్టి పేదసాదలకు, అనాథ శరణాలయాలకు సహకరించాడు. కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న దేశద్రోహులను సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతనికి మాధవితో పరిచయం కలుగుతుంది. క్రమేణా ప్రణయంగా మారుతుంది. మాధవి తండ్రి రఘునాథ్ సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ప్రధానాధికారి. కల్తీ మందుల ముఠావాళ్ళు అతనిని ఎత్తుకుపోయారు. వాళ్ళ ఉనికిని కనిపెట్టడానికి రాజా, మాధవి విశ్వప్రయత్నాలు చేస్తారు. చివరకు పోలీస్ అధికారి రంగయ్యకు సన్నిహితులవుతారు. ఎస్.ఐ.రంగయ్య సహాయంతో రాజా ముఠావాళ్ళ దురంతాలు అంతం చేస్తుంటాడు. కాని ముఠానాయకుని పాచికలో పడతాడు. అతని వలలో చిక్కుకుంటాడు. దుష్టులు చివరికి పట్టుబడాతారు. శిష్ట రక్షణ జరుగుతుంది.

పాటలు

[మార్చు]
  1. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. గోవిందో గోవింద గుట్టుకాస్తా గోవిందా లడ్డులాంటి -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. చల్లంగ ఉండాలి మా రాజులు నిండుగ ఉండాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.చక్రవర్తి, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
  4. చూశారా పిల్లదాన్ని షోకైన కుర్రదాన్ని తోసింది ఒక్క - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. బాబూ దోబూచులా నాతొ దొంగాటలా నా కళ్ళు మూసి - పి. సుశీల - రచన: ఆత్రేయ
  6. రాధా అందించు నీలేత పెదవి యెహే లాలించి తీరాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
  7. రేగాడు రేగాడు కుర్రాడు ఇంక ఆగమన్నా ఆగేట్టులేడు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం- రచన: ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  1. "Jebu Donga (1975)". Indiancine.ma. Retrieved 2023-05-31.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటిలింకులు

[మార్చు]