మహాత్ముడు
మహాత్ముడు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం. ఎస్. గోపీనాథ్ |
---|---|
నిర్మాణం | ఎం.ఎస్. గోపీనాథ్ |
కథ | ఎం.ఎస్. గోపీనాథ్ |
చిత్రానువాదం | ఎం.ఎస్. గోపీనాథ్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శారద |
ఛాయాగ్రహణం | పి.ఎస్. సెల్వరాజ్ |
కూర్పు | ఐ.వి.షణ్ముగం |
నిర్మాణ సంస్థ | రాజేశ్వరీ చిత్ర |
భాష | తెలుగు |
మహాత్ముడు 1976 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజేశ్వరి చిత్ర బ్యానర్‌లో ఎంఎస్ గోపీనాథ్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శారదా ప్రధాన పాత్రలలో నటించారు. టి. చలపతి రావు సంగీత రచన చేసాడు.[1]
కథ
[మార్చు]జమీందారు పార్వతమ్మ (జి. వరలక్ష్మి) కు ఇద్దరు కుమారులు -వేణు గోపాల్ (అక్కినేని నాగేశ్వరరావు), నంద గోపాల్ (సత్యనారాయణ). పెద్దవాడు నంద గోపాల్ దత్తుడైనప్పటికీ, ఆమె ఇద్దరినీ సమానంగా చూస్తుంది. ఇద్దరిని గోపాల్ అనే పిలుస్తుంది. వేణు ఒక తెలివైన అమ్మాయి సీతను (శారద) ప్రేమిస్తాడు. అతడు తల్లికి ఈ సంగతి చెప్పడానికి ముందే, అనుకోకుండా, నందుకు సీత పరిచయమై ఆమెను ఇష్టపడటం ప్రారంభిస్తాడు. ఇది తెలుసుకున్న పార్వతమ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళి సంబంధం మాట్లాడుతుంది. ఇద్దరి పేర్లతో ఉన్న గందరగోళం కారణంగా సీత కూడా సంబంధానికి అంగీకరిస్తుంది. దాని గురించి తెలుసుకున్న వేణు కుమిలి పోతాడు. కానీ వెంటనే కోలుకుంటాడు. నందూను పెళ్ళి చేసుకునేందుకు సీతను ఒప్పిస్తాడు.
కుటిలుడైన మేనేజరు బసవయ్య (అల్లు రామలింగయ్య) నందులో అనుమానాన్ని రేకెత్తించి వేణు సీతల ప్రేమ వ్యవహారం గురించి తెలుస్కునేలా చేస్తాడు. దానితో వేణును ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. మార్గంలో, జమీందారు రంగనాథం (కాంతారావు) కుమార్తె రాధ (ప్రభా) ఆత్మహత్య చేసుకోబోతూండగా ఆమెను రక్షిస్తాడు. పెళ్ళికి ముందే గర్భవతి కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆమె బిడ్డకు చట్టబద్ధత ఇచ్చేందుకు, వేణు ఆమెకు భర్తగా నటిస్తాడు. మరొక వైపు, నందు దుష్టుడైన గిరి (గిరి బాబు) మాయలో పడి చెడు అలవాట్లకు బానిసౌతాడు. సమయం గడిచిపోతుంది, సీత, రాధ తల్లులౌతారు. పార్వతమ్మ కన్నుమూస్తుంది.
వేణు చుట్టుపక్కల ఉన్న నిర్భాగ్యులకు మెరుగైన జీవితాన్నిస్తాడు. ఆ ప్రాంతంలోని వారు అతన్ని ఒక దేవుడిగా ఆరాధిస్తారు. ఇక్కడ, గిరి సీతపై కన్ను వేస్తాడు. అవమానంతో ఆమె కూడా ఇల్లు వదిలి వెళ్ళి, అదృష్టవశాత్తు వేణుని చేరుకుంటుంది. మరోవైపు గిరి, బసవయ్యలు నందూను మోసం చేసి అతనిని బయటకు తోసేస్తారు. ఆ తరువాత, రాధను మోసం చేసిన గిరి, ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో, అతను సీతను చూసి, ఆమెను మానభంగం చేసేందుకు ప్రయత్నించగా, విధి వశాత్తు నందు అక్కడికి వచ్చి, ఆమెను రక్షిస్తాడు. రాధ గిరిని చంపేందుకు ప్రయత్నించగా, వేణు అడ్డుకుంటాడు. చివరికి, గిరి క్షమాపణ చెప్పి రాధను దగ్గరకు తీసుకుంటాడు. చివరగా, వేణు తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం అంకితం చేయడంతో సినిమా ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]- వేణు గోపాల్ గా అక్కినేని నాగేశ్వరరావు
- సీతగా శారద
- నంద గోపాల్ గా సత్యనారాయణ
- ప్రసాద్ పాత్రలో మురళి మోహన్
- రంగనాథంగా కాంత రావు
- బసవయ్యగా అల్లు రామలింగయ్య
- డాక్టర్‌గా ముక్కమల
- గిరి పాత్రలో గిరిబాబు
- భజరంగంగా కె.కె.శర్మ
- పార్వతమ్మగా జి. వరలక్ష్మి
- పద్మగా రోజారమణి
- రాధాగా ప్రభ
- ఐటెమ్ నంబర్‌గా జయమాలిని
- ఝాన్సీ
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కళ: జి.వి.సుబ్బారావు
- నృత్యాలు: చిన్ని-సంపత్, తారా
- సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, కోసరాజు
- నేపథ్య గానం: వి.రామకృష్ణ, పి.సుశీలా, మాధవపెద్ది రమేష్, విల్సన్, ఎల్ఆంజలి
- సంగీతం: టి. చలపతి రావు
- కూర్పు: IV షణ్ముగం
- ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
- కథ - చిత్రానువాదం - నిర్మాత - దర్శకుడు: ఎంఎస్ గోపీనాథ్
- బ్యానర్: రాజేశ్వరి చిత్ర
- విడుదల తేదీ: 1977
పాటలు
[మార్చు]సం. | పాట | సాహిత్యం | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "పాడనా నే పాడనా" | కొసరాజు | పి. సుశీల | 4:15 |
2 | "ఎంత మధురం" | సి.నారాయణ రెడ్డి | పి. సుశీల | 4:45 |
3 | "చిట్టి పాపా" | కొసరాజు | వి.రామకృష్ణ, పి.సుశీల | 3:55 |
4 | "ఎంతగా చూస్తున్న" | సి.నారాయణ రెడ్డి | వి.రామకృష్ణ, పి.సుశీల | 5:08 |
5 | "ఎదురుగా నీవుంటే" | సి.నారాయణ రెడ్డి | వి.రామకృష్ణ, పి.సుశీల | 4:53 |
6 | "రంభ లాగా" | కొసరాజు | మాధవపెద్ది రమేష్, విల్సన్, ఎల్.ఆర్.జంజలి | 4:32 |
7 | "మనిషి మనిషిగా" | సి.నారాయణ రెడ్డి | వి.రామకృష్ణ | 3:22 |