యువరాజు (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువరాజు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వెంకట్ అక్కినేని
నాగార్జున అక్కినేని
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ ,
సుజాత
సంగీతం కె. చక్రవర్తి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు బి. కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ లలని చిత్ర
భాష తెలుగు

యువరాజు 1982 లో వచ్చిన సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై [1] దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించారు.[2] అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, సుజాత ప్రధాన పాత్రల్లో నటించారు.[3] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[4]

కోటీశ్వరుడు రాజేష్ (అక్కినేని నాగేశ్వరరావు) ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతూంటాడు. డాక్టర్ కరుణ (సుజాత) రాజేష్‌కు పరిచయమవుతుంది. అతనొక తిరుగుబోతు అని తెలిసి కూడా మౌనంగా అతన్ని ప్రేమిస్తుంది. రాజేష్ వారి ఎస్టేట్కు వెళ్ళిన తరువాత, ఆశా (జయసుధ) అనే అందమైన, అమాయక, మనోహరమైన అమ్మాయిని గూండాల చేతిలో నుండి కాపాడుతాడు. నిజానికి, ఆశా ఒక అమ్నిసియాక్ రోగి. ఆమె తన గతం గుర్తుండదు. రాజేష్‌కు అది తెలియదు. తన కలల అమ్మాయిగా ఊహించుకుని ఆమెను ప్రేమించడం మొదలెడతాడు. ఒక రాత్రి వారికి లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఆ తరువాత, రాజేష్ ఆశాతో పాటు నగరానికి వెళతాడు, అక్కడ పులి పాపా రావు (అల్లు రామలింగయ్య) ను తన తండ్రిగా చూపిస్తూ ఆమె అతన్ని తప్పుదారి పట్టిస్తుంది. దీనిని నమ్మిన రాజేష్, తన తండ్రి రంగా సుబ్బారావు (ప్రభాకర్ రెడ్డి) ను పులి పాపా రావు కుమార్తె డాక్టర్ కరుణతో పెళ్ళి సంబంధం మాట్లాడేందుకు పంపిస్తాడు. ఇక్కడ, అదృష్ట చక్రం రంగా సుబ్బారావు & పులి పాపా రావు మంచి పాత స్నేహితులు. వారు ఈ సంబంధానికి సంతోషంగా అంగీకరిస్తారు. పెళ్ళి సమయంలో, రాజేష్ కరుణను చూసి షాక్ అవుతాడు. మొత్తం కథను వెల్లడిస్తాడు. ఆమె విరిగిన హృదయంతో పెళ్ళిని విరమించుకుంటుంది.

ఇప్పుడు రాజేష్ ఆశా కోసం వెతుకుతాడు, అప్పటికి, ఆమె తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతుంది. ఆమె పేరు జ్యోతి. ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె సోదరుడు రామకృష్ణ (శ్రీధర్) ఆమెను మురళి (మురళి మోహన్) అనే వ్యక్తితో పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటాడు. దాని గురించి తెలుసుకున్న రాజేష్, నిరాశకు గురై తాగుబోతు అవుతాడు, ఆ దుస్థితి సమయంలో, కరుణ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అతను కూడా ఆమె ప్రేమను గ్రహించి, ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో, దురదృష్టవశాత్తు, ఆశా / జ్యోతి రాజేష్‌తో తన సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. పైగా ఆమె గర్భవతి కూడా అవుతుంది. రాజేష్ కరుణతో సహజీవనం చేస్తున్నాడు కాబట్టి, ఆషా / జ్యోతి తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటుంది. కరుణ కూడా అప్పటికే ఆ నొర్ణయం తీసుకుంటుంది. కానీ, రాజేష్ వారిద్దరి ప్రేమనూ కోరుకుంటాడు. వారు కూడా సుముఖంగా ఉన్నారు కాని నాగరిక సమాజ నిబంధనలను ఉల్లంఘిస్తారనే భయంతో సంశయిస్తారు. పిరికితనం వల్ల వారి ఆనందాన్ని వదులుకోవద్దని, సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని రాజేష్ వారిని ఒప్పిస్తాడు. చివరగా, ఈ చిత్రం అందరూ ఒకే కప్పు క్రింద సంతోషంగా ఉండగా సినిమా ముగుస్తుంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 నారీ నారీ నడుమ మురారీ ఎస్పీ బాలు 6:15
2 అందగాడు ఎస్పీ బాలు, పి.సుశీల 4:40
3 నెలలు ఎస్పీ బాలు, పి. సుశీల 4:20
4 ఎవరో చెప్పారు ఎస్పీ బాలు, పి. సుశీల 4:42
5 నీలాలా నింగి ఎస్పీ బాలు, పి. సుశీల 4:45
6 ఎవరా నలుగురు ఎస్పీ బాలు 4:38

మూలాలు

[మార్చు]
  1. "Yuvaraju (Banner)". Know Your Films.
  2. "Yuvaraju (Direction)". Spicy Onion.
  3. "Yuvaraju (Cast & Crew)". Tollywood Times.com. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-23.
  4. "Yuvaraju (Review)". The Cine Bay. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-23.