బద్రినాథ్ (సినిమా)

వికీపీడియా నుండి
(బద్రీనాధ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బద్రీనాధ్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
నిర్మాణం అల్లు అరవింద్
రచన చిన్నికృష్ణ
కథ చిన్నికృష్ణ
చిత్రానువాదం వి.వి.వినాయక్
తారాగణం అల్లు అర్జున్
తమన్నా
ప్రకాష్ రాజ్
బ్రహ్మానందం
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంభాషణలు రాజేంద్ర కుమార్
ఛాయాగ్రహణం రవి వర్మన్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
విడుదల తేదీ 10 జూన్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బద్రీనాథ్, [1] 2011 లో వచ్చిన యాక్షన్ చిత్రం దర్శకత్వం వివి వినాయక్ దర్శకుడు, చిన్ని కృష్ణ రచయిత. ఇందులో అల్లు అర్జున్, తమన్నా, ప్రకాష్ రాజ్, కెల్లీ డోర్జీ, అశ్విని కల్సేకర్, రాకేశ్ వర్రే, రావు రమేష్, ప్రగతి నటించారు.

కథ[మార్చు]

పురాతన హిందూ దేవాలయాలను ఉగ్రవాదుల నుండి రక్షించడానికి, మత గురువు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు భీష్మా నారాయణ్ ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. ఒక రోజు, అతని విద్యార్థులు కొందరు విష్ణు సహస్రనామం నుండి కష్టమైన శ్లోకాన్ని పఠించడంలో విఫలమైనప్పుడు, బద్రి అనే చిన్న పిల్లవాడు అది చదవడం విని ఆశ్చర్యపోతాడు. భీష్మ బద్రి తల్లిదండ్రులను ఒప్పించి తీసుకువెళతాడు. బద్రి సమర్థవంతమైన పోరాట యోధుడిగా ఎదిగి బద్రీనాథ్ ఆలయాన్ని రక్షించడానికి నియమించబడతాడు. అతను త్వరలోనే అలకనంద అనే సందర్శకురాలిని చూస్తాడు. బద్రీనాథ్ చేరుకున్న తరువాత ఆమె తాత అనారోగ్యానికి గురవుతాడు. బద్రీ అతన్ని నయం చేసి, వారందరినీ ఆలయానికి తీసుకువెళతాడు. అక్కడ అలకానంద దీపం ఆర్పుతుంది. దీనివల్ల బద్రీ ఆమెను వెంబడించి అలకనంద నదిలో పడవేస్తాడు. ఆమె నాస్తికత్వం గురించి తాత భీష్మకు చెప్పి ఆమెను రక్షించమని కోరుతాడు. బద్రి అలకానందను రక్షించి, తన గురువు ఆదేశాల మేరకు, ఆమెకు శిక్షగా లక్ష దీపాలను వెలిగించాలని ఆదేశిస్తాడు. భక్తితో దీపాలను వెలిగించమని బద్రి ఆమెను ఒప్పిస్తాడు. దాని తరువాత ఆమె ఎందుకు నాస్తికురాలు అయిందో తాత చెబుతాడు. ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు చనిపోవడాన్ని చూసిన అలకానందకు దేవునిపై విశ్వాసం పోతుంది. భయంకరమైన డాన్ అయిన సర్కార్ భార్యను అవమానించిన తరువాత ఆమె జీవితం ప్రమాదంలో పడింది. అంచేత ఆమెను బద్రీనాథ్కు తీసుకురావలసి వచ్చింది. ప్రతీకారం తీర్చుకోడంలో భాగంగా, అలకనంద తన కొడుకు నానిని పెళ్ళి చేసుకోవాలని ఆమె వత్తిడి చేస్తుంది. అసలు విషయం తెలుసుకున్నబద్రీ, భగవంతునిపై అలకానంద విశ్వాసాన్ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశాడు.

ఇదిలా ఉండగా ఉగ్రవాదులు అమర్‌నాథ్ ఆలయంపై దాడి చేసి. దాని రక్షకుణ్ణి చంపేస్తారు. భక్తులకు రక్షణగా భీష్మ, బద్రిని పిలుస్తాడు. అతడు ఉగ్రవాదులందరినీ చంపేస్తాడు. అలకనంద బద్రీతో ప్రేమలో పడుతుంది. ఆమెకు దేవునిపై విశ్వాసం తిరిగి ఏర్పడుడుతుంది. ఆమె బద్రి తల్లిదండ్రులను కలుస్తుంది, అతని పట్ల తన ప్రేమ గురించి చెబుతుంది. వారు వారి పెళ్ళికి అంగీకరిస్తారు. కాని భద్రీ తన వారసుడిగా ఉండాలని కోరుకుంటున్నానని. అతడు అవివాహితుడిగా ఉండాలని భీష్మ చెప్పినప్పుడు, మనసు విరిగిన అలకనంద మరోసారి తన విశ్వాసాన్ని కోల్పోవటం ప్రారంభిస్తుంది. ఆమెను తన ప్రేమికుడితో ఏకం చేస్తానని, ఆమె కోరిక నెరవేర్చడం కోసం బద్రీనాథుడికి అర్పించవలసిన బ్రహ్మ కమలం తెచ్చేందుకు ఆమెకు సయం చేస్తాననీ బద్రీ ఆమెకు చెబుతాడు. అయితే, తాను ప్రేమిస్తున్నది అతన్నేనని ఆమె చెప్పదు.

బద్రిపై అలకనంద ప్రేమ ఏ తీరానికి చేరుతుంది, భీష్మ ఆమె ప్రేమకు అడ్డు తప్పుకుంటాడా, సర్కార్ మనుషులు అలకనందను ఏ కష్టాల పాలు చేస్తారు, బద్రి ఈ సమస్యలకు పరిష్కారాలు చూపించగలిగాడా అనేది మిగతా కథ

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఓంకారేశ్వరి"  శంకర్ మహదేవన్, కీరవాణి 4:58
2. "అంబాదరి"  రేవంత్, శ్రావణ భార్గవి 4:05
3. "ఇన్ ది నైట్"  బాబా సెహగల్, శ్రావణ భార్గవి 2:58
4. "నచ్చావురా"  శ్రీరామచంద్ర, చైత్ర 3:57
5. "నాథ్ నాథ్"  జస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్ 4:09
6. "చిరంజీవా"  రేవంత్, శ్రేయా ఘోషాల్, గీతామాధురి 4:39
7. "అంబాదరి"  అనుజ్, గీతామాధురి, కాలభైరవ 3:45
8. "వసుధారా"  కీరవాణి, శ్వేతా పండిట్ 5:00
9. "బద్రీనాథ్"  దినేష్ బృందం 2:14
35:49

మూలాలు[మార్చు]

  1. "Badrenath (Original Motion Picture Soundtrack)".