కెల్లీ డార్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కెల్లీ డోర్జీ
జననం
కాల్డెన్ సోనమ్ దోర్జీ

(1971-01-04) 1971 జనవరి 4 (వయసు 53)
జాతీయతభూటానీస్
వృత్తినటుడు, మోడల్, కళాకారుడు
తల్లిదండ్రులు

కాల్డెన్ సోనమ్ దోర్జీ (ఆంగ్లం: Kalden Sonam Dorji; జననం 1971 జనవరి 4) భూటాన్ నటుడు, మోడల్. ఆయన ప్రధానంగా భారతీయ సినిమాలలో నటిస్తున్నాడు.

జీవితం తొలి దశలో[మార్చు]

అతని తండ్రి లిన్పో పాల్జోర్ దోర్జీ, భూటాన్ నేషనల్ ఎన్విరాన్‌మెంట్ కమీషన్‌కి శాశ్వత సలహాదారు. కాగా, తల్లి లూయిస్ డోర్జీ, పిల్లల పుస్తకాల రచయిత, భూటాన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ వ్యవస్థాపక సభ్యురాలు.

ఆయన డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో, తూర్పు భూటాన్‌లోని షెరుబ్ట్సే కళాశాలలో చదివాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చరిత్రలో ఆనర్స్ డిగ్రీని పొందాడు. అతని తాత భూటాన్ ప్రధాని జిగ్మే పాల్డెన్ దోర్జీ.

కెల్లీ డార్జ్ భూటాన్‌లోని దోర్జీ కుటుంబం, సిక్కిం రాజవంశంలకు చెందిన వారసుడు.[1][2]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష
2005 నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో హిడెకి టోజో హిందీ
2005 టాంగో చార్లీ బోడో మిలిటెంట్ లీడర్ హిందీ
2005 ఖామోష్... ఖౌఫ్ కీ రాత్ నేరస్థుడు హిందీ
2005 చాక్లెట్ రోషన్ అబ్బాస్ హిందీ
2005 ఫారెబ్ ఇన్స్పెక్టర్ కెల్లీ డోర్జీ హిందీ
2005 ఏక్ అజ్నబీ బ్యాంకాక్ పోలీసు అధికారి కెల్లీ హిందీ
2007 డాన్ స్టీఫెన్/ఫిరోజ్ తెలుగు
2008 ముఖ్బీర్ హిందీ
2008 కింగ్ సింగింగ్ వాయిస్ తెలుగు
2009 ద్రోణ తెలుగు
2009 బిల్లా రషీద్ (డ్రగ్ డీలర్) తెలుగు
2010 అసల్ బ్రిజేష్ శెట్టి తమిళం
2010 కేడి విక్టర్ తెలుగు
2010 లాహోర్ గజానన హిందీ
2010 గోలీమార్ ఖలీద్ తెలుగు
2010 క్రాంతి వీర్ - ది రివల్యూషన్ హిందీ
2010 సేమ్ గవై తాషా పైలట్ జోంగ్ఖా
2011 బద్రీనాథ్ సర్కార్ తెలుగు
2011 దడ కెల్లీ తెలుగు
2011 ది లాస్ట్ గోల్డ్ ఆఫ్ ఖాన్ పావో ఆంగ్లం
2012 రెబల్ APC-MI6 తెలుగు
2013 బాద్‍షా సాధు భాయ్ తెలుగు
2014 1 - నేనొక్కడినే ఆంటోనియో రోసారియస్ తెలుగు
పవర్ నాయక్ కన్నడ
బ్రదర్ అఫ్ బొమ్మలి తెలుగు
అంబరీష RDX కన్నడ
2015 ఎడవపాటి మలయాళం

మూలాలు[మార్చు]

  1. Metho's Great Adventure. ASIN 999366345X.
  2. "11 New Children's Books Published". Save the Children.