Jump to content

ఎవడి గోల వాడిది

వికీపీడియా నుండి
ఎవడి గోల వాడిది
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం ఆర్యన్ రాజేష్, దీపిక, బ్రహ్మానందం, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, బాబు మోహన్, కృష్ణ భగవాన్, మల్లికార్జునరావు, ఎల్. బి. శ్రీరాం
గీతరచన వరికుప్పల యాదగిరి
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఎవడి గోల వాడిది 2005 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో ఆర్యన్ రాజేష్, దీపిక నాయకా, నాయికలుగా నటించారు.

వీరశంకర్ ఆర్తి అనే అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతాడు. కానీ ఫ్యాక్షనిస్టు బక్కారెడ్డి తన కూతురుని అతనికిచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటూ ఉంటాడు. అతని ప్రేమ విషయం తెలిసి వారిద్దరినీ చంపమని తన గూండాలని పురమాయిస్తాడు. ఇద్దరూ కలిసి బ్యాంకాక్ కి పారిపోతే బక్కా రెడ్డి తన ముఠాతో కలిసి అక్కడికి చేరుకుని తెలుగు వాళ్ళు నడుపుతున్న హోటల్ లో ఉంటారు.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]