Jump to content

రాజా గౌతమ్

వికీపీడియా నుండి
రాజా గౌతమ్ కన్నెగంటి
జననం
హైదరాబాదు, తెలంగాణ
వృత్తినటుడు
జీవిత భాగస్వామిజ్యోత్స్నా రెడ్డి (m. 2012)
పిల్లలు2
తల్లిదండ్రులుకన్నెగంటి బ్రహ్మానందం, లక్ష్మి

రాజాగౌతమ్ కన్నెగంటి ఒక భారతీయ చలనచిత్ర నటుడు. ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం కుమారుడు.[1]

జననం, విద్య

[మార్చు]

ఆయన 1988లో కన్నెగంటి బ్రహ్మానందం, లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. ఆయనకు ఒక తమ్ముడు సిద్ధార్థ్. ఆయన హైదరాబాదులోని సెయింట్ మేరీస్ కాలేజీ నంచి బి.బి.ఎ పూర్తిచేసాడు.

కెరీర్

[మార్చు]

2004 సంవత్సరం కె.సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వం వహించిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో రాజా గౌతమ్ అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత 2011లో వచ్చిన వారెవా సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. బసంతి (2014), చారుశీల (2016), మను (2018) లాంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందాడు. కాగా 2022 సంవత్సరం రాజా గౌతమ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న బ్రేక్ అవుట్ చిత్రం సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో రూపొందుతోంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2004 పల్లకిలో పెళ్లికూతురు
2011 వారెవా
2014 బసంతి
2016 చారుశీల
2018 మను
2022 బ్రేక్ అవుట్ [2]
2025 బ్రహ్మ ఆనందం [3]

మూలాలు

[మార్చు]
  1. "Brahmanandam son Raja Goutham Blessed With Baby Girl - Sakshi". web.archive.org. 2022-11-27. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "'బ్రేక్ అవుట్'తో వస్తున్న బ్రహ్మానందం తనయుడు". web.archive.org. 2022-08-31. Archived from the original on 2022-08-31. Retrieved 2022-11-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Brahmanandam and son Raja Goutham join hands for 'BhrahmaAnandam'" (in Indian English). The Hindu. 8 May 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.