శక్తి (2011 సినిమా)

వికీపీడియా నుండి
(శక్తి(2010 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శక్తి
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం మెహర్ రమేష్
నిర్మాణం అశ్వనీ దత్
కథ జె. కె. భారవి
యండమూరి వీరేంద్రనాథ్
తారాగణం జూనియర్ ఎన్.టి.ఆర్.
ఇలియానా
సోనూ సూద్
ప్రభు గణేశన్
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
కూర్పు శ్రీనివాస్ రావు
నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్
భాష తెలుగు

శక్తి 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సొంత పతాకం వైజయంతీ మూవీస్ లో జూనియర్ ఎన్.టి.ఆర్, ఇలియానా నాయకా నాయికలుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిని చిత్రం.

అత్యంత ఖరీదైన తెలుగు సినిమాలలో ఇది ఒకటి. శక్తి 2011 ఏప్రిల్ 1 న విడుదలైంది, ఓం శక్తి అనే పేరుతో తమిళ డబ్ వెర్షన్ 2011 ఏప్రిల్ 2 న విడుదలైంది.[1][2] ఇది ప్రపంచవ్యాప్తంగా 700 కి పైగా స్క్రీన్లలో ప్రారంభమైంది, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి.[3][4][5]

ఫక్తూని అనే ఈజిప్టు మహిళ తన భర్త ముక్తార్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేసి, తన కుమారులైన బషీమ్, రాఖాకు శిక్షణ ఇస్తుంది. ఆమె ఒక మాయా జ్వాలాముఖి వజ్రం, రుద్ర త్రిశూలాన్ని తిరిగి పొందాలనుకుంటుంది. భారత హోంమంత్రి మహదేవరాయ వద్ద వజ్రం ఉందని ఆమె సోదరుడు జాఫర్ వెల్లడిస్తాడు. దాన్ని తిరిగి పొందటానికి వాళ్ళు, అతడి కుమార్తె ఐశ్వర్యను లక్ష్యంగా చేసుకుంటారు. ఆమె తెలియకుండానే తన సంచిలో వజ్రాన్ని వేసుకుని, తల్లిదండ్రులకు తెలియకుండా తన స్నేహితులతో జైపూర్ విహారయాత్రకు వెళ్తుంది. వారు శక్తి అనే టూరిస్ట్ గైడ్‌ను కలుస్తారు. ఐశ్వర్య ఇంట్లో లేదని మహాదేవరాయ తెలుసుకుంటాడు. ఆమెను కనుగొనడానికి ఇద్దరు పోలీసు అధికారులను నియమిస్తాడు. మహాదేవరాయ తన మాజీ భాగస్వామి జాకీని తన మొత్తం సంపదను ఇచ్చేస్తాను, త్రిశూలాన్ని ఇమ్మని అభ్యర్థిస్తాడు. కాని జాకీ నిరాకరిస్తాడు. ఐశ్వర్య కాశ్మీర్‌లో ఉండగా తన ప్రాణాలను కాపాడిన శక్తిని ప్రేమిస్తుంది. తరువాత, ఆమెను బషీమ్ అనుచరులు కిడ్నాప్ చేస్తారు. కాని శక్తి ఆమెను రక్షిస్తాడు. వారు ఇప్పుడు హరిద్వార్ వెళుతున్నారని బషీమ్ తెలుసుకుంటాడు. అక్కడ శక్తి గంగానదిలో స్నానం చేసేటపుడు వజ్రం కనిపిస్తుంది. ఒక ఋషి దానిని గ్రహించి, మహదేవరాయకు వజ్రం గురించి, ఐశ్వర్య రక్షకుడి రాక గురించీ తెలియజేస్తాడు. ఐశ్వర్య కోసం వెతుకుతున్న ఇద్దరు పోలీసులు హరిద్వార్లో ఆమె ఉనికి గురించి తెలియజేస్తారు. నగరం విడిచి వెళ్ళేటప్పుడు ఐశ్వర్య శక్తికి ప్రపోజ్ చేసినా అతను నిరాకరిస్తాడు. త్వరలోనే బషీమ్, అతని అనుచరులు వారిపై దాడి చేస్తారు. కాని రహస్య ఏజెంట్ అని వెల్లడైన శక్తి, అందరినీ రక్షిస్తాడు. భారీ షూటౌట్ తర్వాత బషీమ్ను బంధిస్తాడు.

మరోవైపు, ఫక్తూని జాకీ నుండి త్రిశూలాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నిస్తాడు, కాని అతను భారీ మొత్తాన్ని కోరుతాడు. వజ్రం గురించి ఐశ్వర్యను ప్రశ్నించినా ఆమెకు ఏమీ తెలియదు. ఐశ్వర్య ఒక ఉగ్రవాద సంస్థకు లక్ష్యంగా ఉన్నందున ఆమెను రక్షించడానికి తాను రహస్యంగా వెళ్ళానని తన ఆఫీసరు (స్వయంగా అతడి తండ్రే) శివకు శక్తి వివరిస్తాడు. మరోవైపు, బషీమ్‌ను రక్షించడానికి రాఖాను భారత్‌కు పంపుతారు. ఐశ్వర్య శక్తి సంచిలో ఆమె చిత్రాలను కనుగొంటుంది. ఇది శక్తి ఆమెను చూసిన క్షణం నుంచీ తాను ప్రేమిస్తున్నానని ఒప్పుకుంటాడు. శక్తి, తన తల్లిదండ్రులు, ఐశ్వర్యతో కలిసి తన పుట్టినరోజు కోసం ఆలయానికి వెళ్లి, జ్వాలాముఖి ఉన్న పెట్టెను చూసి దానిని తెరుస్తుంది. శివ మహాదేవరాయకు సమాచారం ఇస్తాడు. వజ్రం, ఐశ్వర్య రెండింటినీ హంపికి పిలుస్తారు. రాఖా జైలుపై దాడి చేసి, బషీమ్‌ను విడిపిస్తాడు. శివ హంపికి వెళుతున్నాడని అతడు రాఖాకు చెబుతాడు. రాఖా శివపైన ఇతర అధికారులపైనా దాడి చేస్తాడు. కాని శక్తి వజ్రాన్ని తాకడంతో అతడికి శక్తులు వస్తాయి. అంచేత శక్తి చేతిలో రాఖా గాయపడతాడు. హంపి వద్ద, బషీమ్ వజ్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కాని శక్తి పురాతన కత్తితో అత్ణ్ణి చంపేస్తాడు. శక్తిని రక్షకుడిగా ప్రకటిస్తూ ఋషి, రహస్య శక్తి పీఠానికి రక్షకుడైన రుద్ర గర్భవతి అయిన తన భార్యను, మహాదేవరాయ తల్లిదండ్రులనూ ముక్తార్ నుండి రక్షించుకుంటూ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడో వివరించాడు. మొదట్లో జానకి వర్మ అని పిలువబడే జాకీ, ముక్తార్ ఇచ్చిన డబ్బు తీసుకుని మహదేవరాయ తల్లిదండ్రులను చంపాడు. రుద్ర త్రిశూలంతో పారిపోయాడు. ముక్తార్‌ను చంపిన తరువాత, మరణిస్తున్న శక్తి తన నవజాత కొడుకును తన నమ్మకమైన సేవకుడు బసవకు అప్పగించి, అతన్ని నది మీద పంపించాడు. అతను శివకు అతని భార్యకూ కనిపించడు. వారు అతన్ని శక్తిగా పెంచారు.

జాకీ అనుచరులను, జాఫర్‌ను జాకీనీ చంపిన తరువాత శక్తి త్రిశూలాన్ని తిరిగి పొందుతాడు. అయితే, మహాదేవరాయ భాగస్వామి ప్రచండ, ద్రోహం చేసి, శక్తిని కాలుస్తాడు. అప్పుడు త్రిశూలాన్ని సంపాదించి, దాన్నతడు ఫక్తూనికి అప్పగిస్తాడు. ఆమె పునరుత్థానమైన రాఖాతో కలిసి అక్కడికి వస్తుంది. మహాదేవరాయ ప్రచండను పొడిచి చంపుతాడు. రాఖా అతణ్ణి కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలో పడతాడు. ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్మలు చేయటానికి ఫక్తూని, ఋషినీ ఐశ్వర్యనూ బలవంతంగా తీసుకు పోతుంది. రాఖా విధ్వంసం ప్రారంభించగానే, శక్తి వచ్చి త్రిశూలాన్ని ఉపయోగించి పోరాడుతాడు. అప్పుడు జ్రిగే పోరాటాల్లో శక్తి దుష్టులను చంపేసి కథను సుఖాంతం చేస్తాడు.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."తాలియా తాలియా"రామజోగయ్య శాస్త్రిరంజిత్5:16
2."ప్రేమ దేశం"రామజోగయ్య శాస్త్రిహేమచంద్ర, సైంధవి4:36
3."మతిలేక పిచ్చిగా"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావురంజిత్, చిన్మయి4:00
4."సుర్రో సుర్రా"రామజోగయ్య శాస్త్రిజావేద్ ఆలి, సుచిత్ర5:27
5."యమగా ఉందే"రామజోగయ్య శాస్త్రికారుణ్య, మాళవిక4:22
6."మహిషాసుర మర్దిని"ఆది శంకరాచార్యులుశరత్, శ్రీవర్ధిని5:52
7."మహారుద్ర శక్తి"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుమురళీధర్, రంజిత్, హేమచంద్ర, హనుమంతరావు, రీటా, సైంధవి, శ్రీవర్ధిని3:30
మొత్తం నిడివి:33:03

మూలాలు

[మార్చు]
  1. "Jr.NTR's Shakti gets 'A'".
  2. "NTR Shakti in Overseas".
  3. "Shakti Opens Big!".
  4. "Shakti: Could have been better!".
  5. "Review: Shakti is a wasted effort – Rediff.com Movies".