Jump to content

మెహర్ రమేష్

వికీపీడియా నుండి
మెహర్ రమేశ్
జననం
చిక్కాల మెహర్ రమేశ్

వృత్తిచలనచిత్ర దర్శకుడు, రచయిత , నటుడు
క్రియాశీల సంవత్సరాలు2005 - ప్రస్తుతం

మెహర్ రమేశ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

మెహర్ రమేశ్ కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు చిక్కాల కృష్ణమూర్తి (రిటైర్డు పోలీస్ ఇన్సిపెక్టర్).

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

మెహర్ రమేశ్, 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు. 2004లో ఆంధ్రావాలా చిత్రాన్ని కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[2]

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచీ (2000), ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా, పోకిరి (2006) చిత్రానికి సహా రచయితగా, దేశముదురు (2007) చిత్రంలో నటుడిగా చేశాడు. తను దర్శకత్వం వహించిన కంత్రి (2008), బిల్లా (2009) చిత్రాలలోని టైటిల్ పాటలను రాశాడు.

చిత్రాల జాబితా

[మార్చు]
  • నటుడిగా:
సంవత్సరం చిత్రంపేరు భాష పాత్రపేరు
2002 బాబీ తెలుగు సునీల్ (బాబీ స్నేహితుడు)
  • దర్శకుడిగా:
సంవత్సరం చిత్రంపేరు భాష ఇతర వివరాలు
2004 వీర కన్నడిగ కన్నడ ఆంధ్రావాలా రిమేక్
2006 అజయ్ కన్నడ ఒక్కడు రిమేక్
2008 కంత్రి తెలుగు
2009 బిల్లా తెలుగు
2011 శక్తి తెలుగు
2013 షాడో[3] తెలుగు
2022 భోళా శంకర్‌ తెలుగు [4]

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రోఫైల్స్ బ్లాగ్. "మెహర్ రమేష్ , Mehar Ramesh(director)". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 March 2017. Retrieved 5 December 2017.
  2. "Jr. NTR on Shakthi".
  3. "First Look: Venkatesh In Shadow". Retrieved 5 December 2017.
  4. TV9 Telugu (16 November 2021). "మెగాస్టార్ మూవీనా మజాకా.. భోళా శంకర్‌ కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్." Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]