ఆంధ్రావాలా (సినిమా)
ఆంధ్రావాలా | |
---|---|
దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
రచన | పూరి జగన్నాధ్ |
నిర్మాత | గిరి ఆర్.ఆర్.వెంకట్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ రక్షిత సాయాజీ షిండే రాహుల్ దేవ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీ భారతి ఎంటర్పైజెస్ |
విడుదల తేదీ | 1 జనవరి 2004 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹10 కోట్లు |
ఆంధ్రావాలా 2004, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2] సింహాద్రి సినిమా తరువాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం (తండ్రి, కొడుకు) చేశాడు. కన్నడంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వీర కన్నడిగ పేరుతో రూపొందించబడింది. ముంబై ధారావి ప్రాంతంలోని ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న ఆంధ్రుల కష్టాలను తొలగించడానికి తిరుగుబాటు చేసిన వ్యక్తి కథాశం ఈ ఆంధ్రావాలా సినిమా.
కథా నేపథ్యం
[మార్చు]శంకర్ పహిల్వాన్ (జూనియర్ ఎన్టీఆర్) ముంబైలోని ఆంధ్ర కార్మిక నాయకుడు. అతను మాఫియా డాన్ బడేమియా (సయాజీ షిండే) తో పోరాడుతాడు. దాంతో శంకర్, అతని భార్య (సంఘవి) ను బడేమియా చంపేస్తాడు. శంకర్ నమ్మిన బంటు బాషా (బెనర్జీ) శంకర్ కొడుకును బడేమియా నుండి రక్షించడానికి తీసుకువెళతాడు. మాఫియా గూండాలు అతని వెంటపడగ,, బాషా ఆ పిల్లవాడిని ఫుట్‌పాత్‌లో ఉన్న ఒక బిచ్చగాడితో దగ్గర వదిలివేస్తాడు.
మున్నా (జూనియర్ ఎన్టీఆర్) మురికివాడ ప్రాంతంలో పెరుగుతాడు. బాషా మున్నాను కాపాడటానికి వెతుకుతుండగా, శంకర్ చేతిలో తన కుమారుడు (మహేష్ గోయాని) మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బడేమియా మున్నాను వెతుకుతుంటాడు. తండ్రి పోలికలతో ఉన్న మున్నా కనిపించడంతో బాషా, బడేమియా మున్నా శంకర్ కొడుకు అని గుర్తిస్తారు. బాషా మున్నాకు తన తండ్రి గురించి, అతని మరణం గురించి చెప్తాడు. మున్నాను చంపడానికి బడేమియా మనుషులు హైదరాబాదుకు వస్తారు. మున్నా ముంబై వెళ్లి బడేమియాను ఎదుర్కుంటాడు. తన తల్లిదండ్రులను చంపిన హంతకులపై ఎలా పగ తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
నటీ నటులు
[మార్చు]- జూనియర్ ఎన్.టి.ఆర్ (మున్నా/శంకర్ పహిల్వాన్)
- రక్షిత (చిత్ర)[3]
- సంఘవి (శంకర్ భార్య)
- సాయాజీ షిండే (బడే మియా)
- రాముల్ దేవ్ (ధనరాజ్)
- అతుల్ కులకర్ణి (బడే అనుచరుడు)
- పశుపతి (బడే అనుచరుడు)
- బెనర్జీ (బాషా)
- నాజర్ (చిత్ర తండ్రి)
- బ్రహ్మానందం (హోం మంత్రి)
- మహేష్ గోయని (బడేమియా కొడుకు)
- ఎం.ఎస్. నారాయణ
- రమాప్రభ
- తెలంగాణ శకుంతల
- పావలా శ్యామల
- రఘుబాబు
- రఘు కుంచె
- రంగనాథ్
- రాజీవ్ కనకాల
- సుప్రీత్
- వేణుమాధవ్
- జీవా
- ఉత్తేజ్
- జి. వి. సుధాకర్ నాయుడు
- బండ్ల గణేష్
- రాఘవ లారెన్స్ (నైరే నైరే పాట)
- సోనా హైడెన్
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
- నిర్మాత: గిరి
- మాటలు: కోన వెంకట్
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, కందికొండ యాదగిరి
- గాయకులు: చక్రి, కౌసల్య
- నృత్యం: రాఘవ లారెన్స్, కృష్ణారెడ్డి, ప్రదీప్ ఆంథోని
- కళ: చిన్నా
- నిర్మాణ సంస్థ: శ్రీ భారతి ఎంటర్పైజెస్
పాటలు
[మార్చు]చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.
ఆంధ్రావాలా | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 2004 | |||
Genre | పాటలు | |||
Length | 28:40 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | చక్రి | |||
చక్రి chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నిప్పు తునకై (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | చక్రి, కౌసల్య | 4:37 | ||||||
2. | "గిచ్చి గిచ్చి (రచన: కందికొండ యాదగిరి)" | చక్రి, కౌసల్య | 4:43 | ||||||
3. | "మల్లెతీగరోయ్ (రచన: కందికొండ యాదగిరి)" | చక్రి, కౌలస్య | 5:28 | ||||||
4. | "కొక్కొ కోలమిస్స (రచన: కందికొండ యాదగిరి)" | చక్రి, కౌసల్య | 4:31 | ||||||
5. | "ఉంగ ఉంగ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | చక్రి, కౌసల్య | 4:37 | ||||||
6. | "నైరే నైరే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | చక్రి | 4:44 | ||||||
28:40 |
పాటల విడుదల
[మార్చు]2003, డిసెంబరు 5న నందమూరి తారక రామారావు సొంతవూరు నిమ్మకూరులో ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకోసం పలు ప్రాంతాలనుండి నిమ్మకూరుకు ప్రత్యేక రైళ్ళు నడిపారు. ఈ వేడుకకు దాదాపుగా 10 నుండి 11 లక్షలమంది వచ్చారు. ఈ కార్యక్రమంని చిత్రీకరించడానికి లోకల్ మీడియానేకాకుండా జాతీయ మీడియా కూడా వచ్చింది. దాదాపు 15 కి.మీ. ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో జూనియర్ ఎన్.టి.ఆర్. ప్రత్యేక హెలికాప్టర్ లో కార్యక్రమానికి వచ్చాడు. 30 నిముషాల్లో పాటల విడుదల కార్యక్రమం పూర్తిచేశారు. ఒక తెలుగు సినిమా పాటల విడుదల కార్యక్రమం ఇంత భారీగా జరగడంలో ఈ చిత్రం రికార్డు నమోదుచేసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India, Entertainment (29 October 2017). "Andhrawala" (in ఇంగ్లీష్). Retrieved 6 June 2020.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ The Times of India, Entertainment (1 April 2020). "From Idiot to Andhrawala, 5 movies of Rakshita you shouldn't miss". Archived from the original on 2 April 2020. Retrieved 6 June 2020.
- ↑ తెలుగు స్వాగ్, తెలుగు సినిమా. "'andhrawala' audio function records!". teluguswag.com. Vijay kalyan. Retrieved 6 June 2020.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2004 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు
- జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలు
- సాయాజీ షిండే నటించిన సినిమాలు
- నాజర్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- చక్రి సంగీతం అందించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- సంఘవి నటించిన సినిమాలు