అమ్మ చెప్పింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ చెప్పింది
Amma Cheppindi1.jpg
దర్శకత్వంగుణ్ణం గంగరాజు
రచనగుణ్ణం గంగరాజు
నిర్మాతగుణ్ణం ఊర్మిళ, కొర్రపాటి సాయి
తారాగణంనాగేంద్ర బాబు, శర్వానంద్, తనికెళ్ళ భరణి, సుహాసిని, కృష్ణ భగవాన్, శ్రేయ రెడ్డి, ఎల్.బి.శ్రీరామ్
ఛాయాగ్రహణంసందీప్ గుణ్ణం
కూర్పుమోహన్ రామారావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
విడుదల తేదీ
2006 జూలై 28 (2006-07-28)
భాషతెలుగు

అమ్మ చెప్పింది గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో 2006 లో విడుదలైన చిత్రం. ఇందులో శర్వానంద్, సుహాసిని, నాగేంద్రబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను గుణ్ణం ఊర్మిళ, సాయి కొర్రపాటి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

బోస్ పూర్తిగా మానసిక పరివర్తన చెందని యువకుడు. అతని తండ్రి రాకెట్ సెంటర్ లో శాస్త్రవేత్త. తల్లి అతన్ని గారాబంగా చూసుకుంటూ ఉంటుంది. అతని సోదరుడు చదువులో ముందుంటాడు. బోస్ ని కాలనీలో అందరూ చిన్నచూపు చూస్తుంటారు. ఐఎస్ ఐ సంస్థ తన తండ్రి పనిచేసే రాకెట్ సెంటర్ లో ఓ కార్యక్రమం సందర్భంగా బాంబు పేలుడుకు కుట్ర చేస్తారు. బోస్ సాహసాలతో వారిని అడ్డుకోవడంలో సహాయపడతాడు. అతని తల్లి అతన్ని చూసి గర్విస్తుంది.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

గుణ్ణం గంగరాజు ముందు సినిమాలు లిటిల్ సోల్జర్స్ (1996), ఐతే (2003), అనుకోకుండా రోజు (2005) బాక్సాఫీసు వద్ద అంతగా విజయవంతం కాలేకపోయాయి. గంగరాజు ఒక ఇంటర్వ్యూలో తన ముందు సినిమాల్లో ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయానని చెప్పాడు.[1]

సంగీతం[మార్చు]

ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. "Chitchat with Gangaraju Gunna". Idlebrain.com. 2006-07-27. Retrieved 2008-03-08.