ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)
Jump to navigation
Jump to search
ఇన్‌స్పెక్టర్ జనరల్ | |
కృతికర్త: | రెంటాల గోపాలకృష్ణ (అనువాదం), నికోలాయ్ గోగోల్ (రష్యన్ భాష) |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ |
విడుదల: | ఏప్రిల్, 1956 |
పేజీలు: | 100 |
ఇన్‌స్పెక్టర్ జనరల్ రెంటాల గోపాలకృష్ణ తెలుగులోకి అనువదించిన సాంఘీక నాటకం. రష్యన్ నాటక రచయిత నికోలాయ్ గోగోల్ రాసిన ఇన్‌స్పెక్టర్ జనరల్ నాటకం ఈ రచనకు మాలం.[1]
కథానేపథ్యం
[మార్చు]ప్రజాస్వామ్యంలో పాలకుల అవినీతి, అలసత్వం, లంచాలు వంటి అంశాలు ప్రతిబింబించేలా ఈ నాటకం రాయబడింది.
పాత్రలు
[మార్చు]- చైనులు: తాలుకా ప్రధానోద్యోగి
- వసంతకుమార్: ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న గుమాస్తా
- పాకకాలునాయుడు: సబ్ మాజిస్ట్రేటు
- కైలాసరావు: డాక్టరు
- హయగ్రీవఅయ్యవార్లు: హైస్కూలు హెడ్మాస్టరు
- కాంతయ్య: పోస్టుమాస్టరు
- పరాంకుశం: సబ్ ఇన్‌స్పెక్టరు
- మిరియాలు: షావుకారు
- ధనియాలు: షావుకారు
- భూమయ్య: వర్తక వ్యాపారుడు
- శేషయ్య: వర్తక వ్యాపారుడు
- చక్రపాణి: వసంతకుమార్ స్నేహితుడు, సేవకుడు
- సుబ్బన్న: చైనులు ఇంట్లో నౌకరు
- బిళ్ళబంట్రోతు: ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చిన సేవకుడు
- కోయిలమ్మ: చైనులు భార్య
- తిలకమ్మ: చైనులు కూతురు
ఇతర వివరాలు
[మార్చు]- ఏబీకె ప్రసాద్ సూచనతో అంతా పెద్దలే అని పేరు పెట్టడం జరిగింది.
- రంగస్థల, సినిమా నటుడు వల్లం నరసింహారావు ప్రధాన పాత్ర పోషించాడు.
- సినీ నిర్మాతలు ఏడిద నాగేశ్వరరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, నటుడు హరనాథ్ తదితరులు ఈ నాటక ప్రదర్శనలు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14