ఇది కథ కాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇది కథ కాదు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బాలచందర్
రచన కె. బాలచందర్
తారాగణం కమల్ హాసన్
జయసుధ
చిరంజీవి
శరత్ బాబు
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నేపథ్య గానం వాణీ జయరాం
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పి. సుశీల
రమోలా
గీతరచన ఆచార్య ఆత్రేయ
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం లోక్ సింగ్
నిర్మాణ సంస్థ భరత్ ఫిల్మ్స్
విడుదల తేదీ 1979 జూన్ 27 (1979-06-27)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది కథ కాదు, 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. వెంట్రిలాక్విజం ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.[1]


1979: ఉత్తమ నటి జయసుధ , నంది అవార్డు.

సంక్షిప్త కథ[మార్చు]

నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.

క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.

మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.

తారాగణం[మార్చు]

వివరాలు[మార్చు]

  • తమిళంలో నిర్మింపబడ్డ అవర్ గళ్ (వారు) ఈ చిత్రానికి మూలం.
  • తమిళంలో నాయికగా సుజాత నటించింది.
  • చిరంజీవి పాత్రని తమిళంలో రజినీ కాంత్ పోషించారు.
  • మిమిక్రీ కళాకారుడిగా రెండు భాషల్లోనూ కమల్ హాసన్ నటించటం విశేషం.

పాటలు[మార్చు]

  • సరిగమలు, గలగలలు - ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము - పి. సుశీల
  • ఇటు అటు కాని, హృదయం తోని - ఎందుకురా ఈ తొందర నీకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోలా (బొమ్మ డైలాగుల భాగం)
  • గాలికదుపు లేదు, కడలికంతు లేదు - ఎస్. జానకి
  • జోలపాట పాడి ఊయ లూపనా
  • తకథిమితక...జతజతకొక కథ ఉన్నది చరితైతే ఝంఝం/ ఒక ఇంటికి ముఖద్వారం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]