Jump to content

చర్చ:పి.లీల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


"పురస్కారాలు"

[మార్చు]

First, thanks for compiling this page about our beloved singer, Smt. P. Leela.

Secondly, the word పురస్కారం has been used at a few places in this article. I want to present my take on this as below and suggest modification if you agree.

Award అనే పదం English లో నామవాచకంగానూ, క్రియగానూ వాడుకలో ఉన్నప్పటికీ, ఎక్కువగా క్రియగానే వాడబడుతుంది. దీన్ని తెలుగులోకి తర్జుమా చేయవలసి వస్తే, బహుమతి లేదా బిరుదు అనడం శ్రేష్టం. పురస్కారం అనడం బాగుండదు. ఈ 'పురస్కారాలు' తెలుగు సాహిత్యంలో కానీ, వాడుక భాషలో కానీ, ఇంతకు ముందు మనం చూడము. దేశంలో TV ప్రభావం ఎక్కువ అయ్యాక, మనం అనువాదం చెయ్యడానికి బద్దకించో , లేదా తెలియక పొరపాటున,   ఉన్నది ఉన్నట్లుగా దిగుమతి  చేస్తున్నాం.

ఏదైనా ఒక మాట సంస్కృత మాతృకగా అనిపిస్తే, అన్నిభాషల్లోనూ ఒకే విధంగా వాడెయ్యడం కేవలం బద్ధకమూ, తెలియక ఆయా భాషా స్వరూపాలను మార్చివేయడం తప్ప, మరొకటి కాదు.  ఉదాహరణకు.. హిందీలో [సంసార్] తెలుగులోని [సంసారం] ఒక్కటికాదుకదా! అలాగే, హిందీ [పరివార్], తెలుగు [పరివారం] ఒక్కటి కానే కాదు.

ఈరోజుల్లో అటు కొంతమంది గురువులు, ఇటు చాలామంది పిల్లలు - ఒకరిని చూసి మరొకరు, ఇలా పొరపాట్లు చేయకుండా మన మాతృభాషయైన తెలుగును మనం కాపాడుకొందాం. శుభమ్! BalKan7 (చర్చ) 22:03, 31 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అవార్డ్ అంటే పురస్కారం సరైన అర్థమేనని నేను అనుకుంటున్నాను. ఈ పదం గురించి వెతికితే కింది విశేషాలు తెలిసాయి:
  1. ఆ పదం ఇప్పుడు కొత్తగా భాష లోకి వచ్చినది కాదు. బ్రౌన్ నిఘంటువులో ఉంది (1903 లో), శబ్దరత్నాకరంలో ఉంది (1912 లో).
  2. వికీసోర్సులో వెతికితే ఈ మాట వాడీన పాత పుస్తకాలు రెండు దొరికాయి -ఆంధ్ర రచయితలు పుస్తకంలో (1950) వాడారు. అలాగే భారత_అర్థశాస్త్రము (1958 లో) వాడారు.
పై రెంటినీ చూస్తే రెండు విషయాలు తెలుస్తాయి: 1. గతంలో తెలుగు సాహిత్యంలో ఈ మాట లేదని అనడం సరికాదు. 2. ఇది టీవీ ప్రభావం వలన సమాజం లోకి కొట్టుకొచ్చిన మాట కాదు. ఆ మాటకొస్తే టీవీల వాళ్ళు "పురస్కారం" అనే మాట కంటే "అవార్డు" అనే మాటనే ఎక్కువ వాడతారని మనం (చూడకపోయినా) చెప్పగలం - ఎందుకంటే వాళ్ళ భాషా జ్ఞానం, మాట్లాడే శైలీ మనకు తెలుసు కాబట్టి.
  1. అవార్డ్ అనే పదానికి బహుమతి, బిరుదు అనాలని అంటున్నారు. అలా అయితే.. గిఫ్ట్, ప్రైజ్, టైటిల్ (టైటిల్ ఆఫ్ ఆనర్) వగైరాలను ఏమనాలో ఆలోచించాలి.
(ఇంకో సంగతేంటంటే..ఒకవేళ పురస్కారమనే మాట ఈ అర్థంలో ఇటీవలి కాలంలోనే వ్యాప్తి లోకి వచ్చిందని అనుకున్నా.., ప్రస్తుతం ఇదే వ్యాప్తిలో ఉందని భావిస్తున్నట్లేగా. వ్యాప్తిలో ఉన్నదాన్నేగా వికీలో వాడాల్సింది!) __ చదువరి (చర్చరచనలు) 04:37, 1 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చను ముందు ముందు సంశయం వస్తే పరిశీలించుకోవటానికి ఇలాంటివి ఎక్కడైనా అవసరమైన చర్చా పేజీలు, లేదా మొదటి పేరుబరిలో, లేదా శైలి మరేదైనా అలాంటి వాటిలో భద్రపరచాలి లేదా కూర్పు చేయాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:04, 1 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]