Jump to content

భక్త రఘునాథ్

వికీపీడియా నుండి
‌భక్త రఘునాథ్
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం సముద్రాల రాఘవాచార్య
కథ సముద్రాల రాఘవాచార్య
చిత్రానువాదం సముద్రాల రాఘవాచార్య
తారాగణం కాంతారావు,
జమున
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ జి.వి.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

భక్త రఘునాథ్ 1960 లో వచ్చిన జీవితచరిత్ర చిత్రం. రఘునాథ్ దాసు గోస్వామి జీవితం ఆధారంగా GVS ప్రొడక్షన్స్ పతాకంపై జి సదాశివుడు ఈ సినిమాను నిర్మించాడు. సముద్రాల Sr దర్శకత్వం వహించాడు.[1] కాంతారావు, జమునా ప్రధాన పాత్రల్లో నటించగా, NT రామారావు ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. సంగీత దర్శకత్వం ఘంటసాల నిర్వహించాడు.[2] ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించబడింది.

రఘునాథ్ (కాంతారావు) విదేశాల్తో వ్యాపారం చేస్తూంటాడు. వెంకటరామయ్య కుమారుడు. అన్నపూర్ణ (జమున) అదే పట్టణానికి చెందిన ధనవంతుడైన వీరయ్య కుమార్తె. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. రెండు కుటుంబాలు కూడా ఈ ప్రతిపాదనను ఇష్టపడతాయి. వారి నిశ్చితార్థాన్ని నిర్వహిస్తాయి. దురదృష్టవశాత్తు, వెంకటరామయ్య దివాళా తీసి చనిపోతాడు. రఘునాథ్ ఆస్తిని అమ్మేసి అన్ని అప్పులను తీర్చేస్తాడు. దేశంలో పర్యటించాలనుకుంటాడు. తాను వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోనని, ఆమె తల్లిదండ్రులు మరో సంబంధం చూస్తే తనకు మరణమే శరణమని అన్నపూర్ణ అతనికి చెబుతుంది. అతను తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పెళ్ళి చేసుకోవడానికి రఘునాథ్ అంగీకరిస్తాడు. రఘునాథ్ తల్లి పర్యటనలో మరణిస్తుంది. చివరగా, రఘునాథ్ పూరీ జగన్నాథ్ చేరుకుంటాడు, అక్కడ అతను స్వామి చిదానంద (చిత్తూరు వి నాగయ్య) ను కలుస్తాడు. రంగదాసు అనే దొంగ సాధువు అతన్ని హేళన చేస్తాడు. రఘునాథ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు కాని శ్రీకృష్ణుడు (ఎన్.టి.రామారావు) అతన్ని రక్షిస్తాడు. ప్రజలు అతనిని ఇష్టపడటం ప్రారంభిస్తారు. రంగాదాసు అతన్ని చంపడానికి ప్రజలను రెచ్చగొడతాడు. చిదానంద స్వామి అతన్ని రక్షించి, తన ఆశ్రమానికి తీసుకెళ్ళి యోగసాధన నేర్పిస్తాడు.

ఇంతలో, అన్నపూర్ణ తల్లి కామేశ్వరి ఆమెకు మరో సంబంధం చూస్తుంది. రఘునాథ్‌కు ఈ విషయం తెలిసి స్వగ్రామానికి వెళ్తాడు. కామేశ్వరి రఘునాథ్‌కు విషం ఇస్తుంది. కాని అతనికి ఏమీ జరగదు. అర్ధరాత్రి అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తారు. కాని స్వామి చిదానంద వచ్చి, అతన్ని రక్షిస్తాడు. రఘునాథ్, అన్నపూర్ణలకు పెళ్ళి కూడా చేస్తాడు. పెళ్ళి తరువాత, ఈ జంట పూరికి చేరుకుని ఆశ్రమంలో నివసించడం ప్రారంభిస్తారు. రంగదాసు అతడి ప్రజాదరణ చూసి అసూయపడతాడు. అందుకే అతని భక్తిని ప్రజలు అనుమానించేలా చేస్తాడు. ఒక సాయంత్రం చాలా మంది రఘునాథుని ఆశ్రమాన్ని సందర్శిస్తారు. వాళ్ళ భోజనాల కోసం అన్నపూర్ణ తన ఆభరణాలను అమ్మేస్తుంది. భారీ వర్షం కారణంగా, అన్ని దుకాణాలు మూసివేసి ఉంటాయి. దారిలో ఉన్న ఒక వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు. ఆమె తన కామాన్ని తీర్చడానికి ఆమె అంగీకరిస్తే ఆహారాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతాడు. ఇప్పుడు అన్నపూర్ణ సందిగ్ధంలో పడుతుంది. తన దేవుడు అతడి కోరికను నెరవేరుస్తాడని చెబుతుంది. అతిథులను తగిన రీతిలో సత్కరించిన తరువాత, ఆ వ్యక్తి ఆశ్రమానికి వచ్చి ఆమెను పిలుస్తాడు. అన్నపూర్ణ అతన్ని రఘునాథకు పరిచయం చేసి, ఆమె ఇచ్చిన వాగ్దానం గురించి చెబుతుంది. అన్నపూర్ణ వాగ్దానాన్ని ఎరవేర్చడానికి రఘునాథ్ అంగీకరిస్తాడా, దాని పర్యవసానాలు ఎల ఉంటాయి అనేది తరువాత కథ.

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]

పాటలు

[మార్చు]
సం. పాట గాయకులు పొడవు
1 "జయ మురళీ లోలా" ఎపి కోమల 3:21
2 "రామ హరే కృష్ణ హరే" జె.వి.రాఘవులు
3 "ఆనందమంత" ఘంటసాల, పి. లీల 3:25
4 "ఓ తరలిపోయే" ఘంటసాల 3:15
5 "అగవోయి అగవోయి" ఘంటసాల 3:17
6 "నీ గుణగణము" ఘంటసాల 3:14
7 "హే శివశంకర" పి. లీల
8 "కొండ మీదా" జె.వి.రాఘవులు, జిక్కి 3:19
9 "సంసారం" ఘంటసాల, పి. లీల 3:00
10 "ఈ ప్రశాంత వేళ" పి. లీల
11 "మరచుటలేదు" ఘంటసాల 3:36
12 "నరహరి భోజన" మాధవపేద్ది సత్యం, కె. రాణి
13 "లాలి శ్రీవనమాలి" ఘంటసాల
14 "హే జగన్నాథ స్వామి" ఘంటసాలా, పి. లీల 3:20

15.అదిగో,.., జగన్నాధుడా శ్రితవని..(పద్యం) ఘంటసాల

16. ఈ మరపేల ఈ వెరపేల ఈ మనసైన బాల నీదరి చేర , పి.లీల

17.గోపాల దయసేయరా నీ లీల చాలించారా గోపాల, ఘంటసాల, పి.లీల

18. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ ,(పద్యం), పి.లీల

19 . భవతాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా ,ఘంటసాల , బృందం

20.కాదంబ కానన నివాస కుతూహలాయ (శ్లోకం),ఘంటసాల

21.జన్మ దుఃఖం ..... జాగ్రత్త నాయనలారా జాగ్రత్త

22.భజే సవ్యే వేణం శిరి శిఖిపించడం,(శ్లోకం), ఘంటసాల

23.మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బందు సహోదరా(పద్యం)

24.రాధే శ్యాం రాధేశ్యాం జయారాధేశ్య నందకుమార , జె.వి.రాఘవులు బృందం

25.శ్రీ వత్సాజ్ఞం మహోరస్యం వనమాలా విరాజితం ,(శ్లోకం)

మూలాలు

[మార్చు]
  1. "Bhakta Raghunath (Direction)". Filmiclub.
  2. "Bhakta Raghunath (Review)". Spicy Onion. Archived from the original on 2020-06-19. Retrieved 2020-08-23.

3.ఘంటసాల గళామ్రుతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి .