ఎ.పి. కోమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్కాట్ పార్థసారధి కోమల
ఆర్కాట్ పార్థసారధి కోమల
జననంఆర్కాట్ పార్థసారధి కోమల
ఆగష్టు 28, 1934
ప్రసిద్ధిదక్షిణభారత దేశపు నేపథ్యగాయని

ఆర్కాట్ పార్థసారథి కోమల (తమిళం: ஏ.பி.கோமளா) (జ. 1934 ఆగష్టు 28) [1] దక్షిణభారతదేశపు నేపథ్యగాయని.[1] ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.

కోమల మద్రాసులోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారథి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది.[2] అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే.[3] తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు.[4]

సంగీత అవగాహన ఉండటం వలన 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్థినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే ఈ పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నది.[4] ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.

ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.

తెలుగు సినిమా పాటల జాబితా[మార్చు]

ఎ.పి.కోమల పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయనీ గాయకులు సంగీత దర్శకుడు రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 శ్రీ లక్ష్మమ్మ కథ తాళగ జాలనురా నా సామి జాలము సేయకురా సి.ఆర్.సుబ్బరామన్ 1950
2 దీక్ష ఏమి మొగాళ్ళొయ్ మీరేమి మొగాళ్ళొయ్ ఎం.సావిత్రి పెండ్యాల నాగేశ్వరరావు 1951
3 పెళ్ళి చేసి చూడు బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా కె. రాణి, ఉడుతా సరోజిని ఘంటసాల ఊటుకూరి సత్యనారాయణ 1952
4 ప్రేమ ఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయే గదా సి.ఆర్.సుబ్బరామన్ 1952
5 పరోపకారం నరజన్మ అత్యున్నతమురా నీవు పరమార్ధ మార్గాన మాధవపెద్ది ఘంటసాల 1953
6 పరోపకారం నిరుపేదల లోకము ఇంతేనోయి వెనుకాడకుమోయి ఘంటసాల 1953
7 పరోపకారం హృదయము వూగిసలాడి ప్రతి వదనము కలతల వాడె ఘంటసాల, ఎ.ఎం.రాజా, పి.లీల ఘంటసాల 1953
8 పిచ్చి పుల్లయ్య ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబే మరచుట మేలోయి టి.వి.రాజు అనిసెట్టి 1953
9 పుట్టిల్లు జో జో లాలి లాలి జోజో కుమారా సుందరాకార నాకు వెలుగును టి.చలపతిరావు 1953
10 పెంపుడు కొడుకు చిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనే సాలూరు రాజేశ్వరరావు శ్రీశ్రీ 1953
11 జయసింహ తందానా హోయ తందానా తానితందన ఘంటసాల బృందం టి.వి.రాజు సముద్రాల రాఘవాచార్య 1955
12 జయసింహ నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామి టి.వి.రాజు సముద్రాల రాఘవాచార్య 1955
13 జయసింహ మనసైనా చెలీ పిలుపు వినరావేలా ఓ చందమామా రావు బాలసరస్వతీ దేవి టి.వి.రాజు సముద్రాల రాఘవాచార్య 1955
14 జయసింహ మురిపెము మీరా మీ కోరిక తీరా వారంపిన కానుకలే కె.రాణి టి.వి.రాజు సముద్రాల రాఘవాచార్య 1955
15 రంగులరాట్నం పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా బి.వసంత సాలూరు రాజేశ్వరరావు 1967
16 బంగారు పంజరం పదములే చాలు రామ ! నీ పద ధూళులే పదివేలు సాలూరు రాజేశ్వరరావు దేవులపల్లి కృష్ణశాస్త్రి 1968

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Komala A. P. పేజీ
  2. జ్ఞాపకాలు - ఎపి కోమల
  3. కమ్మని కోమల గాత్రధారిణి
  4. 4.0 4.1 గనిరెడ్డి, అరుణ్‌కుమార్‌. "తెలుగు సినిమా నన్ను మరిచి పోయింది!". ఆంధ్రజ్యోతి. No. 28 Aug 2014. Retrieved 3 December 2014.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎ.పి._కోమల&oldid=3740977" నుండి వెలికితీశారు