ఆదర్శ కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదర్శ కుటుంబం
(1969 తెలుగు సినిమా)
Adarsa kutumbam.jpg
దర్శకత్వం ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయలలిత,
అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
ఎస్.వరలక్ష్మి,
గీతాంజలి,
చిత్తూరు నాగయ్య,
హేమలత,
పద్మనాభం,
సురభి బాలసరస్వతి
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.

కథ[మార్చు]

ఒక ఊళ్లో మోతుబరి భూస్వామి రాఘవేంద్రరావు (నాగయ్య). భార్య రాజ్యలక్ష్మి (హేమలత). వారికి నలుగురు కుమారులు. పెద్దవాడు పట్టాభి (గుమ్మడి), పెద్ద కోడలు జానకి (అంజలిదేవి). ఇంటి ఖర్చులు, జమలు పట్టాభి, వంటా వార్పూ, పెట్టుపోతలు జానకి నిర్వహిస్తుంటారు. రెండో కుమారుడు ప్రకాశం (నాగభూషణం) గ్రామ రాజకీయాల్లో పాల్గొని ప్రెసిడెంటుగా విధులు నిర్వహిస్తుంటాడు. అతని భార్య జయ (ఎస్ వరలక్ష్మి), వారికొక కుమారుడు వాసు. మూడో కుమారుడు శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ పోటీల్లో పాల్గొంటుంటాడు. అతని భార్య రమ (గీతాంజలి). నాల్గవ కుమారుడు ప్రసాద్ (అక్కినేని నాగేశ్వర రావు). పట్నంలో చదువుతూ తనతోటి సహాధ్యాయిని, డాక్టరు చదివిన సరోజ (జయలలిత)తో ప్రేమలో పడతాడు. రాఘవేంద్రరావు కూతురు అనిత. ఆమె భర్త రే చీకటితో బాధపడుతూ సరిగ్గా ఏ పనీ చేయని సూర్యం (పద్మనాభం). అత్తవారింట్లోనే తిష్టవేయమని తల్లి దుర్గమ్మ (సూర్యకాంతం) హెచ్చరికతో అక్కడే కాలం గడుపుతుంటాడు. ఈ ఇంటి పరిస్థితులు చక్కదిద్దాలని సరోజను పట్నంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు ప్రసాద్. ఆమె సాయంతో తాను తాగుడు వ్యసనానికి బానిసైనట్టు, అప్పులు చేసినట్టు నమ్మించి ఇంటిని, ఆస్తిని అప్పులకు జమ అయ్యిందని చెప్పించి.. కుటుంబ సభ్యులంతా వేరుపడేలా చేస్తాడు. దాంతో అందరూ తమ తమ బాధ్యతలను గుర్తించి చివరకు ఒకటి కావటంతో చిత్రం సుఖాంతమౌతుంది[1].

సాంకేతికవర్గం[మార్చు]

 • మాటలు: ఆత్రేయ
 • పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, కొసరాజు
 • నృత్యం: చిన్ని, సంపత్
 • సంగీతం: యస్ రాజేశ్వరరావు
 • ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
 • కళ: జివి సుబ్బారావు
 • కూర్పు: కె కృష్ణస్వామి
 • నిర్మాత: ఏవి సుబ్బారావు
 • దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ

నటీనటవర్గం[మార్చు]

ప్రాచుర్యం, ప్రభావం[మార్చు]

ఆదర్శ కుటుంబం సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని స్వీకరించి అభివృద్ధి చేసి 1994లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంగారు కుటుంబం సినిమాని నిర్మించారు.[2]

పాటలు[మార్చు]

 1. ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్డి చెప్పరా - ఘంటసాల
 2. ఏయ్ ఏయ్‌రా చూస్తావేరా ఏయ్‌రా నీ కుతిదీరా - సుశీల, ఘంటసాల
 3. కాళ్ళగజ్జి కంకాళమ్మా వేగులచుక్కా వెలగామొగ్గా - సుశీల బృందం
 4. చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి ఈపాలు - ఘంటసాల,సుశీల బృందం
 5. బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలి మొదటి రేయి ఒదిగిపోయి మోము దాచేవెందుకో - ఘంటసాల, సుశీల
 6. సూర్యవంశమునందునా దశరథుని సుతులుగా - ఘంటసాల, జయదేవ్ బృందం
 7. హల్లో సారు ఓ దొరగారు తగ్గండి మీరు ఏమిటండి - ఎల్.ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (1 June 2019). "ఫ్లాష్ బ్యాక్@50 ఆదర్శకుటుంబం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 3 August 2019. CS1 maint: discouraged parameter (link)
 2. సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. CS1 maint: discouraged parameter (link)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)