Jump to content

ఇద్దరు పెళ్లాలు

వికీపీడియా నుండి
ఇద్దరు పెళ్లాలు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎఫ్. నాగుర్
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
లక్ష్మీకాంతం,
పి.వి. రాజమ్మ,
శివరావు
సంగీతం టి.ఆర్. పాప,
టి.కె. కుమారస్వామి,
టి.ఎ. కళ్యాణరామ్
గీతరచన కొంపల్లె
నిర్మాణ సంస్థ నాగుర్ సినీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇద్దరు పెళ్లాలు 1954లో విడుదలైన బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమా. నాగూర్ సినీ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈ సినిమాను ఎఫ్.నాగూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, జమున లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఆర్.పాపా సంగీతాన్నందిచాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం/నిర్మాత : ఎఫ్.నాగూర్
  • మాటలు, పాటలు: కోపల్లె వెంకట రమణారావు
  • సినిమాటోగ్రాఫర్ : జితెన్ బెనర్జీ
  • ఎడిటర్: పి.వి.నారాయణ
  • కంపోజర్: టి.ఆర్.పాపా, టి.కె.కుమారస్వామి, టి.ఎ.కళ్యాణరామన్
  • గాయకులు: కొంపల్లి వెంకటరమణారావు

పిల్లలు లేని ఒక జమీందారు (సి.ఎస్.ఆర్)ను అతని భార్య రాధ (పి.వి.రాజమ్మ) పిల్లలకోసం రెండో పెళ్ళి చేసుకోమని మాటవరుసకు అడుగుతుంది. ఆ మాటను సాకుగా తీసుకుని జమీందారు తాను ఇదివరకే వలచిన పుష్ప (లక్ష్మీకాంతం)ను పెళ్ళి చేసుకుంటాడు. కొంతకాలం సవతులిద్దరూ బాగానే ఉంటారు. కానీ పుష్ప ముందుముందు తన గతేమవుతుందో అనే భయం వల్ల జమీందారుకు రాధపై చాడీలు చెప్పి జమీందారు మనసు విరుస్తుంది. కొంతకాలానికి రాధ గర్భవతియై మగశిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువు పుట్టగానే పుష్ప ఒక నౌకరుచేత ఆ శిశువును చెత్తకుప్పలో పడవేయించి శిశువు చనిపోయాడని అందరికీ చెబుతుంది. ఆ శిశువును పేదవాడొకడు చూచి తన ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుంటూ ఉంటాడు. రాధకూ, ఆ పేదవాడికీ అక్రమ సంబంధం అంటగట్టి పుష్ప జమీందారుకు ఆగ్రహం తెప్పిస్తుంది. జమీందారు వళ్లు తెలియని కోపంతో రాధ గొంతు నులిమివేస్తాడు. ఆమె చనిపోయిందని అంతా అనుకుంటారు గానీ, ఆమె తేరుకుని అక్కడా అక్కడా కూలిపని చేసుకుని పొట్టపోసుకుంటూ ఉంటుంది. ఇలా చాలాకాలం గడిచిపోతుంది. జమీందారును తన చేతి కీలుబొమ్మగా చేసుకుని పుష్ప ఆడిస్తూ, చివరకు అతడిని ఇంట్లోనే బంధించి తను పెత్తనం చెలాయిస్తుంటుంది. మొదటి భార్యకు పుట్టిన కొడుకు మల్లయ్య (ఎన్.టి.ఆర్.) అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. అతడు కన్నమ్మ (జమున) అనే పేదపిల్లను ప్రేమిస్తాడు. చివరకు జమీందారు రెండవ భార్య చేసిన ద్రోహం, మొదటి భార్య నిర్దోషిత్వం తెలుసుకుని పశ్చాత్తాపపడతాడు. పుష్ప విషం త్రాగి ఆత్మహత్య చేసుకుంటుంది. జమీందారు తన మొదటి భార్య రాధను, కొడుకు మల్లయ్యను కలిసి క్షమాపణ కోరతాడు. మల్లయ్య కన్నమ్మను వివాహం చేసుకుంటాడు. అంతా సుఖంగా ఉంటారు.

పాటలు

[మార్చు]
  1. ఓ మదనా రా వెన్నెల చిందే రేయిలో - పి.లీల, ఘంటసాల బృందం - రచన: కోపల్లె
  2. తొలి ప్రేమ వినోదం తొనుకాడే ప్రమోదం ముదమే - పి.లీల, ఘంటసాల - రచన: కోపల్లె
  3. ప్రియుడేల ఈ వేళ ననుచూడ రాడేల - పి.లీల, ఘంటసాల - రచన: కోపల్లె
  4. మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి గోపాలబాల - పి.లీల, ఘంటసాల - రచన: కోపల్లె

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Iddaru Pellallu (1954)". Indiancine.ma. Retrieved 2024-09-14.