సతీ సుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ సుమతి
(1967 తెలుగు సినిమా)
నిర్మాణం పి.ఆదినారాయణరావు
నిర్మాణ సంస్థ చిన్ని బ్రదర్స్
భాష తెలుగు

సతీ సుమతి 1967 మార్చి 8వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

 • అక్కినేని నాగేశ్వరరావు
 • సావిత్రి
 • జగ్గయ్య
 • జమున
 • జెమినీ గణేశన్
 • కృష్ణకుమారి
 • రమణారెడ్డి
 • అంజలీదేవి
 • కాంతారావు
 • ఎస్.వి.రంగారావు
 • రేలంగి
 • కాంచన
 • విజయలక్ష్మి
 • గిరిజ
 • సూర్యకాంతం
 • పుష్పవల్లి
 • వాసంతి
 • హరనాథ్
 • అల్లు రామలింగయ్య
 • వంగర
 • ధూళిపాళ

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

సుమతి భర్త ఒక వ్యభిచారి. అయినా, అతణ్ణి ఆమె దైవంగా ఆరాధించి మానవాకృతి ధరించిన దేవతామూర్తిగా సేవించింది. భర్త కోరిక తీర్చటానికి, సానికి ఊడిగం చేసి, తన భర్తను రక్షించమని వేడుకున్నది. ఇక్కడ సుమతి త్యాగంకన్నా వెలయాలి త్యాగం గొప్పదని చర్చించటానికి వీలులేదు కాబట్టి, ఆ విషయాన్ని వదలి ముందుకు సాగాలి. సుమతి శాపాన్ని మరల్చి సూర్యోదయం సాధించటానికి ఆ త్రిమూర్తులు చాలలేదు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న సామెత ప్రకారం, సతీ అనసూయ కల్పించుకుని సుమతి చేత శాపాన్ని ఉపసంహరింపజేసింది. తన పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి, యతి వేషాలలో దిగివచ్చిన త్రిమూర్తులను అడ్డాలలో బిడ్డలుగా మార్చితే, సుమతి వారిని స్థాణువులుగా నిలబెట్టి, ఒక మెట్టుపైకి ఎక్కింది. లోకహితం కోసం భర్త తల పగిలి ప్రాణంపోయిన క్షణకాలం వైధవ్యాన్ని భరించింది. త్రిమూర్తులు ప్రసన్నులై సుమతి భర్తకు ప్రాణదానంతోపాటు పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఒక స్త్రీ పతి భక్తి దైవభక్తికన్నా గొప్పదని, ఆమె పాతివ్రత్యం కుటుంబానికే కాకుండా సమాజానికి, ప్రపంచానికి రక్షాకవచం లాంటిదన్న సందేశం ఈ సినిమా ద్వారా ఇచ్చారు.

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సముద్రాల రాఘవాచార్య సముద్రాల రామానుజాచార్యలు రచించగా ఆదినారాయణరావు సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం పాట గాయకులు నిడివి
1 "స్వాగతమయ్యా రఘురామా జగదభిరామా శ్రీరామా" జిక్కి, బి.వసంత, కోరస్ 3:20
2 "అందాల దాసులే మగవారందాల దాసులే" స్వర్ణలత, ఎస్.జానకి 7:03
3 "దోరవయసు మనసు దోచెనురా" పి.సుశీల 2:57
4 "తాళలేర విరాళికి సుకుమారా" ఎస్.జానకి 3:52
5 "హాయి వేరేది లేదోయీ అందే మగువా చిందే మధువూ" పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి 4:46
6 "కోరుతున్న పతి చెంత జేరితే దారి చూపమని వెంట తగిలితే" మాధవపెద్ది సత్యం, ఎల్.ఆర్.ఈశ్వరి 3:39
7 "స్వామి నను చేరరావ బిరాన మనలేనురా నీవు లేని జగాన" పి.సుశీల 3:48
8 "నాథుని కావరయా నా నాథుని కావరయా" పి.సుశీల 6:34
9 "దానం ధర్మమే వేదాల నీతిసారం" పి.సుశీల 2:08
10 "నమ్మి చెడినవారు లేరు మీరు నమ్మకపోతే చెడిపోతారు పోతారు" వసంత 2:10
11 "మచ్చరంబున మది యంబుధిలో జొచ్చియున్న సోమకుద్రుంచియు" ఎస్.జానకి 6:28
12 "జయగౌరీ రమణా శంభో చంద్ర కళాభరణా" పి.సుశీల 2:41
13 "గాఢాంధకారమ్ము కమ్మిన లోకమ్ము వెలుగు చేకూరి శోభిల్లు గాక (పద్యం)" పి.సుశీల 0:26

మూలాలు[మార్చు]

 1. సముద్రాల. సతీసుమతి పాటల పుస్తకం. p. 12. Retrieved 17 August 2020.

బయటిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సతీ_సుమతి&oldid=3836954" నుండి వెలికితీశారు