రేణుకాదేవి మహాత్మ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణుకాదేవి మహత్యం
రేణుకాదేవి మహాత్మ్యం.jpg
దర్శకత్వంకె.ఎస్.ప్రకాశరావు
రచనడి. వి. నరసరాజు
నిర్మాతకె. ఎస్. ప్రకాశరావు
తారాగణంగుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున
ఛాయాగ్రహణంఎ. ఎస్. నారాయణ
కూర్పుఆర్. వి. రాజన్
సంగీతంఎల్. మల్లేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1960
భాషతెలుగు

రేణుకాదేవి మహాత్మ్యం 1960 లో కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం.[1] ఇందులో గుమ్మడి, జి. వరలక్ష్మి, జగ్గయ్య, జమున తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇందులో పరశురామావతారం కథ ఆధారంగా తీసిన సినిమా.

కథ[మార్చు]

రేణుకాసుడి కూతురు రేణుకాదేవి. ఈమె జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తుంది. ఆమె భక్తిశ్రద్ధలను గమనించిన జమదగ్ని మహర్షి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి పరశురాముడితో సహా నలుగురు కుమారులు కలుగుతారు. ఆమె తన పాతివ్రత్య మహాత్మ్యంతో ఇసుక నుంచి కుండ తయారు చేసి అందులో పూజకు కావలసిన జలాలను తెస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆమె పవిత్రతకు భంగం కలగడంతో సకాలంలో నీళ్ళు తేలేకపోతుంది. జమదగ్ని మహర్షి ఆమెను కుష్టు రోగివి కమ్మని శపించి ఆశ్రమం నుంచి పంపించి వేస్తాడు. ఆమె గంగాదేవిని ప్రసన్నం చేసుకుని తన వ్యాధి రూపుమాపుకుంటుంది. కానీ జమదగ్ని మహర్షి మాత్రం ఆమెను ఆశ్రమంలోకి రానివ్వడు. అయినా ఆమె ఆశ్రమాన్ని వీడకపోవడంతో కుమారులను ఆమెకు శిరచ్ఛేదం చేయమంటాడు. మాతృహత్య మహాపాతకమని వారు అందుకు అంగీకరించకపోగా వారిని అగ్నిలో దహించివేస్తాడు.

కార్యవీర్యుడనే రాజు అధికార గర్వంతో ధర్మ శాస్త్రాలను కూడా తిరగరాస్తూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు.

తారాగణం[మార్చు]

 • జమదగ్ని మహర్షిగా గుమ్మడి
 • జి. వరలక్ష్మి
 • కార్తవీర్యుడిగా రాజనాల
 • రమణా రెడ్డి
 • ఆదోని లక్ష్మి
 • మోహన
 • ఉదయం
 • రేణుకాసురుడిగా మిక్కిలినేని
 • శేషగిరి రావు
 • వేలంగి
 • అప్పారావు
 • రామమోహనరావు
 • ఆర్. వి. కృష్ణారావు
 • విశ్వనాధం
 • రమేష్
 • అతిథి పాత్రలో జమున
 • అతిథి పాత్రలో కృష్ణకుమారి
 • అతిథి పాత్రలో సూర్యకళ
 • అతిథి పాత్రలో శోభ
 • అతిథి పాత్రలో చంద్రికారాణి
 • శ్రీమహావిష్ణువు గా జగ్గయ్య
 • బాలయ్య
 • రమణమూర్తి
 • కె. వి. ఎస్. శర్మ
 • కృష్ణ
 • మహంకాళి వెంకయ్య

పాటలు[మార్చు]

ఈ చిత్రంలో పాటలు, పద్యాలు ఆరుద్ర రచించాడు. ఎల్. మల్లేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. సుశీల, జానకి, జిక్కి, వైదేహి, ఘంటసాల, ఎ. ఎం. రాజా, పి. బి. శ్రీనివాస్, మాధవపెద్ది పాటలు పాడారు.

మూలాలు[మార్చు]

 1. "Renuka Devi Mahatmyam Telugu Devotional Full Movie". YouTube. SAV Entertainments. 11 May 2015. Retrieved 27 April 2018.