ప్రకాష్ ప్రొడక్షన్స్
స్వరూపం

ప్రకాష్ ప్రొడక్షన్స్ (Prakash Productions) సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి తెలుగు సినిమా కథానాయకుడు, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు.[1]
నిర్మించిన సినిమాలు
[మార్చు]- రేణుకాదేవి మహత్యం (1960) : పౌరాణిక చిత్రం.[2] ఇందులో పరశురామావతారం కథ ఆధారంగా తీసిన సినిమా.
- అంతే కావాలి (1955) : హాస్యకథా చిత్రం.
- బాలానందం (1954) : బాలల చిత్రం. ఇందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య అనే ఉప చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలను కలిపి "బాలానందం" గా నిర్మించారు.
- కన్నతల్లి (1953) : ఈ చిత్రంద్వారా నటిగా రాజసులోచన, గాయనిగా పి.సుశీల తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు.
- దీక్ష (1951) : తెలుగు కుటుంబ కథాచిత్రం.[3] మనసుకవి ఆత్రేయ ఈ సినిమాలోని "పోరా బాబూ పో" పాటతో తన సినీ గేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.[4]
- మొదటిరాత్రి (1950)
మూలాలు
[మార్చు]- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2025-06-10.
- ↑ "Renuka Devi Mahatmyam Telugu Devotional Full Movie". YouTube. SAV Entertainments. 11 May 2015. Retrieved 27 April 2018.
- ↑ దీక్ష సినిమా పాటల పుస్తకం.
- ↑ మనసు గతి ఇంతే (ఆత్రేయ సినీ హిట్స్), సంజయ్ కిషోర్, సంగం అకాడమీ, 2007.