మనసు మాంగల్యం
మనసు మాంగల్యం, తెలుగు చలన చిత్రం. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, జమున, అంజలీ దేవి, జగ్గయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
| మనసు మాంగల్యం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
| నిర్మాణం | కోగంటి కుటుంబరావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జమున, జగ్గయ్య, అంజలీదేవి, పద్మనాభం, రమణారెడ్డి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | ఉత్తమ చిత్ర |
| భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె.ప్రత్యగాత్మ
కధ: కె.శ్రీనివాసరావు
చిత్రానువాదం: కె.ప్రత్యగాత్మ
మాటలు: ఆచార్య ఆత్రేయ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాత: కోగంటి కుటుంబరావు
నిర్మాణ సంస్థ: ఉత్తమ చిత్రా
గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి కృష్ణమాచార్య, కొడకండ్ల అప్పలచార్య
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు,శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
ఛాయ గ్రహణం: కె.ఎస్. రామకృష్ణారావు
ఎడిటింగ్: పి.శ్రీహరిరావు
విడుదల:1971: జనవరి:28.
నటీనటులు
[మార్చు]| నటుడు/నటి | పాత్ర |
|---|---|
| అక్కినేని నాగేశ్వరరావు | రవి |
| జమున | మంజుల |
| అంజలీదేవి | ముంతాజ్ |
| రమణారెడ్డి | పెరుమాళ్ళయ్య |
| సూర్యకాంతం | ఆండాళమ్మ |
| పద్మనాభం | కుశశ్రీ |
| గీతాంజలి | గీత |
| రామకృష్ణ | శేఖర్ |
| చంద్రమోహన్ | మధు |
| చిత్తూరు నాగయ్య | పురుషోత్తమరావు |
| మణిమాల | అమృత |
| అనిత | సరళ |
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఆవేశం రావాలి ఆవేదన కావాలి - గుండెలోని గాయాలు మండించే గేయాలు | దాశరథి కృష్ణమాచార్య | పెండ్యాల | ఘంటసాల |
| ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో - నాకేమో తెలియదు నీకైనా తెలుసునా | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల |
| ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ కాలి అందెలు మ్రోగినవో ఎన్నెన్ని ఆశలు పొంగినవో | దాశరథి కృష్ణమాచార్య | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
| నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా | ఆత్రేయ | పెండ్యాల | ఘంటసాల, పి.సుశీల |
ఈ ముసుగు తీయకు,రచన: దాశరథి, గానం. పి సుశీల
ఎలా ఉన్నది రచన: అప్పలాచార్య , గానం.పిఠాపురం , స్వర్ణలత
పో పోఎంతదూరం , రచన: ఆత్రేయ,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.