పూజాఫలం
పూజాఫలం | |
---|---|
![]() | |
దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
రచన | డి. వి. నరసరాజు (మాటలు), దేవులపల్లి కృష్ణశాస్త్రి (పాటలు) |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున, జగ్గయ్య, రమణారెడ్డి, గుమ్మడి, రేలంగి, మిక్కిలినేని, ఎల్.విజయలక్ష్మి, రాజశ్రీ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
పూజాఫలం శ్రీ శంభు ఫిలిమ్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం. మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. డి. వి. నరసరాజు మాటలు రాశాడు.
సంక్షిప్త చిత్రకథ[మార్చు]
మధు (అక్కినేని) సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతనికి బిడియం ఎక్కువ. ఆడవాళ్ళకు దూరంగా ఉండే మధు భవంతిలోకి అద్దెకు వచ్చిన వాసంతి అతనితో చనువుగా ప్రవర్తించడంతో అతనిలో ప్రణయ భావావేశం మొగ్గలు తొడుగుతుంది. ఆమె తండ్రికి బదిలీ అవటంతో దూరమౌతుంది. తరువాత అతని జీవితంలోకి తన ఎస్టేటు వ్యవహారాలు చూసే గుమస్తా కుమార్తె సీత ప్రవేశిస్తుంది. ఆమె మధుకి యెంతో సన్నిహితమౌతుంది. వారిద్దరి మధ్య అనురాగం చిగురించి పరస్పర ఆరాధనాభావంగా మారుతుంది. ఇంతలో మధు జీవితంలో చెలరేగిన తుఫాను ఫలితంగా నీలనాగిని అనే వేశ్య, ఆమె బంధుగణం ప్రవేశిస్తారు. ఒకవిధంగా ఆమె నుంచి మధుకు సాంత్వన లభించినా, వారి నిజస్వరూపాన్ని గ్రహించిన మధు వారిని తన్ని తగిలేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆస్తికి వారసత్వ పరమైన చిక్కుల్లో యిరుక్కుంటాడు మధు. దాని నుంచి సీత, ఆమె తండ్రి సహాయంతో బైటపడిన మధు, సీతను భార్యగా స్వీకరిస్తాడు. సీత చేసిన పూజలకు ఫలప్రాప్తి దక్కుతుంది.
నటవర్గం[మార్చు]
- అక్కినేని నాగేశ్వరరావు
- సావిత్రి
- జమున
- జగ్గయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రేలంగి వెంకటరామయ్య
- రమణారెడ్డి
- ఎల్. విజయలక్ష్మి
- రాజశ్రీ
పాటలు[మార్చు]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎందు దాగి ఉన్నావో బృందా విహారి | సాలూరు రాజేశ్వరరావు | ||
నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగె సాగెనందుకో | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
పగలే వెన్నెల జగమే ఊయల | సాలూరు రాజేశ్వరరావు | ||
ఓ బస్తీ దొరగారూ దిగి వస్తారా మీరు | సాలూరు రాజేశ్వరరావు | ||
మదనా మనసాయెరా | సాలూరు రాజేశ్వరరావు | ||
సుందర సురనందనవన మల్లీ జాబిల్లీ అందేనా ? ఈ చేతుల కందేనా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | సాలూరు రాజేశ్వరరావు | |
వన్నెచిన్నెలదీ గులాబీ | సాలూరు రాజేశ్వరరావు |
మూలాలు[మార్చు]
- ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- Pages with lower-case short description
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- నవల ఆధారంగా తీసిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- సావిత్రి నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు
- జమున నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన చిత్రాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన చిత్రాలు