మునిపల్లె రాజు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మునిపల్లె రాజు | |
---|---|
జననం | |
మరణం | 2018 ఫిబ్రవరి 24 | (వయసు 92)
వృత్తి | రచయిత |
జీవిత భాగస్వామి | సులోచనా దేవి |
పిల్లలు | 2 కొడుకులు, 3 కూతుర్లు |
తల్లిదండ్రులు |
|
మునిపల్లె రాజు గా పేరు గాంచిన మునిపల్లె బక్కరాజు (మార్చి 16, 1925 - ఫిబ్రవరి 24, 2018) తెలుగు కథకులలో ప్రముఖుడు.[1] ఈయన తెలుగులో మొదటి సారిగా మాజికల్ రియలిజం శైలిలో కథ రాశాడు.[2]
గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామంలో జన్మించిన ఈయన 1943 నుంచి 1983 దాకా భారత ప్రభుత్వం తరపున రక్షణ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశాడు. దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించాడు. పదవీ విరమణ తర్వాత సికిందరాబాదులోని సైనిక్ పురి కాలనీలో స్థిరపడ్డాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. కాకుమాను మండలం గరికపాడు లో 1925 మార్చి 16 న రాజు జన్మించాడు[3]. తండ్రి హనుమంతరావు తల్లి శారదమ్మ[4]. మునిపల్లె, తెనాలి, పొన్నూరు, నిడుబ్రోలు ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. తెలుగు పండితుడు జమ్మలమడక రామమూర్తి ప్రభావంతో సాహిత్యంలో ఆసక్తిని పెంపొందించుకున్నాడు. ఉన్నత పాఠశాల ఉన్నతవిద్య మాత్రం చదివాడు.
ఉద్యోగం
[మార్చు]1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు. దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించాడు. పదవీ విరమణ తర్వాత సికిందరాబాదులోని సైనిక్ పురి కాలనీలో స్థిరపడ్డాడు.
రచనలు
[మార్చు]కథలు
[మార్చు]మునిపల్లె రాజు వ్రాసిన కొన్నికథల జాబితా[5]
- అంతా విషాదాంతం కాదు
- అదృష్టదేవత
- అమావాస్య పున్నమి
- అరణ్యంలో మానవయంత్రం
- అస్తిత్వనదం ఆవలితీరాన
- ఆమె పేరు అమ్మ
- ఆర్థికశాస్త్రమూ నీతిశాస్త్రమూ
- ఆవలిపక్షం
- ఇంటితనఖా దస్తావేజు
- ఇద్దరు పిల్లలు
- ఉద్యోగ విరమణ
- ఒక బాకీ తీరలేదు
- ఒక లవ్ స్టోరీ...
- కల్లోలగౌతమి...
- కస్తూరి తాంబూలం
- కుడిచేయి-ఎడమచేయి
- కొత్తప్రమిదలో...
- కొత్తసీసా-పాతమందు
- గ్రామంలోహత్య
- చిరంజీవి
- చెప్పులదానం
- జయమూ అపజయమూ
- జీవితం-
- జెట్టీ
- జ్ఞానధార దానధార
- తమస్సులో తపస్సులు
- తిరుగు ప్రయాణం
- దంపతులు
- దరిద్రుడు
- దివోస్వప్నాలతో ముఖాముఖి
- దివ్యజ్యోతి
- దొడ్డమ్మ వారసులు
- నా ఇంటర్వూ పోయింది
- నిశ్శబ్దం ఒక పదంకాదు
- నిష్కృమణ ద్వారం
- నీడల్లేని నిజాలు
- నెత్తురు కన్నా చిక్కనది
- నైమిషారణ్యంలో సత్రయాగం
- పండిత పుత్రుడు
- పాముకాటు
- పుష్పాలు-ప్రేమికులు-పశువులు
- పూజారి
- బడుగుపేదను బాబయ్యా
- బానిసలు
- బిచ్చగాళ్ల జండా
- భోగం మనిషి
- మధుర ఘట్టాలు
- మనుషులు దేవతలు
- మహాభోధి ఛాయలో
- మాతృదర్శనమ్
- యశోదకొడుకు
- రాగమ్-నీలాంబరి
- రాధా రాణి కలలు
- లక్ష్మీఉపాసకుడు
- వారాల పిల్లాడు
- విప్లవవాది
- విశాఖ కనకమహాలక్ష్మి
- వీరకుంకుమ
- వీరులూ-వారసులూ
- వెండి కుంకమ భరణి
- వేరే లోకపు స్వగతాల్లో
- సప్తతి మహోత్సవం
- సమస్య...?
- సరోజ
- సవతి తమ్ముడు
- సావిత్రి
- సుఖాన్వేషకులు
- సుఖీ దుఖీ
- శ్మశానం చిగిర్చింది
కథా సంకలనాలు
[మార్చు]- అస్తిత్వనదం ఆవలి తీరాన
- దివోస్వప్నాలతో ముఖాముఖి
- పుష్పాలు - ప్రేమికులు - పశువులు
- మునిపల్లె రాజు కథలు
కవితా సంకలనాలు
[మార్చు]- అలసిపోయినవాడి అరణ్యకాలు (కవితా సంపుటి)
- వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు (కవితా సంపుటి)
వ్యాస సంకలనాలు
[మార్చు]రచయితలు, కవుల మీద ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి.
- జర్నలిజంలో సృజనరాగాలు
- సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు
నవల
[మార్చు]- పూజారి: ఈ నవలను పూజాఫలం పేరిట బి. ఎన్. రెడ్డి సినిమాగా తీసాడు.
పురస్కారాలు
[మార్చు]- 2006: అస్తిత్వనదం ఆవలి తీరాన అనే చిన్న కథకు 2006 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- 2004: అదే కథకు 2004 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం
- 2004: గోపీచంద్ పురస్కారం
- నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం
- జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు పురస్కారం
- రావిశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం
- పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం[6]
- పులికంటి సాహితీ సత్కృతి
- ఆంధ్ర సారస్వతసమితి సాహిత్య పురస్కారం
- సహృదయ సాహితీ సంస్థ పురస్కారం
- గోపీచంద్ సాహితీ పురస్కారం
రాజు గురించి ప్రముఖులు
[మార్చు]- మధురాంతకం రాజారామ్ "సమకాలీన సాహితీ నావికులకు మునిపల్లె రాజు గారొక లైట్ హౌస్", కథాఋషి
- అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) "కథకుల కథకుడు"
మరణం
[మార్చు]2018, ఫిబ్రవరి 24న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Know your author Munipalle Raju" (PDF). sahitya-akademi.gov.in. సాహిత్య అకాడెమీ. Retrieved 5 March 2018.[permanent dead link]
- ↑ "ప్రఖ్యాత కథకుడు మునిపల్లె రాజు కన్నుమూత". sakshi.com. సాక్షి. Archived from the original on 24 ఫిబ్రవరి 2018. Retrieved 5 March 2018.
- ↑ Who's who of Indian Writers, 1999: A-M By Kartik Chandra Dutt, Sahitya Akademi పేజీ.86
- ↑ జీవన రేఖలు- తాళ్లపల్లి మురళీధరగౌడు- 2005-పేజీలు27-34
- ↑ "కథానిలయంలో మునిపల్లె రాజు కథల వివరాలు". Archived from the original on 2016-03-10. Retrieved 2014-11-26.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
- All articles with dead external links
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using div col with unknown parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలుగు రచయితలు
- తెలుగు నవలా రచయితలు
- 1925 జననాలు
- 2018 మరణాలు
- గుంటూరు జిల్లా రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
- పులుపుల వెంకటశివయ్య అవార్డు గ్రహీత