Jump to content

కాకుమాను

అక్షాంశ రేఖాంశాలు: 16°3′16″N 80°23′56″E / 16.05444°N 80.39889°E / 16.05444; 80.39889
వికీపీడియా నుండి
కాకుమాను
పటం
కాకుమాను is located in ఆంధ్రప్రదేశ్
కాకుమాను
కాకుమాను
అక్షాంశ రేఖాంశాలు: 16°3′16″N 80°23′56″E / 16.05444°N 80.39889°E / 16.05444; 80.39889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంకాకుమాను
విస్తీర్ణం
14.76 కి.మీ2 (5.70 చ. మై)
జనాభా
 (2011)
5,777
 • జనసాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,860
 • స్త్రీలు2,917
 • లింగ నిష్పత్తి1,020
 • నివాసాలు1,751
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522112
2011 జనగణన కోడ్590350

కాకుమాను గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలానికి చెందిన గ్రామం, ఈ మండలానికి కేంద్రమూను. ఇది సమీప పట్టణమైన బాపట్ల నుండి 21 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1751 ఇళ్లతో, 5777 జనాభాతో 1476 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2860, ఆడవారి సంఖ్య 2917. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1117 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 84. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590350.[1]

గ్రామ గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6080, ఇందులో పురుషుల సంఖ్య 3065, స్త్రీల సంఖ్య 3015, గ్రామంలో నివాసగృహాలు 1610 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1476 హెక్టారులు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 37కి.మీ.ల దూరంలోను, బాపట్ల పట్టణం నుండి 21కి.మీ.ల దూరంలోను ఉంది. కాకుమాను గ్రామం అక్షాంశ రేఖాంశాలు 16°3'16"N 80°23'56"E.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో అప్పాపురం, పుసులూరు, పమిడివారిపాలెం, గార్లపాడు, కొమ్మూరు గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

బాపట్ల, గుంటూరు, పెదనందిపాడు, పొన్నూరు పట్టణాలు కాకుమానుకు రోడ్డుమార్గంలో కలుపబడి ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పెదనందిపాడు లో ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

నన్నపనేనివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

[మార్చు]
  • ఈ పాఠశాల నుండి చాలా మంది చదువుకొని ప్రసిద్ధులైనారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 325 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. వీరిలో బాలురు=150 మంది, బాలికలు=175 మంది.
  • ఈ పాఠశాలలో 1946 నుండి 2014 వరకు చదువుకున్న విద్యార్థులు, 2015, జనవరి-14వ తేదీనాడు ఓపీ సంస్థ అధ్యక్షులు శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఉత్సాహ భరితంగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థి, రాజ్యసభ సభ్యులు జె.డి.శీలం మొదలగువారు పాల్గొని తమ చిన్ననాటి అనుభూతులను నెమరు వేసుకున్నారు. విశ్రాంత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
  • ఈ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న పరుచూరి వీరయ్య, మదర్ థెరెస్సా ఫౌండేషను ద్వారా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాల స్థానిక ఎస్.టి.కాలనీలో ఉంది.

ఎస్.సి.బాలుర వసతిగృహం

[మార్చు]

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కాకుమానులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

కాకుమాను గ్రామం గొప్ప గొప్ప వైద్యులకు ప్రసిద్ధి. వారిలో కొంగర కోదండరామయ్య, గొట్టిముక్కల రాధాకృష్ణ, నల్లమోతు సుబ్బారావు, ధూళిపాళ కోటేశ్వరరావు ప్రసిద్దులు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కాకుమానులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ), సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

కాకుమానులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 218 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 14 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 40 హెక్టార్లు
  • బంజరు భూమి: 20 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1182 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 289 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 912 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కాకుమానులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 669 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 243 హెక్టార్లు

సాగునీటి సౌకర్యం

[మార్చు]

డా. దగ్గుబాటి రామానాయుడు (మాజీ పార్లమెంటు సభ్యుడు) సహకారంతో రెండు మంచినీటి సరఫరా ప్రాజెక్టులు అభివృద్ధి చేయబడ్డాయి. ఒకటి క్రొత్త కాలువ నుండి, మరొకటి కొమ్మనూరు కాలువ నుండి. ఈ ప్రాజెక్టులు చుట్టుప్రక్కల 10పైగా గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తాయి.

ఓగేరు వాగుపై నిర్మించిన ఎత్తిపోతల పథకం

[మార్చు]

పెదనందిపాడులో ఇటీవల జిల్లాలోకే పెద్దదయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని, 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ పథకం ద్వారా పెదనందిపాడు, కాకుమాను మండలాలోని 9,013 ఎకరాలకు సాగునీరు అందించెదరు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

గ్రామ సర్పంచిలు

[మార్చు]
  • కొంగర సూరయ్య - రెండు దశాబ్దాలుగా సర్పంచిగా ఉన్నారు.
  • 1989 - 1994: కాండ్రు హరిబాబు
  • 1994 - 2000: నన్నపనేని హనుమయ్య
  • 2000 - 2006: నన్నపనేని కిషోర్ బాబు
  • 2006 - 2013: జె.యజ్ఞనారాయణ
  • 2013 - కొసనా మధుసూదనరావు. వీరు తరువాత గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. వీరు, 2015, నవంబరు-12వ తేదీ ఉదయం, గుంటూరు నగర శివారు, బుడంపాడు గ్రామం వద్ద జరిగిన ఒక రహదారి ప్రమాదంలో, 42 సంవత్సరాల వయస్సులో, కాలధర్మం చెందినారు. 10వ తరగతి వరకు గ్రామంలోనే విద్యనభ్యసించిన ఈయన, 1995లో భారత నౌకదళంలో చేరినారు. 2011 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాలలో ప్రవేశించారు. 2013లో మొదటిసారిగా సర్పంచిగా పోటీచేసి గెలుపొందినారు. వీరి అనంతరం కె.రఘు, ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం - శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒక అవతారమే శ్రీ చెన్నకేశవస్వామి అవతారం. చూపరులను ఆకట్టుకొనే పరిసరాలమధ్య ఈ ఆలయం, ఈ గ్రామంలో, ఎన్నో దేవతల సమాహారంగా కొలువుదీరింది. ఈ ఆలయాన్ని 2 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు.
  • శ్రీ అగస్తేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయాన్ని 1.5 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో, ఒక వారం రోజులపాటు శివనామ పంచాక్షరీ సప్తాహ కార్యక్రమం నిర్వహించెదరు. ఈ సందర్భంగా దేవతా మూర్తులను శోభాయమానంగా అలంకరించెదరు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. చివరిరోజున భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించెదరు.
  • శ్రీ కోదండరామాలయం:- ఈ ఆలయ వార్షిక ఉత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం.
  • కాకుమానుకు ఒక శివారు గ్రామం కొండపాటూరు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి గ్రామదేవత పోలేరమ్మ తిరుణాలు ఘనంగా జరుగుతాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వ్యవసాయం, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కళా రంగం

[మార్చు]
  1. డా. ఎన్.ఎ.పి. ఆచార్యులు:- ఎన్నో పరిషత్తు నాటకాలలో నటించి 200పైగా ఉత్తమ నటునిగా బహుమతులు పొందాడు. సినిమాలు, టి.వి.ధారావాహికలలో కూడా నటించాడు.
  2. ఇంకా నాటక రంగంలో నారాయణ, అనంత పద్మనాభాఛార్యులు, డి. శ్రీహరి రావు, కె.యస్.ఆర్.కె.ప్రసాదు, సురేష్ చైతన్య, రామక్రిష్, చెన్నుపాటీ వేంకటారత్నమ్ మొదలగు వారు ప్రసిద్దులు.
  3. చాగంటి శ్రీనివాసరావు ఒక మంచి మిమిక్రీ కళాకారునిగా ఎన్నో బహుమతులు గెలుచుకొన్నాడు.

రాజకీయరంగం

[మార్చు]

2014, మే నెలలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి షేక్ జానీమూన్, కాకుమాను జడ్.పి.టి.సి. సభ్యులుగా ఎన్నికైనారు. వీరు 2014, జూలై-5న జిల్లా పరిషత్తు ఛైర్ పర్సనుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అదే రోజున పదవీ బాధ్యతలు స్వీకరించారు. [4]

శాస్త్రవేత్తలు

[మార్చు]

కాకుమానుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త కొంగర రమేష్, ఇటీవల కొత్తఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్ కార్యక్రమంలో, సృష్టి సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు. తన సృజనాత్మకతతో నూతన మామిడి, మిరప వంగడాలను సృష్టించినందుకు ఆయనకు ఈ పురస్కారం అందించారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=కాకుమాను&oldid=4363446" నుండి వెలికితీశారు