Jump to content

భల్లూఖానుడు పాలెం

అక్షాంశ రేఖాంశాలు: 16°5′N 80°24′E / 16.083°N 80.400°E / 16.083; 80.400
వికీపీడియా నుండి
భల్లూఖానుడు పాలెం
పటం
భల్లూఖానుడు పాలెం is located in ఆంధ్రప్రదేశ్
భల్లూఖానుడు పాలెం
భల్లూఖానుడు పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°5′N 80°24′E / 16.083°N 80.400°E / 16.083; 80.400
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంకాకుమాను
విస్తీర్ణం
16.93 కి.మీ2 (6.54 చ. మై)
జనాభా
 (2011)
2,965
 • జనసాంద్రత180/కి.మీ2 (450/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,455
 • స్త్రీలు1,510
 • లింగ నిష్పత్తి1,038
 • నివాసాలు953
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522112
2011 జనగణన కోడ్590349

భల్లూఖానుడు పాలెం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కాకుమాను నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 953 ఇళ్లతో, 2965 జనాభాతో 1693 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1455, ఆడవారి సంఖ్య 1510. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 859 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 589. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590349.[1]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3102, ఇందులోపురుషుల సంఖ్య 1565, స్త్రీల సంఖ్య 1537, గ్రామంలో నివాస గృహాలు 845 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1693 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి కాకుమానులోను, మాధ్యమిక పాఠశాల గరికపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల కాకుమానులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు పొన్నూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు పొన్నూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

[మార్చు]
  1. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీనివాసరావు, జాతీయ సమైక్యతా పురస్కారానికి ఎంపికైనారు.2014, జనవరి-26న, హైదరాబాదులో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ అను స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఇతనికి ఈ పురస్కారం అందజేస్తారు.[1]
  2. ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారం క్రింద,ఈ పాఠశాల ప్రథమస్థానం పొందింది.[4]
  3. ఈ పాఠశాలలో డిజిటల్ తరగతుల ఏర్పాటు నిమిత్తం, ఎం.పి.పి. నక్కల శైలజ, ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించంది.[4]

గోరంట్ల శ్రీనివాసరావు

[మార్చు]

ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన ఇతను, విద్యాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసి గురువుకు పర్యాయపదంగా నిలిచాడు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులంటే ఎవరికీ తీసిపోరని నిరూపించాడు.ఇతను పనిచేసిన పాఠశాలలో విద్యార్ధుల ఉన్నతికి అహర్నిశలూ శ్రమించడమే కాకుండా, ఆ పాఠశాలలను ఉన్నత స్థానాలలో నిలబెట్టటానికి దోహదబడ్డాడు. మొన్నటి వరకూ పనిచేసిన ఇతను ఈ పాఠశాలను ఏకంగా జాతీయస్థాయిలో స్వచ్ఛపాఠశాలగా నిలిపినాు. 2017,సెప్టెంబరు-5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, కొత్తఢిల్లీలో ఆ పాఠశాలకు దక్కుతుండగా, అదే వేదికపై భారత రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకొనబోవుచున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఆరుగురు ఉపాధ్యాయులు ఈ పురస్కారానికి ఎంపికకాగా,ఇతను అందులో మొదటిస్థానంలో ఉండటం విశేషం. పొన్నూరు మండలం, నిడుబ్రోలులోని రైలుపేట ఇతని స్వస్థలం. ఇతను బి.ఎస్.సి పట్టాతోపాటు, రెండు ఎం.ఏ లూ, ఎం.ఈ.డి , ఎం.ఫిల్ చదివాడు.1989 లో తొలిసారిగా ఉపాధ్యాయులుగా విధులలోకి చేరిన ఇతను, ముగ్గురు మంత్రులూ, కలెక్టర్ల చేతుల మీదుగా ఇంత వరకు, జిల్లా, రాష్ట్రస్థాయిలలో 67 పురస్కారాలు పొందాడు. అంతేగాక మార్వెలస్ బుక్ ఆఫ్ ఇండియా లో స్థానం పొందాడు. ఈ గ్రామానికి ముందు ఈదులపల్లి, కోమలి వంగిపురం, యనమదల గ్రామాలలో పనిచేసాడు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

భల్లూకానుడుపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

భల్లూకానుడుపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 99 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 2 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 68 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1519 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 390 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1129 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

భల్లూకానుడుపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 805 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 323 హెక్టార్లు

మౌలిక సదుపాయాలు

[మార్చు]
  1. త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో ఇంతకు ముందు త్రాగునీటికి గ్రామస్థులు చాలా ఇబ్బందులు పడేవారు. చెరువు నీరు కలుషితమై త్రాగటానికి అనువుగాకుండా పోయింది. త్రాగు నీటికోసం గ్రామస్థులు యాత్రలు చేయాల్సి వచ్చేది. బయటి నుండి తెచ్చిన శుద్ధజలాన్ని, 20 రూపాయలకొక డబ్బా చొప్పున కొనుక్కొని త్రాగ వలసి వచ్చేది. స్థోమతు లేనివారు, చెరువు నీటినే త్రాగి అనారోగ్యం పాలయ్యేవారు. ఈ పరిస్థితులలో ఈ గ్రామానికి చెందినవారు, ఎక్కడెక్కడో స్థిరపడినవారు, గ్రామాభివృద్ధికోసం విరాళాలివ్వగా, గ్రామంలో రు. ఆరు లక్షలతో, శుద్ధినీటి యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనితో గ్రామస్థుల దాహార్తి తీరినది. ఇంకా, దాతల సహకారంతో గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మించడానికి పూనుకున్నారు. అలాగే మహాప్రస్థానానికి గూడా దాతలు ముందుకు వచ్చారు. గ్రామస్తులైన ఎన్.ఆర్.ఐ.లు గూడా గ్రామాభివృద్ధికి నిధులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. [2]&[3]
  2. తపాలా కార్యాలయం.
  3. చౌకదర దుకాణం.
  4. రైస్ మిల్లు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గూడా, గ్రామస్థులు, సర్పంచిగా భీమవరపు కోటేశ్వరమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ గా స్వరూపరాణిని ఎన్నికచేసుకున్నారు. ఈ గ్రామస్థులు వార్డు సభ్యులనూ గూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని, దీనికి ప్రభుత్వం వారిచ్చే నగదు పారితోషికాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించుచూ, పలువురికి ఆదర్శంగా నిలుచుచున్నారు.

గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]
  1. రామాలయం.
  2. బ్రహ్మగారి గుడి.
  3. పోలేరమ్మ గుడి: ఇక్కడ పోలేరమ్మతల్లి శిడులు ప్రతి ఏటా జరుగుతాయి.
  4. వినాయక గుడి.

ప్రధాన పంటలు

[మార్చు]

ఇక్కడ పండే ప్రధాన పంటలు వరి, పత్తి, మిరప

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]