మోహినీ రుక్మాంగద (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోహినీ రుక్మాంగద (1937 సినిమా) కూడా చూడండి.

మోహినీ రుక్మాంగద
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం కోవెలమూడి భాస్కరరావు
తారాగణం బాలయ్య,
జమున,
కృష్ణకుమారి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ సినిమా 1962, జనవరి 13న విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

 • బాలయ్య
 • జమున
 • కాంతారావు
 • కృష్ణకుమారి
 • సూర్యకాంతం

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
 • సంగీతం: ఘంటసాల
 • రచన: సముద్రాల జూనియర్
 • ఛాయాగ్రహణం: కమల్ ఘోష్

కథ[మార్చు]

అయోధ్యా పురాధీశ్వరుడు రుక్మాంగదుడు పరమ భక్తుడు. అతని భార్య సంధ్యావళి సంతోషం కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. ఆ ఉద్యానవన వైభవాన్ని నారదుడు దేవకన్యలకు వివరించగా వారు రోజూ రహస్యంగా రాత్రిపూట ఆ తోటలోకి వచ్చి పువ్వుల్ని కోసుకెళుతుంటారు. విదూషకుడు రాత్రి ఆ తోటకు కాపలాగా ఉన్నాడు. అయినా దేవకన్యలు అదృశ్యరూపంలో వచ్చి పూలను కోసుకు వెళతారు. చివరకు ఆ పుష్పాపహరణ చేస్తున్నదెవరో తెలుసుకునేందుకు తోటలో పుచ్చకాయ విత్తులు చల్లారు. వాటి ప్రభావం వల్ల దేవకన్యలు అదృశ్యులై తమ లోకానికి ఎగిరిపోయే శక్తిని కోల్ఫోయి పట్టుపడి పోతారు. రాణి వారిని క్షమిస్తుంది. తిరిగి వారు తమ లోకానికి ఎగిరిపోవడానికి రాజు, రాణి తమ పుణ్యాన్ని అంతా ధారపోస్తారు. అయినా ఆ పుణ్యం సరిపోలేదు. నారదుడు ఏకాదశవ్రత ప్రభావం గురించి చెప్పి ఆ వ్రతం చేసిన వారు ఎవరైనా ఉంటే వారి పుణ్యప్రభావంచే దేవకన్యలు తిరిగి దేవలోకానికి ఎగిరిపోగలరని చెబుతాడు. కోడలితో గొడవపడి ఒక పూటంతా అభోజనంగా ఉండి రాత్రంతా జాగారం చేసి ఏకాదశిని గడిపిన ఒక ముదుసలిని విదూషకుడు తీసుకుని రాగా ఆ ముసలి పుణ్యప్రభావం వల్ల దేవకన్యలు దేవలోకానికి ఎగిరిపోతారు. ఏకాదశవ్రత ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రుక్మాంగదుడు తాను ఆ వ్రతం చేయడమే కాక, ప్రజలందరూ ఆ వ్రతాన్ని ఆచరించేటట్లు చేస్తాడు. దేశం సుభిక్షమవుతుంది. రాణి మగబిడ్డను కంటుంది. తల్లిదండ్రులు ఆ బిడ్డకు ధర్మాంగదుడు అనే పేరు పెడతారు. దేశంలోని ప్రజలందరూ ఈ వ్రతం చేయడంతో యమలోకానికి వచ్చే జనాభా తగ్గి యముడు ఖిన్నుడౌతాడు. యముడు బ్రహ్మ సహాయంతో మోహిని సృష్టించి రుక్మాంగదుని వ్రతదీక్ష నుండి మరలించమని పంపిస్తాడు. మోహిని ప్రేమలో రుక్మాంగదుడు చిక్కుకుంటాడు. మోహిని చెలికత్తె చంప విదూషకుని ఇంటిలో చిచ్చు రగులుస్తుంది. మోహినిని తన భర్త వివాహం చేసుకున్న సంగతి విని సంధ్యావళి కలవరం చెందలేదు. ఆమె, ధర్మాంగదుడు తనపట్ల చూపిన సౌజన్యానికి మోహిని ముగ్ధురాలౌతుంది. తన కర్తవ్యాన్ని మరచిపోవద్దని యముడు, బ్రహ్మ ఆమెను శాసిస్తారు. మోహిని రుక్మాంగదునితో ఏకాదశవ్రతం చేయడానికి వీలులేదంటుంది. కానీ రుక్మాంగదుడు వ్రతం మాననంటాడు. పెళ్ళి సందర్భంగా ఏది కోరినా ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమంటుంది. వ్రతం చేసే పక్షంలో పుత్రుని శిరస్సును ఖండించి తనకు సమర్పించమంటుంది. రుక్మాంగదుడు, సంధ్యావళి ఎంతో క్షోభపడతారు. చివరకు రుక్మాంగదుడు ధర్మాంగదుడి తలను నరకడానికి సిద్ధమవుతాడు. రుక్మాంగదుని చేతిలోని కత్తి పూలదండగా మారిపోతుంది. మహావిష్ణువు ప్రత్యక్షమౌతాడు. యముడు తన ఓటమిని అంగీకరిస్తాడు. కథ సుఖాంతమౌతుంది[1].

పాటలు, పద్యాలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు ఘంటసాల సంగీతాన్ని సమకూర్చాడు[2].

క్ర.సం. పాట/పద్యం గాయకులు రచయిత
1 అనురాగమే నా మదిలొ మధురానంద గీతాలు పాడే జిక్కి, ఘంటసాల శ్రీశ్రీ
2 ఓ రాజా నీ మానసమేలే మోహినినే నీకోసమే చేయి పి.సుశీల శ్రీశ్రీ
3 శ్రీలోలా దివ్యనామ దీనావనా మమ్మేలే దైవరాయ ఘంటసాల, కె. రాణి, సరోజిని మల్లాది
4 ఎక్కడ జన్మభూమి తరళేక్షణ నీ తల్లిదండ్రులెవ్వరు (పద్యం) ఘంటసాల
5 చిలుకలు గోర్వొంకలుగా మీ హృదయము లేకముగా పి.లీల, సరోజిని కొసరాజు
6 నిను నమ్మి శరణంటిరా ఓదేవా నను దయగనుమంటిరా (హరికధ) ఘంటసాల కొసరాజు
7 పతి సౌఖ్యమే తన సౌఖ్యము పతియే సర్వస్వమనుచు (పద్యం) పి.సుశీల కొసరాజు
8 ప్రజల చిత్తమ్మునకు అనువర్తియౌచు (పద్యం) సరోజిని కొసరాజు
9 శరణు శరణు భక్తవరదా దయామయా మౌని (పద్యం) పి.సుశీల కొసరాజు
10 రాజనిమ్ననపండు రావయ్యో నీ రాకడ తెలిసెను స్వర్ణలత, మాధవపెద్ది కొసరాజు
11 కలుషము లడంచి సర్వ సౌఖ్యమ్ము లొసంగు (పద్యం) ఘంటసాల కొసరాజు
12 అలెల్లా కన్నునిండు బాలుడా ఆలెల్లా అల్లిబిల్లి వీరుడా పి.లీల బృందం మల్లాది
13 మాధవ తవ నామ సంకీర్తనా పావన కైవల్య సాధనా ఘంటసాల,పి.లీల బృందం ఆరుద్ర
14 మనసైన వీరా మనసాయె రారా ఎనలేని భోగాలన్నీ పి.సుశీల మల్లాది
15 అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదాంబా రాఘవులు,విజయలక్ష్మి కొసరాజు

మూలాలు[మార్చు]

 1. సంపాదకుడు (21 January 1962). "చిత్ర సమీక్ష - మోహినీరుక్మాంగద". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 18 February 2020.
 2. కొల్లూరి భాస్కరరావు. "మోహినీ రుక్మాంగద - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 18 February 2020.