చెంచులక్ష్మి (1958 సినిమా)
చెంచులక్ష్మి (1958 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
కథ | సదాశివ బ్రహ్మం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (విష్ణువు, నరహరి), అంజలీదేవి (ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి) ఎస్వీ రంగారావు (హిరణ్య కశిపుడు) పుష్పవల్లి (లీలావతి) మాస్టర్ బాబ్జీ (ప్రహ్లాదుడు) రేలంగి (నారదుడు) నాగభూషణం (శివుడు) గుమ్మడి వెంకటేశ్వరరావు (దూర్వాసుడు) నల్ల రామమూర్తి వంగర సీతారాం అంగముత్తు |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర, కొసరాజు, సముద్రాల, సదాశివ బ్రహ్మం |
సంభాషణలు | సదాశివ బ్రహ్మం |
నిర్మాణ సంస్థ | బి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చెంచులక్ష్మి, 1958లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యింది. (ఇదే పేరుతో 1943లో ఒక సినిమా వచ్చింది.) ఈ సినిమాలో మొదటి భాగంలో ప్రహ్లాదుని కథను, రెండవ భాగంలో చెంచులక్ష్మి కథను చూపారు. మొదటి భానుమతిని ఎంపిక చేశారు. తరువాత ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకొన్నారు. ఈ సినిమా విడుదలైనపుడు విష్ణువు గెటప్‌లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలెండర్లను థియేటర్ల వద్ద అమ్మారు. ఈ సినిమాలో పాటలు జనప్రియమయ్యాయి.
చెంచులక్ష్మి కథ[మార్చు]
అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.
పాత్రలు-పాత్రధారులు[మార్చు]
పాత్ర | నటి / నటుడు |
---|---|
విష్ణువు | అక్కినేని నాగేశ్వరరావు |
లక్ష్మీదేవి/చెంచులక్ష్మి | అంజలీ దేవి |
హిరణ్యకశిపుడు | ఎస్.వి. రంగారావు |
నారదుడు | రేలంగి వెంకట్రామయ్య[1] |
ప్రహ్లాదుడు | మాస్టర్ బాలాజీ |
చెంచు రాణి | సంధ్య |
శివుడు | నాగభూషణం |
ఋష్యేంద్రమణి | |
దూర్వాసుడు | గుమ్మడి వెంకటేశ్వరరావు |
లీలావతి | పుష్పవల్లి |
చండామార్కులు | వంగర వెంకట సుబ్బయ్య |
ఎ.వి. సుబ్బారావు | |
నల్ల రామమూర్తి |
పాటలు[మార్చు]
పాట | రచయత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆనందమాయే అలి నీలవేణీ అరుదెంచినావా అందాలదేవీ | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, జిక్కి |
కనలేరా కమలాకాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలుని అదిగో కనలేరా శంఖ చక్రధారిని | సదాశివబ్రహ్మం | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ రావా | సాలూరు రాజేశ్వరరావు | జిక్కి, ఘంటసాల | |
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, జిక్కి |
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునది నీవే కావా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా బాలుని నను దయపాలించుటకై కనిపించేవ మహానుభావా | సదాశివబ్రహ్మం | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
శ్రీనాధుని పద సరసిజ భజనే ఈ నరజన్మము కనిన ఫలం | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల బృందం |
- ఇంకా
ఇందుగలదండు లేడని సందేహము వలదు 01. ఎంత దయామతివయ్యా అనంతా 02. ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది సత్యం 04. కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత - ఘంటసాల 05. చదివించిరి నను గురువులు 06. చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకిదాం - ఎ.పి.కోమల, జిక్కి బృందం 08. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే గోరొంక - జిక్కి, ఘంటసాల 09. నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల 11. పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది సత్యం 12. మందార మకరంద 13. మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం - ఘంటసాల 14. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే ముచ్చటైన వినోదము - జిక్కి, ఘంటసాల బృందం 15. మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి
వనరులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006
- సూర్య దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.