చెంచులక్ష్మి (1943 సినిమా)
1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం చెంచులక్ష్మి చూడండి
చెంచులక్ష్మి (1943 తెలుగు సినిమా) | |
చెంచు లక్ష్మి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.సౌందర రాజన్ |
నిర్మాణం | ఎస్.సౌందర రాజన్ |
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | సి.హెచ్.నారాయణరావు (విష్ణువు, వరహరి), చిత్తూరు నాగయ్య (శిఖనాయకుడు), ఋష్యేంద్రమణి (ఆదిలక్ష్మి), కమలా కోట్నీస్ (చెంచులక్ష్మి), లంకా సత్యం గరుడాచారి |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, ఆర్.ఎన్.చిన్నయ్య |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | జితేన్ బెనర్జీ |
నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
భాష | తెలుగు |
చెంచులక్ష్మి, 1943లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది. కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. టైటిల్స్‌లో చిన్నయ్య పేరు ఉన్నా గాని సంగీతానికి సంబంధించిన పని అధికంగా సుబ్బరామన్‌దేనని చెబుతారు. టైటిల్స్ మ్యూజిక్‌లోను, గూడెం వాయిద్యాలలోను లాటిన్ అమెరికన్ పోకడలను ప్రవేశపెట్టిన ఘనత సుబ్బరామన్‌దే.
చెంచులక్ష్మి కథ
[మార్చు]అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని 12 పాటలను, పద్యాలను సముద్రాల రాఘవాచార్య రచించారు.[1]
- అతి భాగ్యశాలి నారీ పరిచరణ కమల పూజారీ - ఋష్యేంద్రమణి
- ఆడది ఆడదే, ఆడనేర్చి వేటాడ నేర్చినా - ఋష్యేంద్రమణి
- ఇంతకన్న నాకేది భాగ్యమూ - నాగయ్య
- ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
- ఏలుకోవయ్య ఓబులేశా మమ్మేలుకోవయ్యా - బాలసరస్వతి
- కనిపించితివా నారసింహ, కనికరించినావా ఈ లీల - కమలా కొట్నీస్
- కమలానాథా - జగన్నాథా కమల భవార్చిత పదకమలా
- కమలానాథా - జగన్నాథా కమలా మోహనా
- ధన్యుడరా నే నరసింహా నా జన్మ తరించెనురా దేవా - నాగయ్య
- నిజమాడు దాన నీదానా, నిను నమ్మి మనేదానా - ఋష్యేంద్రమణి
- నీదే భారము గాదా దేవా తోడునీడ నీవే గాదా - నాగయ్య
- పోవె కదలి పలుగాకీ, పోపోవె - ఋష్యేంద్రమణి, బాలసరస్వతి
- మధురముగా ఆహా మధురముగా - బాలసరస్వతి, ఎస్.వెంకట్రామన్
ఈ సినిమా మీద చలం వాఖ్యలు
[మార్చు]ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
- ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో! - "కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
వనరులు, బయటి లింకులు
[మార్చు]- ↑ చెంచులక్ష్మి, జీవితమే సఫలము, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు 167-74.
- సూర్య దినపత్రిక - 11 జనవరి 2008 శుక్రవారం - సూర్యచిత్ర అనుబంధం - ఆనాటి చిత్రాలు
- ఘంటసాల.ఇన్ఫోలో చెంచులక్ష్మి చిత్రం సమాచారం