ప్రపంచం సీతారాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డా. ప్రపంచం సీతారాం వేణుగానలోలురు. చిన్నతనంలోనే సంగీత రసజ్ఞలనలరించారు. సీతారాం విజయవాడలో 21.9.42 లో జన్మించారు. ఆకాశవాణిలో 1980 లో చేరడానికి ముందు ఢిల్లీ లోని అశోకా హోటల్లో వేణుగాన విద్వాంసులుగా పనిచేశారు. యు.పి.ఎస్.సి. ద్వారా 1976 లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్ట్ అయి మదరాసులో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా 11.2.85 నుండి విజయవాడలో పనిచేశారు. డైరక్టరేట్ లో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా నాలుగేళ్లు పనిచేశారు. 1993 లో స్వచ్ఛంద పదవీ విరమణానంతరం తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్ గా చేరారు. సంగీతంలో సీతారాం డాక్టరేట్ పొందారు. విద్వాంసులుగా సీతారాం పేరొందారు. ఆయన వయోలిన్ వాద్యవిద్వాంసుడు అన్నవరపు రామస్వామి శిష్యుడు.