బాలరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బాలరాజు
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
నిర్మాణం ఘంటసాల బలరామయ్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి,
కస్తూరి శివరావు,
అంజలీదేవి
సంగీతం గాలిపెంచల నరసింహారావు
(సహాయకులు: ఘంటసాల, సి.ఆర్‌.సుబ్బరామన్‌)
గీతరచన సముద్రాల రాఘవాచార్య
(సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి)
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
(సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి)
కళ ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 26
భాష తెలుగు

బాలరాజు తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

ఒక యక్ష కన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. వీళ్ల గురించి తెలుసుకొని మహేంద్రుడు శపిస్తాడు. దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు. ఆ యక్షుడు బాలరాజవుతాడు. ఆ కన్య సీతగా కనిపిస్తుంది. బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు. అతని వెంటపడుతూ గతం గుర్తు చేయాలని సీత తపిస్తుంది. ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది. అప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో - కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయకి వెంటపడతాడు. కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు. ఇలాంటి 'సినీ ప్రాథమిక సూత్రాల'కు భిన్నంగా వెళ్లిన చిత్రమిది.

పాత్రధారులు - పాత్రలు

[మార్చు]

విశేషాలు

[మార్చు]
చందమామ పత్రికలో బాలరాజు ప్రకటన
  • అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రమిది. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం కూడా ఇదే.[1]
  • ఈ చిత్రానికి ముందు ప్రతిభ పిక్చర్స్‌ ఘంటసాల బలరామయ్య అక్కినేని కథానాయకుడుగా ముగ్గురు మరాఠీలు అనే జానపద చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం వంద రోజులు ఆడిన విజయోత్సాహంతో బాలరాజు చిత్రానికి శ్రీకారం చుట్టారు.
  • ఈ సినిమాలో 20 పాటలున్నాయి.
  • అక్కినేనికి తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఈ సినిమాతోనే దక్కింది. వీళ్లిద్దరూ మద్రాసులో రూమ్మేట్స్‌. అప్పట్లో అక్కినేని స్వయంగా పాడుకొనేవారు. ఇందులో 'చెలియా కనరావా...' పాట పాడేటప్పుడు పక్కన ఎస్‌.వరలక్ష్మిదీ, తనదీ ఒకే శ్రుతిలో ఉండటం; పైగా తన గాత్రంలో స్త్రీత్వం వినిపించడం అక్కినేనికి నచ్చలేదు. దాంతో బలరామయ్య దగ్గరకు వెళ్లి 'నేపథ్య గానం సదుపాయం వచ్చింది. ఈ పాటను ఘంటసాలతో పాడించండి' అనడంతో ఈ సినిమాలో పాడే అవకాశం ఘంటసాలకు దక్కింది.
  • అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు 'యలమంద' పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు.
  • తీయని వెన్నెల రేయి అనే పాటకు నర్తించిన అంజలీదేవి ఆ తరువాతి కాలంలో కథానాయికగా ఎదిగింది.
  • అప్పట్లో చిన్న కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరుల్లో రజతోత్సవాలు జరిగాయి. అలాంటి కేంద్రాలెన్నింట్లోనో బాలరాజు వందాడింది. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి చిత్రశాలల నిర్మాణానికి చాలా మంది ఉత్సాహం చూపించారు.
  • ఆ రోజుల్లో నాగేశ్వరరావుని చూసి పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో! ఆ కేశాలంకరణ, మీసకట్టు 'బాలరాజు స్టైల్‌'గా పేరొందాయి.
  • ఇది విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావుని బాలరాజు అనే పిలిచేవారు.
  • నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణగారు పెళ్లిచూపులు చూసింది బాలరాజు సినిమా చూసే.

పాటలు

[మార్చు]
పాట పాడిన వారు సంగీతం సాహిత్యం
నవోదయం - శుభోదయం ఘంటసాల, వక్కలంక సరళ ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
తీయని వెన్నెల రేయి వక్కలంక సరళ ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
ఎవరినే ...నేనెవరినే ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
సూడ చక్కని చిన్నది పిఠాపురం నాగేశ్వరరావు గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
నీకు నీవారు లేరు ఎస్.వరలక్ష్మి గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
గూటిలో చిలకేదిరా ఉడుతా సరోజిని, పిఠాపురం గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
ఓ బాలరాజా ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
వరుణా వరుణా వర్షించగదయ్యా ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
ఓ బాలరాజా ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
దేముడయ్యా దేముడు కస్తూరి శివరావు గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
చెలియా కానరావా ఇక అక్కినేని నాగేశ్వరరావు గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
తేలి చూడుము హాయి ఘంటసాల, ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
రాజా రారా - నారాజా రారా ఎస్.వరలక్ష్మి గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
వరాల కూన నిన్ను కస్తూరి శివరావు గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
ఒకరిని నానవేశా కస్తూరి శివరావు, నారీమణి గాలి పెంచల నరసింహారావు సముద్రాల రాఘవాచార్య
రూపము నీయరయాపతి ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
వేరేలేరయా పరమేశా ఎస్.వరలక్ష్మి ఘంటసాల సముద్రాల రాఘవాచార్య
చాలు వగలు ఎస్.వరలక్ష్మి , అక్కినేని నాగేశ్వరరావు ఘంటసాల సముద్రాల రాఘవాచార్య

మూలాలు

[మార్చు]
  1. "Memorabilia of Telugu cinema in The Hindu, 2007". Archived from the original on 2011-06-06. Retrieved 2014-01-22.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలరాజు&oldid=3385851" నుండి వెలికితీశారు