Jump to content

గృహలక్ష్మి (1938 సినిమా)

వికీపీడియా నుండి
గృహలక్ష్మి
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.ఎమ్.రెడ్డి
నిర్మాణం మూలా నారాయణస్వామి,
బి.ఎన్.రెడ్డి,
హెచ్.ఎమ్.రెడ్డి
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం కన్నాంబ,
కాంచనమాల,
చిత్తూరు నాగయ్య,
రామానుజాచారి,
గౌరీపతిశాస్త్రి,
రోహిణి,
గోవిందరాజు సుబ్బారావు,
సరళ,
మోహిని
సంగీతం ప్రభల సత్యనారాయణ
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం కె.రామ్‌నాథ్
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గృహలక్ష్మి హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. ఈ చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తూ నిర్మించారు. ఈ చిత్రానికి సోమరాజు రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ అనే నాటకం ఆధారం. ఇందులో వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తం. చిత్తూరు నాగయ్యకు నటుడిగా ఇది మొదటి సినిమా.[1]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

నర్తకి మాధురి (కాంచనమాల) ని ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు (రామానుజాచారి) తన భార్య రాధ (కన్నాంబ) ను నిర్లక్ష్యం చేస్తాడు. తాగుడుకు బానిస అయిన కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అభియోగం మోపబడుతుంది. సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే గోపీనాథ్ (నాగయ్య) రాధను చేరదీసి ఆదుకుంటాడు. మాధురితో గొడవపడిన సందర్భంగా రాధ మతిస్థిమితం కోల్పోతుంది. అతనిలోని వేశ్యాలోలత్వం వలన అతని డబ్బు దస్కం కోల్పోతాడు. దైవవశాత్తు భార్య నోములు ఫలించి మరణదండన తప్పుతుంది. భార్యాపిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పిక్చర్స్ పతాకంపై గృహలక్ష్మి చిత్రాన్ని తీయాలని సంకల్పించారు. సోమరాజు రామానుజరావు రాసిన రంగూన్ రౌడీ ఆధారంగా సినిమా కథను అభివృద్ధి చేశారు. తర్వాతికాలంలో ప్రముఖ దర్శకునిగా ప్రఖ్యాతుడైన బి.ఎన్.రెడ్డి అప్పటికి పత్రికా నిర్వహణ వ్యాపారంలో ఉండేవారు. సినీరంగం, నాటకరంగాలపై అభిరుచి కలిగిన బి.ఎన్.రెడ్డిని హెచ్.ఎం.రెడ్డి సంప్రదించి రోహిణీ పిక్చర్స్ లో వాటా కొనుక్కోమని కోరారు. బి.ఎన్.రెడ్డి తన తండ్రిని ఒప్పించి రోహిణీ పిక్చర్స్ లో వాటా తీసుకుని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.[2][3]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రామానుజాచారి ఇన్సూరెన్సు ఏజెంట్ గా పనిచేసేవారు. కథానాయికకు సోదరుడైన దేశభక్తుడు గోపీనాథ్ పాత్రకు చిత్తూరు నాగయ్యను తీసుకునేందుకు బి.ఎన్.రెడ్డి సిఫార్సు చేశారు. నాగయ్యకు ఇదే తొలిచిత్రం.[2]

విడుదల, స్పందన

[మార్చు]

1938లో గృహలక్ష్మి సినిమా విడుదలైంది, మంచి విజయాన్ని సాధించింది. కల్లుమానండోయ్ బాబూ వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.[2] కొడవటిగంటి కుటుంబరావు, ఆంధ్ర వార పత్రికలో చిత్రసమీక్ష రాస్తూ ఎన్ని లోపాలున్నా గృహలక్ష్మి తెలుగు చిత్రాల్లో ఉత్తమమైనవి' అని రాశారు.

  • ఈ చిత్రంలో అశ్లీలమైన సన్నివేశాలు ఉన్నాయని, హాస్య సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

ప్రాచుర్య సంస్కృతిలో

[మార్చు]

గృహలక్ష్మి సినిమాలోని "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" తర్వాతి కాలంలో వచ్చిన సారా ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది. 1976లో విడుదలైన అందాల రాముడు సినిమాలోనూ ఓ పోరాట దృశ్యంలో కల్లుతాగిన రౌడీలను కొడుతూ కథానాయకుడు ఈ పాట ఆలపిస్తాడు.

పాటలు

[మార్చు]

గీత రచయిత:సముద్రాల రాఘవాచార్యులు.

నాగయ్య పాడిన కల్లు మానండోయ్ పాట
చిన్నారి పాప పాట
  • దేవుడు లేడూ, న్యాయం ధర్మం లేవూ
  • కల్లు మానండోయ్, బాబూ కళ్ళు తెరవండోయ్ - నాగయ్య
  • లెండు భారత వీరులారా - నాగయ్య
  • నా ప్రేమనే నిధానంబుగా భావించు ప్రాణానాథుని(పద్యం) పి.కన్నాంబ
  • భాధ సహనమే సతత్పం భాధ సహనమే, పి.కన్నాంబ
  • బిగి కౌగిట చేరగరారా, కాంచనమాల
  • యశోద నందనా నీర శరణ్య, పి.కన్నాంబ
  • సగము రాతిరి అయ్యనే జగము, పి.కన్నాంబ
  • ఉత్తమ కులాల దుర్ణయమ్ములకు(పద్యం) ,నాగయ్య
  • జయ జయ మహాత్మ గాంధీజీ , బృందం
  • దీన లోకశరణ జగదాభరణ , పి.కన్నాంబ .
  • నేడే కాద వైవాహికానందవేళ, పి.కన్నాంబ
  • బొంకుల్ బొంకితే (పద్యం), పి కన్నాంబ
  • మాధవా దరిసేన మీరా రారా,కాంచనమాల
  • మాయా విలాసినులూ మయామి , గౌరీపతి శాస్త్రి.

మూలాలు

[మార్చు]
  1. రావి, కొండలరావు (2004). నాగయ్య స్వీయచరిత్ర. హైదరాబాద్: ఆర్కే బుక్స్. p. 77.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 పాటిబండ్ల, దక్షిణామూర్తి. కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్.
  3. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.
  • నాటి సంచలన చిత్రం 'గృహలక్ష్మి', నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీ.13.
  • ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

[మార్చు]