గోవిందరాజు సుబ్బారావు
గోవిందరాజు సుబ్బారావు | |
---|---|
![]() | |
జననం | 1895 |
మరణం | అక్టోబరు 28, 1959 |
వృత్తి | వైద్యుడు, నటుడు |
గోవిందరాజు సుబ్బారావు (1895 - 1959 అక్టోబరు 28) తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు.
జీవితం[మార్చు]
గోవిందరాజు సుబ్బారావు 1895 సంవత్సరంలో జన్మించాడు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు.[1] ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవాడు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించాడు. అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే సుప్రసిద్ధుడయ్యాడు.
పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టాడు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో ఇతని నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.
అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న తెలుగు సినిమా రంగంలోనూ క్యారెక్టర్ నటునిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించాడు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, బాలనాగమ్మలో మాయల మరాఠీగా ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందాడు.
మరణం[మార్చు]
ఈయన చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 28, 1959 సంవత్సరంలో మరణించాడు.[1]
చిత్ర సమాహారం[మార్చు]
- భాగ్యరేఖ (1957)
- పాండురంగ మహత్యం (1957)
- చరణదాసి (1956) .... బసవయ్య
- కన్యాశుల్కం (1955) .... లుబ్ధావధానులు
- షావుకారు (1950) .... షావుకారు చంగయ్య
- ధర్మాంగద (1949)
- గుణసుందరి కథ (1949)
- పల్నాటి యుద్ధం (1947) .... బ్రహ్మనాయుడు
- రత్నమాల (1947)
- బాలనాగమ్మ (1942) .... మాయల మరాఠి
- గృహలక్ష్మి (1938)
- మాలపిల్ల (1938) .... సుందర రామశాస్త్రి
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (11 November 1959). "గోవిందరాజులు సుబ్బారావు మృతి" (PDF). ఆంధ్రసచిత్రవారపత్రిక: 62. Retrieved 2 November 2017. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
బయటి లింకులు[మార్చు]
- CS1 maint: discouraged parameter
- All articles with dead external links
- Articles with dead external links from జూన్ 2020
- Articles with permanently dead external links
- 1895 జననాలు
- 1959 మరణాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల నటులు
- తెలుగువారిలో వైద్యులు
- సాహితీకారులు
- తెలుగు రచయితలు
- గుంటూరు జిల్లా వైద్యులు
- హోమియోపతి వైద్యులు
- గుంటూరు జిల్లా రంగస్థల నటులు
- కన్యాశుల్కం నాటకం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- గుంటూరు జిల్లా సినిమా నటులు