బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)
ఇదే పేరుతో ఉన్న మూడు తెలుగు సినిమాల కోసం బాలనాగమ్మ పేజీ చూడండి.
బాలనాగమ్మ (1942 సినిమా) (1942 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
---|---|
నిర్మాణం | ఎమ్.ఎస్.వాసన్ |
రచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
తారాగణం | కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు బలిజేపల్లి లక్ష్మీకాంతం టి.జి. కమలాదేవి కమలా కొట్నిస్ పుష్పవల్లి బళ్ళారి లలిత రేలంగి వెంకట్రామయ్య |
సంగీతం | ఎమ్.డి. పార్ధసారధి సాలూరి రాజేశ్వరరావు |
ఛాయాగ్రహణం | శైలేన్ బోస్ బి.ఎస్.రంగా |
కూర్పు | చంద్రన్ ఎన్.కె. గోపాల్ |
నిర్మాణ సంస్థ | జెమినీ స్టూడియోస్ |
నిడివి | 220 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బాలనాగమ్మ తెలుగుప్రజలల్లో బాగా పేరుగాంచిన బుర్రకథ. ఇది జెమిని స్టూడియో వారి రెండవ తెలుగు చిత్రం. 1942లో నిర్మించబడిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది జెమిని వారికి చాల పెద్ద మొత్తంలో లాభాలు అందించింది. ఆ లాభాలతో వారు తర్వాత చంద్రలేఖ సినిమా తీశారు.
కథ
[మార్చు]నవభోజరాజు భార్య భూలక్ష్మి సంతానం కోసం జటంగిముని నాశ్రయిస్తుంది. నాగేంద్రుని వల్ల సంతానం వస్తుందని దీవిస్తాడు. ఆమె ఏడు పాలమామిడిపళ్ళు కోస్తూ నాగేంద్రుడి కోపానికి గురి అవుతుంది. నాగేంద్రునికి బలిగా భూలక్ష్మి అయితే 7గురు సంతానం కల్గుతుందని కడగొట్టు బిడ్డకు బాలనాగు అని పేరుపెట్టమని నాగేంద్రుడు చెబుతాడు. భూలక్ష్మి అందుకు ఒప్పుకుంటుంది. కొన్నాళ్ళకి రాజు భార్య కోరికను నిరాకరిస్తూ ద్వితీయ వివాహం చేసుకుంటాడు. సవతితల్లి మాణిక్యం మందుల మారి. జమాబందికట్టడానికి ఆ రాజు ఢిల్లి వెళతాడు. మాణిక్యం అప్పుడు ఆ 7గురు బిడ్డలను చంపాలని తన దాసితో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆపదల సమయంలో గతించిన భూలక్ష్మి పిల్లలని కాచి రక్షిస్తుంది. ఈ 7గురుకు పానుగంటిపురం ప్రభువు అయిన వాళ్ళ మేనమామ రామవర్ధిరాజు పిల్లలతో పెళ్లి అవుతుంది. బాలనాగమ్మ భర్త కార్యవర్ధిరాజు గండికోట యుద్ధానికి పోయిన సమయాన మాయల మరాఠి జంగంవేషంలో వచ్చి కొత్వాలు రామసింగుని మచ్చికచేసుకుని ఊరిలోకి ప్రవేశించి, బిడ్డతో ఆడుకుంటున్న బాలనాగమ్మను కుక్కనుచేసి తన నాగల్లపూడికి తీసుకువస్తాడు. రక్షింప వచ్చిన భర్త కార్యవర్ధిరాజు సైన్యాన్ని రాతిశిలలుగా మార్చుతాడు. మరాఠి దగ్గర 12 ఏళ్ళ గడువు నాగమ్మ కోరుతుంది. తరువాత బాలనాగమ్మ కొడుకు బాలవర్ధిరాజు నాగుళ్ళపల్లి గుట్ట దగ్గర తంబళ్ళపెద్ది అనే ఒక పూలమ్మి ద్వారా మాయలమరాఠి కోటలో ప్రవేశించి మరాఠి ప్రాణం చిలకలో ఉందని తెలుసుకుని గండభేరుండ పక్షుల మీద సప్తసముద్రాలు దాటి చిలకని సంపాదించి మాయలమరాఠిని చంపుతాడు. చివరికి తల్లిని చెర విడిపించుకొని శిలలుగా మారిన తండ్రులను బ్రతికిస్తాడు. బాలనాగమ్మ మహాపతివ్రత అనిపించుకుంటుంది. రాజుగా బాలవర్ధిరాజు పట్టభిషేకంతో కథ సుఖాంతం అవుతుంది.[1]
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]నటి లేదా నటుడు | పాత్ర |
---|---|
డా. గోవిందరాజుల సుబ్బారావు | మాయల మరాఠి |
కాంచనమాల | బాలనాగమ్మ |
బందా కనకలింగేశ్వరరావు | కార్యవర్ధిరాజు (బాలనాగమ్మ భర్త) |
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి | నవభోజరాజు (బాలనాగమ్మ తండ్రి) |
పుష్పవల్లి | రాణి సంగు (మాయల మరాఠి ఉంపుడుగత్తె) |
బళ్ళారి లలిత | భూలక్ష్మి (బాలనాగమ్మ తల్లి) |
సీతాబాయమ్మ | దుర్గ (మాణిక్యం దాసి) |
రేలంగి | కొత్వాలు రామసింగు |
లంక సత్యం | చాకలి తిప్పడు |
పొదిల వెంకట కృష్ణమూర్తి | రామవర్ధిరాజు (బాలనాగమ్మ మేనమామ) |
అడ్డాల నారాయణరావు | నాగేంద్రుడు |
పొదిల వెంకట కృష్ణమూర్తి | రామవర్ధిరాజు |
మాస్టర్ విశ్వం | బాలవర్ధిరాజు |
వి. లక్ష్మీకాంతం | జోస్యుడు |
కర్ర సూర్యనారాయణ | పులిరాజు |
కమలాదేవి | మందుల మాణిక్యం (నాగమ్మ సవతితల్లి) |
సితాలి | రత్నమాల (చాకలి తిప్పడి భార్య) |
అంజనిబాయి | తంబలిపెద్ది |
సరస్వతి | చిన్ననాటి బాలనాగమ్మ |
కమల | చిన్ననాటి సూర్యనాగమ్మ (నాగమ్మ పెద్దక్క) |
పాటలు
[మార్చు]- నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం
- నా సొగసే కనిమరుడే దాసుడు కాడా - పుష్పవల్లి
- శ్రీజయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత
మూలాలు
[మార్చు]- ↑ జమీన్ రైతు పత్రిక ఆర్కైవ్ (25 December 1942). "బాలనాగమ్మ" (PDF). జమీన్ రైతు పత్రిక: 8. Retrieved 26 April 2020.