ధర్మాంగద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మాంగద అను పాముపాట
(1949 తెలుగు సినిమా)
Dharmangada cinema poster.jpg
దర్శకత్వం హెచ్.వి.బాబు
రచన తాపీ ధర్మారావు
తారాగణం కృష్ణవేణి,
ఋష్యేంద్రమణి,
సత్యవతి,
గోవిందరాజుల సుబ్బారావు,
లింగమూర్తి,
రాళ్లబండి కుటుంబరావు
సంగీతం గాలి పెంచలయ్య
కళ టి.వి.ఎస్.శర్మ
నిర్మాణ సంస్థ స్వస్తిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది.

నిర్మాణం[మార్చు]

ధర్మాంగద నిర్మాణానికి సరస్వతీ టాకీసు వారు రూ.లక్షా పాతిక వేలు పెట్టుబడి పెట్టారు. అయితే 1948లో నిర్మాతలు ఆ పెట్టుబడితో సినిమాను పూర్తిచేయలేక మళ్ళీ సరస్వతీ టాకీస్ వారి వద్దకు మరికొంత డబ్బుకోరుతూ వెళ్ళారు. అయితే సరస్వతీ టాకీస్ వారు అందుకు నిరాకరించారు, అప్పటికే వారు ఫైనాన్షియర్లుగా వ్యవహరిస్తూండడంతో మరెవరూ డబ్బిచ్చి నిర్మాణం కొనసాగనిచ్చేందుకు ముందుకురాలేదు. పూర్తైనంతవరకూ ఫిల్ములను ఈ సమస్యల వలన జూన్ 29, 1948న వేలంపాట పెట్టారు. సినిమాలో పనిచేసిన నిపుణులకు, నటులకు కూడా సరిగా చెల్లించలేక నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సినిమా నిర్మాణం కొనసాగి 1949లో విడుదలైంది.[1]

మూలాలు[మార్చు]

  1. విలేకరి, మూర్తి (1 జూన్ 1948). "ధర్మాంగద అను పాముపాట, లేక వేలంపాట". రూపవాణి (4). Retrieved 24 July 2015. Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ధర్మాంగద&oldid=1561608" నుండి వెలికితీశారు