మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మళ్ళీ పెళ్ళి
(1939 తెలుగు సినిమా)
1939-Mallipelli- film poster.jpg
మళ్ళీ పెళ్ళి సినిమా పోస్టర్
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం వై.వి.రావు
తారాగణం వై.వి.రావు,
కాంచనమాల,
బలిజేపల్లి లక్ష్మీకాంతం,
బెజవాడ రాజరత్నం,
కొచ్చర్లకోట సత్యనారాయణ,
సి.కృష్ణవేణి,
రంగస్వామి,
నటేశా అయ్యర్,
మాణిక్యమ్మ,
ఆదినారాయణయ్య,
రాజలక్ష్మమ్మ
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
నేపథ్య గానం కాంచనమాల,
కొచ్చర్లకోట సత్యనారాయణ,
బెజవాడ రాజరత్నం,
ఓగిరాల రామచంద్రరావు
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఛాయాగ్రహణం జితేన్ బెనర్జీ
నిర్మాణ సంస్థ శ్రీ జగదీష్ ఫిలిమ్స్
నిడివి 187 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మళ్ళీ పెళ్ళి 1939 సంవత్సరంలో విడుదలైన సందేశాత్మకమైన తెలుగు సినిమా. ఇది ఆనాటి సంఘ సంస్కర్తలు రాజా రామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహోన్నత వ్యక్తుల ఊహలకు వూపిరిపోసింది. విధవా పునర్వివాహం దీనిలోని ముఖ్యమైన సందేశం.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

జనార్ధనరావు పంతులు (బలిజేపల్లి) ఒక వకీలు. అతను సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు విలువనిచ్చే ఛాందసవాది. తన ఆరు సంవత్సరాల వయసున్న కూతురు లలిత (కాంచనమాల) ను ఒక ముసలాడికి ఇచ్చి పెళ్ళి చేయగా అతను కొద్దికాలంలోనే చనిపోతాడు. ఫలితంగా లలిత చిన్నతనంలోనే విధవగా మారుతుంది. లలిత తీవ్రమైన కట్టుబాట్లు మధ్య పెరుగుతుంది.

కలియుగానందస్వామి అనే పేరుతో ఒక స్వాములవారు ఆ వూళ్ళో ప్రవేశించి జనార్దనరావు ఇంట్లో దిగుతాడు. స్వాములవారి పేరు వూరంతా పాకిపోయింది. వారి తీర్థప్రసాదాలు తింటే స్వర్గం తప్పదన్న విశ్వాసంతో ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఎగబడసాగారు. స్వాములవారు జనార్థనరావును తన చేతిలో కీలుబొమ్మను చెసుకుని, వూళ్ళో అధికారం చెలాయిస్తుంటాడు.

ఒకరోజు ఎవరో పేరంటానికి పిలవడానికి వచ్చి తెలియక లలిత మొఖాన బొట్టు పెట్టారు. ఆ బొట్టు స్వాములవారు చూసి కళ్లెర్ర జేసి మతానికి తీరని కళంకం జరిగిందని ఆర్భాటం చేస్తారు. అమ్మలక్కలందరూ నానా మాటలంటారు. లలితకు తీరని దుఃఖం కలుగుతుంది.

ఆమెకు సుందరరావు (వై.వి.రావు) అనే సంఘ సంస్కర్త పరిచయమవుతాడు. అతడు ఆమెకు నచ్చజెప్పి, ఒప్పించి, ప్రాచీన కట్టుబాట్ల నుంచి విముక్తిరాలిని చేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు.

పాటలు[మార్చు]

  • ఆనందమేగా వాంఛనీయము
  • చెలి కుంకుమమే పావనమే
  • కోయిలరో ఏదీ నీ ప్రేమగీతి
  • నా సుందర సురుచిర రూపా
  • గోపాలుడే మా గోపాలుడే

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]