Jump to content

కులగోత్రాలు

వికీపీడియా నుండి
కులగోత్రాలు
దర్శకత్వంకె.ప్రత్యగాత్మ
నిర్మాతఅనుమోలు సుబ్బారావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి వెంకట్రామయ్య,
పద్మనాభం,
సూర్యకాంతం,
గిరిజ,
నిర్మలమ్మ,
మద్దాలి కృష్ణమూర్తి,
సంధ్య,
జి. వరలక్ష్మి,
మిక్కిలినేని,
అల్లు రామలింగయ్య
సంగీతంఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1962 (1962)
భాషతెలుగు

కులగోత్రాలు ప్రత్యగాత్మ దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి ప్రధానపాత్రల్లో నటించిన 1962 నాటి చలనచిత్రం.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

కామందు భూషయ్య (గుమ్మడి వెంకటేశ్వరరావు) కొడుకు రవి (అక్కినేని) విశాఖపట్నంలో చదువుకుంటూ ఉంటాడు. సరోజ (కృష్ణకుమారి) ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లి కాంతమ్మతో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటాయి. ఒకసారి వరద భాధితుల సహాయార్థం కళాశాల విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సరోజ కలిసి ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. అక్కడ నుంచి సరోజ ఇంటికి వెళుతుండగా చలపతి అనే దొంగ (మిక్కిలినేని) ఆమె మెడలో హారాన్ని దొంగిలించబోతే రవి అడ్డుకుని గాయాలపాలవుతాడు. పోలీసులు తరముకు వస్తుంటే తప్పించుకోబోయి చలపతి కాంతమ్మ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాంతమ్మను చలపతి మోసం చేసి వదిలేసి ఉంటాడు. ఇన్నాళ్ళు ఆమెను కష్టాలపాలు చేసినందుకు గాను కూతురుకు తండ్రి విషయం తెలియగూడదని ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు. సరోజ, రవి కలిసి కళాశాల వార్షికోత్సవంలో శకుంతల దుష్యంతుడు నాటకం వేస్తారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుంటారు.

కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత సరోజ తల్లి తన బాధ్యతలు తీరిపోవడంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ ఊరిలోనే ఉద్యోగం వస్తుంది. రవి కులగోత్రాలు లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని రవి చెల్లెలి పెళ్ళి ఆగిపోతుంది. కానీ అదే సమయానికి రవి వరసకి బావ అయిన జాస్తి జోగారావు (పద్మనాభం) ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు. రవి తన బావ సదానందం (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. అతన్ని భూషయ్య వెళ్ళి విడిపించాల్సి వస్తుంది. సదానందం, జగదాంబ కలిసి భూషయ్య ఆస్తిని ఎలా తమ పేరున రాయించుకోవాలో చూస్తుంటారు. ఒకరోజు మెట్లమీద నుంచి జారిపడిన భూషయ్య భార్య మంచాన పడుతుంది. అదే సమయానికి రవి వేరే ఊర్లో ఉండటం వలన అతను వెళ్ళి చూడ్డానికి కూడా వీలుపడదు. రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. సదానందం చలపతిలో ఒప్పందం కుదుర్చుకుని తన మామ చేత ఆస్తిపత్రాల మీద సంతకం చేయించుకోవాలనుకుంటాడు. కానీ అతను భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి అతనితో పోరాటానికి దిగుతాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సరోజ తుపాకీతో చలపతిని కాల్చేస్తుంది. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

అప్పటకి గుడిగంటలు, మూగమనసులు, రక్తసంబంధం సినిమాలు రాసిన ముళ్ళపూడి వెంకటరమణకి ఈ సినిమా రాసే అవకాశం లభించింది. అయితే ఆయనకు అప్పటికే ఒప్పుకొని ఎన్నాళ్ళ నుంచో పూర్తికాని దాగుడు మూతలు సినిమా రచనలో బిజీగా ఉండడంతో దీన్ని రాసే బాధ్యతలు రమణ మరో రచయిత రావి కొండలరావుకి అప్పగించారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా ఎదిగిన ఘట్టమనేని కృష్ణకు ఇది నటునిగా రెండవ సినిమా. దీనిలో ఆయన ఒక చిన్న పాత్ర చేశారు.[2]

పాటలు

[మార్చు]
పాట గాయకులు రచయిత సంగీతం
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే మాధవపెద్ది సత్యం బృందం కొసరాజు సాలూరు రాజేశ్వరరావు
చిలిపి కనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ ఘంటసాల, పి.సుశీల సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు
చెలికాడు నిన్నేరమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ఘంటసాల, పి.సుశీల సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు
మామా శతృభయంకర నామ అందానికి చందమామ మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు కొసరాజు సాలూరు రాజేశ్వరరావు
రావయ్యా మా యింటికి రమ్మంటే రావేల మా యింటికి కృష్ణయ్యా సత్యారావు, స్వర్ణలత కొసరాజు సాలూరు రాజేశ్వరరావు
రావే రావే బాలా, హలో మైడియర్‌ లీలా పి.బి. శ్రీనివాస్ కొసరాజు సాలూరు రాజేశ్వరరావు
నీ నల్లని జడలో పూలు జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు కొసరాజు సాలూరు రాజేశ్వరరావు
సఖీ శకుంతల రెక్కలు ధరించి ప్రియునిచెంత వాలగలేవా ఘంటసాల, పి.సుశీల శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు

[3] [4]కారు మబ్బుల బారు సౌరునే లేడు (పద్యం) రచన: శ్రీ శ్రీ , గానం. పి. బి.శ్రీనివాస్ .

వినుమా ప్రియతమా నా విరహాగీతి , రచన: శ్రీ శ్రీ , గానం.స్వర్ణలత , పి సుశీల , రామం ,ఘంటసాల.

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  1. బి.వి.ఎస్.రామారావు (1 October 2014). కొసరు కొమ్మచ్చి (బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం) (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  2. పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.
  3. "Kula Gothralu (1962) Songs". telugulyrics.org. Archived from the original on 2016-03-02. Retrieved 2016-02-21.
  4. Kula Gothralu Movie Songs - Nee Nallani Jadalo Song - ANR, Krishna Kumari, Krishna. 26 July 2014 – via YouTube.