ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

వికీపీడియా నుండి
(ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Prasad Art Pictures
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భారతదేశంలో సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు. ఈ సంస్థ మొదటి చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన పెంపుడు కొడుకు. ఈ సంస్థ ద్వారా సుబ్బారావు 22 తెలుగు, ఒక తమిళ, 3 హిందీ చిత్రాలు నిర్మించాడు. విజయ, సురేష్, అన్నపూర్ణ లాంటి సంస్థలకు ధీటుగా సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. రచయిత శ్రీశ్రీకి ఇది మాతృసంస్థ లాంటిది.

నిర్మించిన సినిమాలు[మార్చు]

1953లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన పెంపుడు కొడుకు ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం. 1959లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఇల్లరికం నిర్మించిన తర్వాత అతని వద్ద సహాయకునిగా పనిచేసిన కె.ప్రత్యగాత్మతో భార్య భర్తలు (1961), కులగోత్రాలు (1962) నిర్మించాక, 1963 లో పునర్జన్మ చిత్రాన్ని నిర్మించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "కళల కోసమే.. పునర్జన్మ". సితార. Archived from the original on 2019-11-09. Retrieved 2020-04-19.

బయటి లింకులు[మార్చు]