Jump to content

చర్చ:నాటి 101 చిత్రాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ జాబితా చాలా బాగున్నది. శ్రద్ధగా విస్తరించాల్సిన సినిమాలకు సూచికగా ఉంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:31, 13 డిసెంబర్ 2008 (UTC)

జాబితా తయారీకి పునాది ఏమిటి. సితారలో వ్రాయబడ్డ వ్యాసాలలో వచ్చిన జాబితాను యధాతధంగా తీసుకోవటమా? వికీలో 101మంచి చిత్రాలు అని జాబితా తయారు చేద్దామని అనుకుంటే, దానికి కొంత ఆలోచన చేసి కొన్ని మార్గ దర్శకాలు తయారు చేసుకుని -కథ, నటే నటుల ఎంపిక,వారి నటన, సంగీతము, దర్శకత్వము వంటి ముఖ్య విషయాలకు ఎక్కువ వైటేజి ఇచ్చి, ఆ సినిమా విడుదలైనప్పుడు 100 రోజులు అడిందా, 100 ఆటలు ఆడిందా అన్న విషయానికి తక్కువ వైటేజి ఇచ్చి, జాబితాను అందుకోసం ఆసక్తిగలిగి, నిస్పక్షపాతంగ ఉండగలిగిన (వీరాభిమానాలు ఇక్కడ ప్రభావం చూపించే ప్రమాదం ఎంతయినా పొంచి ఉంటుంది)సభ్యుల కమిటీ తయారు చేసి, అటువంటి జాబితాను ఇతర సభ్యులు కూడ చర్చించి, అభ్యంతరాలు ఏమయినా ఉంటే, ఆ ప్రకారం మార్పులు చేర్పులు చేసి, అన్ని అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత,వికీ ప్రకారం 1931 నుండి 1981 వరకు ఇవి 101 మంచి చిత్రాలు, 1981 నుండి ఇప్పటివరకు ఇవి 101 మంచి చిత్రాలు(ఈ జాబితాను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పొతే 2031కి రెండవ జాబితా సిద్ధమవుతుంది)రెండు జాబితాలను తయారు చేసి, అటువంటి చిత్రాల మీద వ్యాసాలను సమగ్రంగా తయారు చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమా 100ఏళ్ళ పూర్తయిన సందర్భంగా 2031 సంవత్సరానికి ఈ విధంగా చెయ్యగలిగితే, అద్భుతం!!--SIVA 19:17, 28 డిసెంబర్ 2008 (UTC)

నాటి 101 చిత్రాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి