Jump to content

అమరశిల్పి జక్కన

వికీపీడియా నుండి
(అమరశిల్పి జక్కన్న నుండి దారిమార్పు చెందింది)
అమరశిల్పి జక్కన్న
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం బి.ఎస్.రంగా
నిర్మాణం బి.ఎస్.రంగా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
బి.సరోజాదేవి,
చిత్తూరు నాగయ్య,
హరనాథ్,
ఉదయకుమార్,
ధూళిపాళ,
రేలంగి వెంకట్రామయ్య,
గిరిజ,
సూర్యకాంతం,
పుష్పవల్లి
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నృత్యాలు బి.హీరాలాల్
గీతరచన సముద్రాల రాఘవాచార్య, సి.నారాయణరెడ్డి, దాశరధి కృష్ణమాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం బి.ఎస్.రంగా
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ విక్రం ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవితచరిత్ర ఆధారంగా బి.ఎస్.రంగా 1964లో నిర్మించిన చారిత్రాత్మక చిత్రం అమరశిల్పి జక్కన. శిల్పకళకు ప్రాణంపోసే రాతిబండలపై సి.నారాయణరెడ్డి రచించిన ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో-ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో పాట ఇప్పటికీ ప్రజాదరణ చెంది మనల్ని ఆలోచింపజేస్తుంది.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

మల్లన్న (నాగయ్య) గొప్ప శిల్పి. ఆయన కొడుకు జక్కన్న (అక్కినేని) తండ్రిని మించిన తనయుడు. అతడు నాట్యమయూరి మంజరి (బి.సరోజాదేవి)ని ప్రేమించి వివాహమాడతాడు. అయితే మంజరి అందచందాలను, నాట్య విన్యాసాన్ని అభిమానించిన రాజు గోపదేవుడు కుట్రపన్ని వారిద్దరినీ వేరుచేస్తాడు. దాని ఫలితంగా మంజరి తప్పనిసరి పరిస్థితుల్లో గోపదేవుని ముందు నృత్యం చేస్తుంది. దానిని చూసిన జక్కన్న, భార్యను అనుమానించి, వికల మనస్కుడై, విరాగియై, దేశాటన చేస్తాడు. తుదకు శ్రీరామానుజాచార్యుల సన్నిధిలో స్థిరపడతాడు. మంజరి గోపదేవుని కుట్ర నుంచి బయటపడి, ఆత్మహత్యా ప్రయత్నంగా నీటిలో దూకి, జాలరులచే రక్షింపబడి, మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే డంకన్న (హరనాథ్). విరాగియైన జక్కన్న హోయాసల రాజు విష్ణువర్ధనుడు పాలించిన బేలూరులో శిల్పాలకు ప్రాణం పోస్తాడు. అతని శిల్పాలలో అతని భార్య మంజరి ప్రతిరూపం కనిపిస్తుంది. అయితే జక్కన్న తీర్చిదిద్దిన ఒక శిల్పంలో లోపం వుందని సవాలు చేస్తాడు డంకన్న. ఫలితంగా ఆ శిల్పంలో కప్ప కనబడటం, అందుకు పరిహారంగా జక్కన్న తన చేతుల్ని నరుక్కుంటాడు. పతాక సన్నివేశంలో తాత మల్లన్న, తండ్రి జక్కన్న, భార్య మంజరి మంజరి, కొడుకు డంకన్న పరస్పరం తెలుసుకోవటం, ఆ దేవదేవుడు కరుణించి జక్కన్నకు తిరిగి చేతులు ప్రసాదించడంతో కథ పరిసమాప్తవుతుంది.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పులపాక

సుశీల

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో-ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఎచటికోయి నీ పయనం, ఏమిటోయి ఈ వైనం-ఏలనోయి ఈ ఘోరం, ఎవరిపైన నీ వైరం
మధురమైన జీవితాల కథ యింతేనా
దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఏదో గిలిగింతా ఏమిటీ వింత ఏమని అందుని ఏనాడెరుగును ఇంత పులకింతా కంపించె తనువంతా సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
జంతర్ మంతర్ ఆటరా ఇది యంతర్ మధ్యం ఆటరా కొసరాజు

రాఘవయ్య చౌదరి

సాలూరు రాజేశ్వరరావు మాధవపెద్ది సత్యం
నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల ఉడికించవేలా సింగిరెడ్డి నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి. సుశీల
నిలువుమా నిలువుమా నీలవేణీ, నీ కనుల నీలినీడ నా మనసు నిదుర పోనీ సముద్రాల రాఘవాచార్య సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
మనసే వికసించెరా దాశరథి కృష్ణమాచార్య. సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల,

పి.సుశీల

మురిసేవు విరిసేవు. సముద్రాల. ఘంటశాల

తరమా వరదా కొనియాడ . సముద్రాల.ఘంటశాల, సుశీల.

ఏదో ఏదో గిలిగింత ఏమిటీ వింత , రచన: సి. నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల

మధురమైన జీవితాల కథ , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఘంటసాల

మల్లెపూల చెండులాంటి చిన్నదాన , రచన:సముద్రాల సీనియర్, గానం.మాధవపెద్ది , బి.వసంత బృందం

.

విశేష. ఘంటశాల.ాలు

[మార్చు]
  • ఇదే చిత్రాన్ని బి.ఎస్.రంగా 'అమరశిల్పి జక్కనాచార్య' అనే పేరుతో ఒకేసారి కన్నడంలో కూడా నిర్మించారు. అక్కినేని పోషించిన జక్కన్న పాత్రను కన్నడంలో కళ్యాణకుమార్ వేశారు. రెండు భాషలలో మంజరిగా బి.సరోజాదేవి నటించారు.
  • తెలుగు చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

మూలాలు

[మార్చు]
  • శిల్పకళకు ప్రాణం పోసిన చిత్రం "అమరశిల్పి జక్కన్న", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 203-04.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి. ఘంటసాల గళాంమృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.