Jump to content

ఓహో పావురమా

వికీపీడియా నుండి
"ఓహో పావురమా"
రచయితబాలాంత్రపు రజనీకాంతరావు
సంగీతంబాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యంబాలాంత్రపు రజనీకాంతరావు
ప్రచురణ1945
రచింపబడిన ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
భాషతెలుగు
రూపంభావగీతం
గాయకుడు/గాయనిభానుమతీ రామకృష్ణ
రికార్డు చేసినవారు (స్టుడియో)వాహినీ స్టుడియోస్
చిత్రంలో ప్రదర్శించినవారుభానుమతీ రామకృష్ణ

ఓహో పావురమా! 1945 నాటి స్వర్గసీమ సినిమాలోని పాట. ఈ పాటను బాలాంత్రపు రజనీకాంత రావు రాసి, స్వరపరిచాడు. భానుమతి ఆలపించి, అభినయించింది. కథానాయకుడిని కవ్వించే సందర్బంలోని ఈ పాట ఆనాటి ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించడమే కాదు సుదీర్ఘ కాలం క్లాసిక్‌గా నిలిచింది. సంగీతపరంగానూ, భానుమతి గానం వల్ల పాట చిరకాలం ప్రేక్షకాభిమానం చూరగొంది.

ఓ ఒహోహో ఒహోహో ఒహోహో హోహోహో
పావురమా
వెరపేలే, పావురమా!

తరుణ యౌవనము పొంగి పొరలు
నా వలపు కౌగిలిని ఓలలాడ రావే

తనకు తానై వలచి పిలిచే
తన్వి మోహమని చుల్కన సేయకుమా.

సందర్భం, చిత్రీకరణ

[మార్చు]
స్వర్గసీమ సినిమాలో భానుమతి

స్వర్గసీమ సినిమాలో భానుమతి నెగెటివ్ ఛాయలున్న వ్యాంప్ పాత్ర పోషించింది. ఈ పాత్ర ఏదో రాసుకుంటూన్న నాయకుడిని కవ్వించే సందర్భంలో ఓహో పావురమా పాట వస్తుంది. ఆనాటి సంప్రదాయ ధోరణులకు విరుద్ధంగా ఈ పాటలో భానుమతి స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని, కవ్విస్తూ చేసిన నటన ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించింది.[1]

స్వరకల్పన, గానం

[మార్చు]

స్వర్గసీమ సినిమాకి చిత్ర కథానాయకుడు, సంగీత దర్శకుడు చిత్తూరు నాగయ్య. కానీ దర్శకుడు బి. ఎన్. రెడ్డి ఈ పాటను బాలాంత్రపు రజనీకాంత రావుతో రాయించి, అతనితోనే స్వరకల్పన చేయించాడు. ఆనాటికి ప్లేబాక్ పద్ధతి ఇంకా అమలులోకి రాలేదు. నటులు సాధారణంగా గాయకులు అయివుండేవారు. అలా ఈ పాటను నటించిన భానుమతి ఆలపించింది.[1]

ప్రాచుర్యం

[మార్చు]

ఓహోహో పావురమా పాట చాలా ప్రజాదరణ పొందింది. సినిమా విడుదలైన ఎన్నో దశాబ్దాల తర్వాత కూడా ఈ పాట క్లాసిక్‌గా పేరుతెచ్చుకుని నిలబడింది.[1] అయితే ఇది క్లాసిక్‌గా నిలవడానికి కారణం బాలాంత్రపు రజనీకాంతరావు అందించిన "రమ్యమైన బాణీ", భానుమతి గానం తప్ప "సాహిత్యపరంగా చెప్పుకోదగ్గ గొప్పదనం లేదు" అని తెలుగు సినీగేయకవుల చరిత్ర కర్త డాక్టర్ పైడిపాల వ్యాఖ్యానించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "సాంగ్ రే బంగారు రాజా". సాక్షి ఫన్ డే. 19 June 2018. p. 6.
  2. డాక్టర్, పైడిపాల (2010). తెలుగు సినీగేయకవుల చరిత్ర. చెన్నై: స్నేహ ప్రచురణలు. pp. 54, 55.[permanent dead link]