చిలిపి కృష్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలిపి కృష్ణుడు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణం డి. రామానాయుడు
కథ వి.సి. గుహనాథన్
చిత్రానువాదం బోయిన సుబ్బారావు
తారాగణం నాగేశ్వర రావు, వాణిశ్రీ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం ఎ. వెంకట్
కూర్పు కె.ఎ.మార్తాండ్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిలిపి కృష్ణుడు 1978 లో వచ్చిన శృంగార చిత్రం. దీనిని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ [1] లో డి. రామానాయుడు నిర్మించాడు. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు.[3] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[4] ఈ చిత్రం 1980 లో హిందీలో బందిష్గా రీమేక్ చేసారు.

డాక్టర్ కృష్ణ (అక్కినేని నాగేశ్వర రావు) ఒక డాక్టరు. ధనవంతుడైన వ్యాపారవేత్త (సత్యనారాయణ) కుమారుడు. చిలిపి చేష్టలు చేస్తూ చుట్టుపక్కల ప్రజలను ఇబ్బంది పెడుతూంటాడు. అతనికి తోటి విద్యార్థి, వాణి (వాణిశ్రీ) ఒక గుణపాఠం నేర్పుతుంది.అతని దృక్పథంలో అనూహ్యమైన మార్పు వస్తుంది. కృష్ణ వాణిని ప్రేమిస్తాడు. ఆమె తన కుటుంబ బాధ్యతల గురించి, తమ మారుమూల గ్రామంలో పేద ప్రజలకు సేవ చేయాలనే జీవిత ఆశయం గురించీ వివరిస్తుంది, కృష్ణ ఆమె లక్ష్యాలను పంచుకుంటానని వాగ్దానం చేస్తాడు. రాజు (ప్రభాకర్ రెడ్డి) ఒక రోగ్, వాణిపై చెడు కన్ను వేసాడు. ఆమెను బలాత్కరించబోగా ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది ఆమె కుటుంబాన్ని చూసుకుంటానని కృష్ణ మాట ఇస్తాడు. ఆ తరువాత, కృష్ణ ఆమె తల్లి మీనాక్షమ్మ (శాంత కుమారి) తో పాటు వాణి కవల సోదరి రాణి (మళ్ళీ వాణిశ్రీ) ని చూసి ఆశ్చర్యపోతాడు. త్వరలో కృష్ణ తన ఆసుపత్రి పెడతాడు. ఇది స్థానిక వైద్యుడు నాగలింగం (అల్లు రామలింగయ్య) ను ఇబ్బంది పెడుతుంది. అతడు కృష్ణను అనేక విధాలుగా ఇబ్బంది పెడతాడు. ఇంతలో, పోలీసుల నుండి పరారీలో ఉన్న రాజా తీవ్రంగా గాయపడి అదే గ్రామానికి చేరుకుంటాడు.. అదృష్టవశాత్తూ అతని భార్య లక్ష్మి (శుభ) అతన్ని రక్షిస్తుంది. నాగలింగం అతనికి మొరటుగా చికిత్స చేస్తాడు, దీని ద్వారా అతని శరీర పైభాగం పూర్తిగా విషపూరితమై పోతుంది. కాబట్టి, లక్ష్మి కృష్ణ కోసం పరుగెత్తుతుంది, కాని బాల్యం లోనే విడిపోయిన రాజాను తన అన్నయ్యగా గుర్తిస్తాడు. ఒక వైద్యుడుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. వేరే ప్రత్యామ్నాయం లేనందున కృష్ణ రాజా చేతిని తొలగిస్తాడు. స్పృహలోకి వచ్చిన తరువాత, రాజా వాస్తవికతను తెలుసుకుని, కృష్ణ నుండి క్షమాపణ కోరతాడు.

ఇంతలో, రాణి వాణి మరణ రహస్యం తెలుసుకుంటుంది, అంతకు మించి, మీనాక్షమ్మ వాణిని చూడటానికి చాలా ఆత్రుతగా ఉంది. రాణి ఇంటి నుండి పారిపోయిందని గ్రామస్థులను నమ్మించి కృష్ణ, ఆమెను వాణిగా రప్పిస్తాడు. మరొక వైపు, కృష్ణ రాజాను పోలీసుల నుండి దాచిపెట్టి, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటాడు. కృష్ణ తన సోదరుడిని రక్షించడానికి మౌనంగా ఉండగా వారి మధ్య అక్రమ సంబంధాలను ఆపాదించడం ద్వారా నాగలింగం పరిస్థితిని వాడుకుంటాడు. ఆ సమయంలో, రాజును వెలుగులోకి తీసుకువచ్చే రాణిని కృష్ణ ఆశిస్తున్నట్లు అందరూ ఆరోపించినప్పుడు మీనాక్షమ్మకు వాణి చనిపోయిన సంగతి తెలుస్తుంది. అదే సమయంలో, కృష్ణ తండ్రి కూడా వచ్చి కృష్ణ మంచితనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాడు. చివరికి, లక్ష్మి బాధ్యతను తన కుటుంబానికి వదిలిపెట్టి రాజా పోలీసులకు లొంగిపోతాడు. చివరగా, కృష్ణ రాణి వివాహంతో ఈ చిత్రం ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • గోవిందా గోవిందా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • చీరలెత్తుకెళ్ళాడు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • ఎళ్ళొస్తానోయ్ మావ, రచన: ఆత్రేయ గానం. పి సుశీల
  • నేర్చుకో నేర్పుతాను, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • ఏ మొగుడు లేకుంటే, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఇందుకేనా , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కాటుకెట్టి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Chilipi Krishnudu (Banner)". Archived from the original on 2018-08-20. Retrieved 2020-08-30.
  2. "Chilipi Krishnudu (Direction)".
  3. "Chilipi Krishnudu (Cast & Crew)". Archived from the original on 2017-12-01. Retrieved 2020-08-30.
  4. "Chilipi Krishnudu (Review)". Archived from the original on 2021-11-29. Retrieved 2020-08-30.