ఫటాఫట్ జయలక్ష్మి
ఫటాఫట్ జయలక్ష్మి(fatafat jayalaxmi) | |
---|---|
జననం | జయలక్ష్మి రెడ్డి 1958 |
మరణం | 1980 (వయసు 22) |
గుర్తించదగిన సేవలు | చంద్ర (అంతులేని కథ) |
ఫటాఫట్ జయలక్ష్మిగా పిలువబడే జయలక్ష్మీరెడ్డి (1958-1980) దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది.
వృత్తి
[మార్చు]ఈమె నటిగా తన వృత్తిని 1972లో మలయాళం సినిమా తీర్థయాత్రతో సుప్రియ అనే పేరుతో ప్రారంభించింది. 1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో "అవల్ ఒరు తొదర్ కథై" సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించింది. ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ధరించింది. ఆ పాత్ర ఊతపదం "ఫటాఫట్" ప్రేక్షకులలో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటిపేరుగా మారిపోయి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. ఈ సినిమా తెలుగులో అంతులేని కథ పేరుతో 1976లో రీమేక్ చేయబడింది. ఈమె కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్.టి.రామారావు, చిరంజీవి మొదలైన అగ్రనటుల సరసన నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె ఎం.జి.రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. అయితే అది పెళ్ళిగా మారలేదు. దానితో తన 22 యేళ్ల పిన్న వయసులోనే 1980లో, నటిగా ఉన్నత స్థాయిలో ఉన్నదశలోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది[1],,[2] [3].
సినిమాల జాబితా
[మార్చు]ఫటాఫట్ జయలక్ష్మి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- ఇద్దరు అమ్మాయిలు (1972)
- స్వర్గం నరకం (1975)
- జ్యోతి (1976) - శశిరేఖ
- అంతులేని కథ (1976) - చంద్ర
- ఈనాటి బంధం ఏనాటిదో (1977)[4]
- చల్ మోహనరంగా (1978)
- మరో చరిత్ర (1978)
- కోరికలే గుర్రాలైతే (1979)
- ముత్తయిదువ (1979)
- జాతర (1980)
- మంచిని పెంచాలి (1980)
- కాళి (1980)
- రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
- న్యాయం కావాలి (1981) - జయలక్ష్మి
- తిరుగులేని మనిషి (1981) - పద్మ
- చందమామ (1982)
మూలాలు
[మార్చు]- ↑ సినీతారలు - ఆత్మహత్యలు[permanent dead link]
- ↑ "Why South Indian heroines are embracing death". Mid-day.com. 20 April 2002. Retrieved 25 May 2010.
- ↑ వెండి తెర తీస్తే … వనితల మెడలో ఉరితాళ్ళే!!- సతీష్ చందర్
- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.