స్త్రీ (1995 సినిమా)
Jump to navigation
Jump to search
స్త్రీ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.సేతుమాధవన్ |
రచన | పాలగుమ్మి పద్మరాజు (కథ), కె.ఎస్.సేతుమాధవన్ (చిత్రానువాదం), పి.ఎల్. నారాయణ (మాటలు) |
నిర్మాత | ఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర |
తారాగణం | తలైవాసల్ విజయ్, రోహిణి, పి.ఎల్.నారాయణ, కె.కె.శర్మ |
ఛాయాగ్రహణం | ఎస్.శరవణన్ |
కూర్పు | దండముడి రాజగోపాల్ రావు |
సంగీతం | ఎల్.వైద్యనాథన్ |
విడుదల తేదీ | 1995 |
సినిమా నిడివి | 93 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
స్త్రీ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.సేతుమాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తలైవాసల్ విజయ్, రోహిణి, పి.ఎల్.నారాయణ, కె.కె.శర్మ, ప్రధాన పాత్రల్లో నటించగా, ఎల్.వైద్యనాథన్ సంగీతం అందించాడు. పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం అనే కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[1] ఈ చిత్రం రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలను అందుకుంది. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ, 2వ ప్రేగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శించబడింది.[2][3]
నటవర్గం
[మార్చు]- తలైవాసల్ విజయ్
- రోహిణి
- పి.ఎల్.నారాయణ
- కె.కె.శర్మ
- ఏచూరి
- గోపాలరాజు
- ఎస్. భీమేశ్వరరావు
- దివ్య
- పద్మ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.సేతుమాధవన్
- నిర్మాత: ఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర
- కథ: పాలగుమ్మి పద్మరాజు
- చిత్రానువాదం: కె.ఎస్.సేతుమాధవన్
- మాటలు: పి.ఎల్. నారాయణ
- సంగీతం: ఎల్.వైద్యనాథన్
- ఛాయాగ్రహణం: ఎస్.శరవణన్
- కూర్పు: దండముడి రాజగోపాల్ రావు
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎల్.వైద్యనాథన్ సంగీతం అందించాడు.
- ఏడున్నడో నావోడు ఏడున్నడో (గానం: రేణుక)
- పరబ్రహ్మ పరమేశ్వర (గానం: వందేమాతరం శ్రీనివాస్)
- రాజు వెడల (గానం: వందేమాతరం శ్రీనివాస్)
పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ తెలుగు సినిమా - 1995
- స్పెషల్ మెన్షన్ - రోహిణి
మూలాలు
[మార్చు]- ↑ "Sthree (1995)". Indiancine.ma. Retrieved 2020-08-26.
- ↑ Articles: Movie Retrospect: Stri (1995) Archived 3 ఏప్రిల్ 2009 at the Wayback Machine
- ↑ Stri (1995) – Full Cast & Crew – IMDb