Jump to content

ఆషా సైని

వికీపీడియా నుండి
ఆషా సైని
జననం
ఫ్లోరా

చంఢీఘర్
వృత్తిమోడల్, నటి

ఆషా శైని ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది.[1]

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

ఆషా శైని చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె జన్మనామం ఫ్లోరా. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది.[2] తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం కోల్కతకు మారింది. అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. మిస్ కోల్కత అందాల పోటీల్లో పాల్గొనింది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైనిగా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు మార్చుకుని చివరికి ఆశా అనే పేరుకే స్థిరపడింది.[4] తర్వాత ఆమె 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. ఆమె సహాయ పాత్ర పోషించిన నరసింహ నాయుడు మంచి విజయం సాధించింది.[5]

2002 లో ఆమె టి. పి. అగర్వాల్ నిర్మించిన భారత్ భాగ్య విధాత సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.[6] ఆమె రెండో హిందీ చిత్రం లవ్ ఇన్ నేపాల్ చిత్రంలో గాయకుడు సోనూ నిగంతో కలిసి నటించింది. తర్వాత నమ్మణ్ణ, గిరి లాంటి కన్నడ సినిమాల్లో నటించింది.[7]

వివాదం

[మార్చు]

మార్చి 2008 లో ఆమెను చెన్నైలో నకిలీ వీసా కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు.[8] దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది.[9] కానీ ఆమె తాను నిర్దోషినని ప్రకటించింది.[10] దాంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.[11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1999 ప్రేమ కోసం ఐశ్వర్య తెలుగు
2000 అంతా మన మంచికే నిషా
సబ్సే బడా బీమాన్ హిందీ
యే హై గ్రీన్ సిగ్నల్
మనసున్న మారాజు తెలుగు
చాలా బాగుంది గంగా నది
2001 చెప్పాలని ఉంది
సర్దుకుపోదాం రండి నిషా
టైమ్‌పాస్
అక్కా బావెక్కడ శిల్పా
నవ్వుతు బతకలిరా
నరసింహ నాయుడు సంధ్య
ప్రేమతో రా అనిత
రౌడీషీటర్
శుభకార్యం
నువ్వు నాకు నచ్చావ్ ఆశా
2002 ఓ చినదానా ఆశా
అదృష్టం స్మిత / పింకీ
కోదండ రామ సంగీత కన్నడ
సొంతం ఆశా తెలుగు అతిధి పాత్ర
భారత్ భాగ్య విధాత షబ్నం హిందీ
2003 ఒట్టేసి చెబుతున్నా తెలుగు అతిధి పాత్ర
2004 లవ్ ఇన్ నేపాల్ మాక్సి హిందీ
143 టీవీ రిపోర్టర్ తెలుగు
స్వామి ప్రత్యేక ప్రదర్శన
గజేంద్ర కౌసల్య తమిళం
2005 గిరి కన్నడ
మిస్టర్ ఎర్రబాబు తెలుగు ప్రత్యేక ప్రదర్శన
నమ్మన్నా రాణి కన్నడ
సారీ ఎనకు కళ్యాణమైదిచు మంజు తమిళం
2006 కుస్తి అభి
2008 మైఖేల్ మదన కామరాజు మందిర తెలుగు
స్వాగతం దీప్తి
కుసేలాన్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
ధీమాకు ఇందిరా దేవి కన్నడ
చెడుగుడు తెలుగు
దిండిగల్ సారథి తమిళం ప్రత్యేక ప్రదర్శన
2009 ఆ ఇంట్లో పల్లవి తెలుగు
జంక్షన్ ప్రత్యేక ప్రదర్శన
2010 కామెడీ ఎక్స్‌ప్రెస్
నానే ఎన్నుల్ ఇల్లై తమిళం
కనగవేల్ కక్కా ప్రత్యేక ప్రదర్శన
బ్రోకర్ గణపతి భార్య. తెలుగు
విస్మయ ప్రమయ మీరా కన్నడ
వారే వాహ్ ఆది బాస్
2011 చట్టమ్ తెలుగు ప్రత్యేక ప్రదర్శన
మనీ మనీ, మోర్ మనీ
2012 దబాంగ్ 2 హిందీ రిపోర్టర్ గా అతిధి పాత్ర
2013 సిఐడి ఈషా కన్నడ
ఆకాశంలో సగం వాసు తెలుగు ప్రధాన నాయకుడు
సహస్ర ప్రత్యేక ప్రదర్శన
2014 పైసా యార్ ఎన్ పంగా మీరా పంజాబీ
యా రబ్ హిందీ
లక్ష్మి స్వర్ణ
2015 MSG: ది మెసెంజర్ ముస్కాన్
ధనాక్ జిప్సీ మహిళ
గుడ్డు కీ గన్ నర్స్
2016 దో లఫ్జోన్ కి కహానీ నటాషా
2017 బేగం జాన్ మైనా
2018 స్ట్రీ స్ట్రీ
2019 మోసం సైయాన్ శ్రద్ధా
2020 బహుత్ హువా సమ్మాన్ సప్నా రాణి
దర్బాన్ చారుల్ త్రిపాఠి
2021 12 'O' గడియారం మాయ డిసౌజా
200 హల్లా హో పూర్ణిమ
చడ్డీ శ్రీమతి చద్దా
2022 36 ఫామ్‌హౌస్ మిథికా సింగ్
2023 ఖిచ్డీ 2: మిషన్ పాంతుకిస్థాన్ రాణి గుల్కంద - పాంతుకిస్థాన్ రాణి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాష గమనికలు
2019 అప్నా న్యూస్ ఆయేగా హిందీ
2020 మేరే సాయి - శ్రద్ధా ఔర్ సబూరి సువర్ణా బాయి, ఒక మహిళా గాయని మరియు నర్తకి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రీమియర్ అయిన ఒక పౌరాణిక టీవీ సీరియల్.
2025 బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]

అన్ని వెబ్ సిరీస్‌లు హిందీ భాషలోనే ఉన్నాయి, లేకుంటే భాషను గమనించండి .

సంవత్సరం సిరీస్ పాత్ర వేదిక గమనికలు మూ
2016 భారతదేశంలో పనిమనిషి పనిమనిషి వెబ్‌టాకీలు
2016 AISHA మై వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ మరియం జేమ్స్ OTT కి ముందు
2018 గాండీ బాత్ సజెల్లి ఆల్ట్ బాలాజీ S02E01 ద్వారా మరిన్ని
XXX తెలుగు రుక్మణి లాల్వాని S01E01 ద్వారా మరిన్ని
2018- 2019 ఇన్‌సైడ్ ఎడ్జ్ ఆయేషా దివాన్ అమెజాన్ ప్రైమ్ సీజన్ 1 పునరావృతమవుతుంది; సీజన్ 2 మెయిన్
2019 మంచి సమయం గడపాలనుకుంటున్నారా? ఉల్లు
బాంబర్లు మంత్రి భార్య జీ5
డూపూర్ ఠాకూర్పో ఫుల్వా బౌడి హోయిచోయ్ బెంగాలీ వెబ్ సిరీస్‌లు
సిటీ ఆఫ్ డ్రీమ్స్ మిస్టరీ ఉమెన్ హాట్‌స్టార్
2020 ఆర్య రాధిక "రాడ్స్" సీజన్ 1 పునరావృతమవుతుంది
2020 పౌరష్‌పూర్ నయనతార ZEE5 , ALT బాలాజీ పునరావృతమయ్యే
2021 అక్కడ్ బక్కడ్ రఫు చక్కర్ పిసి అమెజాన్ ప్రైమ్
2023 రానా నాయుడు కావ్య నెట్‌ఫ్లిక్స్
2023 ది ట్రయల్ (భారతీయ టీవీ సిరీస్) అనిషా మీనన్ డిస్నీ+హాట్‌స్టార్

మూలాలు

[మార్చు]
  1. Vinita Chaturvedi (2011-12-19). "Flora Saini: Another southern hottie ready to storm Bollywood". The Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 2013-01-11.
  2. Deepa Natarajan (2010-04-22). "Rising like a phoenix". Deccanherald.com. Retrieved 2013-01-11.
  3. "Love in Delhi, the Fllora way". The Hindu. 2003-08-28. Archived from the original on 2003-10-24. Retrieved 2013-01-11.
  4. Y Sunita Chowdhary (2012-02-18). "Arts / Cinema : Itsy-Bitsy: Name game". The Hindu. Archived from the original on 2012-07-19. Retrieved 2013-01-11.
  5. "Welcome to". Sify. Archived from the original on 2013-02-02. Retrieved 2013-08-17.
  6. "rediff.com, Movies: Puru, Chandrachur: Face off!". Rediff. 2001-04-30. Retrieved 2013-01-11.
  7. "Karnataka / Bangalore News : Flora Shiny had acted in Kannada movies". The Hindu. 2008-03-15. Archived from the original on 2008-03-18. Retrieved 2013-01-11.
  8. "Asha Saini arrested in Chennai". Sify. Archived from the original on 2013-02-02. Retrieved 2013-01-11.
  9. "Aasha Saini aka Mayuri arrested en route to the US". IndiaGlitz. 2008-03-12. Archived from the original on 2008-03-14. Retrieved 2013-01-11.
  10. "Asha Saini claims innocence". Sify. 2008-03-28. Archived from the original on 2019-01-20. Retrieved 2013-08-17.
  11. "Actress relieved from ban". IndiaGlitz. 2008-07-24. Archived from the original on 2008-07-25. Retrieved 2013-01-11.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆషా_సైని&oldid=4638644" నుండి వెలికితీశారు